Saina
-
ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలకు చూస్తూ ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటి? ఏ ప్లాట్‌ఫాంలో ఎప్పుడు రిలీజ్ కానున్నాయి వంటి వివరాలు చూసేద్దాం. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించారు. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్22న విడుదలయ్యింది. కార్తీ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'సుల్తాన్. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత కార్తీ ఈ మూవీలో నటించారు.తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం.బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మే 2 ఆహాలో విడుదల కానుంది. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "రాబర్ట్". తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో కొడుకు ఓ గ్యాంగ్‌స్టర్‌తో పడిన ఇబ్బందుల నుంచే ఎలా భయపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కన్నడలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. జగపతి బాబు రవి కిషన్, వినోద్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ‘ఆహా’లో ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పవన్‌తేజ్. ఈయన నటించిన డెబ్యూ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘనా, లక్కీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే పవన్ తేజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
సైనాలానే ఉందే!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో పరిణీతీ చోప్రా లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన సైనా నెహ్వాల్ ‘అచ్చు నాలానే ఉందే’ అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్ సాధన చేశారు. బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్‌కు రానుంది. -
క్వార్టర్స్‌లో సింధు, సైనా
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆరంభ బ్యాడ్మింటన్ టోర్నీ అయిన మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా... పురుషుల విభాగంలో మాత్రం హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో పీవీ సింధు 21–10, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందింది. ఆయా ఓహోరిపై సింధుకిది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 25–23, 21–12తో టోర్నీ ఎనిమిదో సీడ్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా... కీలక సమయంలో పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఆన్ సె యంగ్ చేతిలో ఎదురైన ఓటమికి సైనా ప్రతీకారం తీర్చుకున్నట్లంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు; మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సమీర్ వర్మ 19–21, 20–22తో లీ జి జియా (మలేసియా) చేతిలో, ప్రణయ్ 14–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో వరుస సెట్లలో ఓడి ఇంటి ముఖం పట్టారు. -
మా జాగ్రత్తలు ఫలించలేదు
‘సైనా’ చిత్రానికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అమోల్ గుప్తా ‘సైనా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలి సిందే. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. చిత్రీకరణ కూడా ప్రారంభించారు. శ్రద్ధాకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ప్రాక్టీస్ సమయంలో గాయపడటం, డేట్స్ క్లాష్ అవ్వడం.. ఇలా పలు కారణాలతో ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్నారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్ పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా పచ్చజెండా ఊపారు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. చిత్రీకరణ మొదట్లోనే పరిణీతి చోప్రా గాయపడటం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది. ‘‘బ్యాడ్మింటన్ సాధనలో భాగంగా గాయపడకూడదని నేనూ, చిత్ర బృందం చాలా జాగ్రత్తలు వహించాం. కానీ, మా జాగ్రత్తలు ఫలించలేదు. నేను గాయపడ్డాను. కోలుకొని త్వరలో చిత్రీకరణలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. -
చైనా చేతిలో భారత్ చిత్తు
నానింగ్ (చైనా): మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వ్యూహాత్మక తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు... పదిసార్లు చాంపియన్ చైనాతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్ నుంచి లీగ్ దశలోనే భారత్ ఇంటిదారి పట్టింది. గ్రూప్ ‘1డి’లో భాగంగా బుధవారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–5తో ఓటమి చవిచూసింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనాపై కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నిరాశాజనక ప్రదర్శన కనబర్చారు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 5–21, 11–21తో వాంగ్ యిల్యు–హువాంగ్ డాంగ్పింగ్ జోడీ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 17–21, 20–22తో చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. ప్రాక్టీస్ సందర్భంగా గాయం కావడంతో చైనాతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ట్విటర్లో పేర్కొన్నాడు. మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ బదులు సమీర్ వర్మను ఆడించిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–18, 15–21, 17–21తో హావోడాంగ్ జు–హాన్ చెంగ్‌కాయ్ జంట చేతిలో పరాజయం పాలైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా 12–21, 17–21తో చెన్ యుఫె చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 12–21, 15–21తో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
శ్రద్ధా కపూర్ ఔట్.. పరిణితీ ఇన్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’.. విభిన్న చిత్రాల దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైనా బయోపిక్ కోసం కొంత కాలం గ్రౌండ్ వర్క్ చేసిన శ్రద్ధాకపూర్... బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. లుక్స్ పరంగా కూడా సైనా నెహ్వాల్‌కు దగ్గరగా ఉండే శ్రద్ధాకపూర్... స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందనే క్యూరియాసిటీ కూడా జనాల్లో పెరిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం సైనా బయోపిక్ నుంచి శ్రద్ధ తప్పుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో శ్రద్ధకు డెంగ్యూ జ్వరం సోకండంతో గతేడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఉన్న శ్రద్దకు ‘సైనా’చిత్రానికి డేట్స్ కుదరటం లేదు. దీంతో తన కారణంగా ఈ సినిమా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నుంచి శ్రద్ద తప్పుకున్నారు. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ 2020లో విడుదల చేయాలనుకుంటున్న చిత్ర బృందం.. శ్రద్ద స్థానంలో మరో హీరోయిన్ పరిణీతి చోప్రాను తీసుకున్నారు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్స్ 3D’, ‘భాగి 3’ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. -
టోక్యో ఒలింపిక్స్ వరకు... ‘టాప్’లో సైనా, సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుస్తున్న మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) పథకాన్ని పొడిగించారు. సింగిల్స్‌లో వీరిద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్లకూ టోక్యో ఒలింపిక్స్–2020 దాకా ‘టాప్’ చేయూతనిచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ‘టాప్’ జాబితాను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ప్రకటించింది. అయితే మరో తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్, లక్ష్య సేన్లను ఈ జాబితా నుంచి తప్పించింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రాలు ‘టాప్’ జాబితాలో ఉన్నారు. కాగా ప్రదర్శన బాగుంటే టాప్‌లో చేర్చే ‘వాచ్‌లిస్ట్’ లో జక్కంపూడి మేఘన, పూర్వీషారామ్, మను అత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ‘2024 ఒలింపిక్స్ డెవలప్మెంటల్ గ్రూప్’లో సైక్లింగ్‌ను చేర్చే అంశాన్ని బుధవారం నాటి సమావేశంలో చర్చించారు. జూనియర్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల భారత్ 10 పతకాలు సాధించింది. దీంతో సైక్లిస్ట్‌లు అల్బెన్, రొనాల్డో సింగ్, జేమ్స్ సింగ్, రోజిత్ సింగ్‌లను ఈ డెవలప్మెంటల్ తుది జాబితాలో చేర్చారు. పారాలింపియన్లకు అండదండ... తాజా ‘టాప్’ పథకంలో పారా అథ్లెట్లకు పెద్దపీట వేశారు. పారాలింపిక్స్, పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తుండటంతో ఈసారి ఏకంగా 12 మంది పారా అథ్లెట్లను ఎంపిక చేశారు. పారా ఆసియా క్రీడల స్వర్ణ విజేత శరద్ కుమార్ (హైజంప్), వరుణ్ భటి (హైజంప్), జావెలిన్ త్రోయర్లు సందీప్ చౌదరి, సుమిత్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, అమిత్ సరోహ (క్లబ్ త్రోయర్), వీరేందర్ (షాట్‌పుట్), జయంతి బహెరా (మహిళల 400 మీ. పరుగు) ‘టాప్’ జాబితాలో ఉన్నారు. -
సింధుకు చుక్కెదురు
ఓడెన్స్: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ... పలు టోర్నీలలో ఫైనల్‌కు చేరుకొని తుది పోరులో తడబడుతోన్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్‌లో మాత్రం నిరాశ ఎదురైంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ పోరాట పటిమ ముందు సింధు చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 17–21, 21–16, 18–21తో ప్రపంచ పదో ర్యాంకర్ బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో చెరో గేమ్ గెలిచాక... నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు రెండుసార్లు 13–12తో... 15–13తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే బీవెన్ జాంగ్ వెంటనే తేరుకొని వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–15తో ముందంజ వేసింది. అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. బీవెన్ జాంగ్ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో, 2017 ఇండోనేసియా ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ బీవెన్ జాంగ్ చేతిలో సింధుకు పరాజయం ఎదురైంది. వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లో బీవెన్ జాంగ్తోనే సింధు తలపడనుంది. గతేడాది అక్టోబరు 18న డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో చెన్ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయాక ఈ హైదరాబాద్ అమ్మాయికి మళ్లీ డెన్మార్క్ ఓపెన్లోనే తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. అయితే ఈ ఏడాది కాలంలో సింధు హాంకాంగ్ ఓపెన్, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, థాయ్‌లాండ్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, ఇండియా ఓపెన్లలో ఫైనల్లోకి చేరి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ హోరాహోరీ పోరులో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ 24వ ర్యాంకర్ యి ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)తో 81 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 20–22, 21–17, 24–22తో విజయం సాధించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 20–21తో, 21–22తో రెండుసార్లు పరాజయం అంచున నిలిచింది. అయితే కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా పాయింట్లు సాధించి గట్టెక్కింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా తలపడుతుంది. సమీర్ సంచలనం పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ షు యుకి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–17, 21–18తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి 23–25, 21–18, 16–21తో కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ (డెన్మార్క్) చేతిలో... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. -
అదరం.. బెదరం
అందంగా కనిపించాలి. ప్రేమలో పడాలి. పాటల్లో గ్లామరస్‌గా కనిపించాలి. టైమ్ వచ్చినప్పుడు డైలాగ్స్ చెప్పి సీన్ నుంచి మాయం అవ్వాలి... హీరోయిన్లంటే ఇంతేనా? ఊహూ.. ఆ కాలం పోయింది. ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథా బలం ఉన్న స్క్రిప్ట్ దొరికి, మంచి క్యారెక్టర్ పడితే మేం ఎందులో తక్కవ? అనేలా నటిస్తున్నారు హీరోయిన్లు. అన్నమాటకు కట్టుబడేలా కష్టపడతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు బెదరడం లేదు. పైగా డూప్ లేకండా యాక్షన్ సన్నివేశాలను అదరగొడుతున్నారు. ఈ క్రమంలో దెబ్బలు తగిలితే భయపడటం లేదు. సరి కదా లొకేషన్లో షాట్ కంప్లీట్ చేసిన తర్వాతనే హాస్పిటల్‌కి పోదాం అంటున్నారు. ఇటీవల అలా గాయాలపాలైన కొందరు కథానాయికల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో కంగనా రనౌత్ ఎంతటి ప్రతిభాశాలో అంతే ధైర్యశాలి. ఇందుకు సినిమాల్లో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, ఏదైనా విషయం గురించి బాహాటంగా నిర్భయంగా మాట్లాడే తీరు నిదర్శనం. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనారనౌత్. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో రెండు సార్లు గాయపడ్డారామె. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఆమె కాలు విరగ్గొట్టుకున్నారు. ఒకసారి గాయపడ్డ తర్వాత కూడా యాక్షన్ సన్నివేశాలు చేయడానికి కంగనా బెదరలేదు. మళ్లీ కత్తి పట్టి, షూట్‌లోకి దూకారు. కాంప్రమైజ్ కాలేదు. మళ్లీ గాయపడ్డారు. ఈసారి కత్తి నుదుట మీద తగిలింది. 16 కుట్లు పడ్డాయి. అయినా కంగనా తగ్గడం లేదు. సేమ్ కమిట్మెంట్తో ఫైట్సీన్స్లో పాల్గొంటున్నారు. మరి.. కంగనానా? మజాకానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఇక, ఈ ఏడాది మార్చిలో 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆలియా భట్‌కు బర్త్‌డే ముగిసిన రెండు రోజుల్లోనే చేదు అనుభవం ఎదురైంది. బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లొకేషన్లో గాయపడ్డారామె. ఓ యాక్షన్ సీన్ చేసే టైమ్‌లో అదుపు తప్పి చేయి విరగ్గొట్టుకున్నారు కానీ ముఖంపై చిరునవ్వును మాత్రం వదిలిపెట్టలేదు. ఆ రోజంతా షూటింగ్లో పాల్గొని, సాయంత్రమే లొకేషన్ని వదిలిపెట్టి వెళ్లారు. కమిట్మెంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పారు. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య తారలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరో బ్యూటీ శ్రద్ధా కపూర్ విషయానికి వద్దాం. ప్రస్తుతం వెండితెరపై సైనా నెహ్వాల్‌గా చేస్తున్న శ్రద్ధాకపూర్ ఏం చేస్తున్నారో తెలుసా? బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే జ్వరం నుంచి కోలుకుంటున్నారు. ఇంతకీ శ్రద్ధాకు జ్వరం రావడానికి కారణం ఏంటంటే.. ‘సైనా’ చిత్రం కోసం శ్రద్ధా బ్యాడ్మింటన్ గేమ్‌కు స్ట్రాంగ్‌గా ప్రిపేర్ కావడమేనట. బాగా అలసిపోయి, జ్వరం తెచ్చుకున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న ‘సైనా’కు అమోల్ గుప్టే దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్లకన్నా ముందే గాయాల క్లబ్లో చేరారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘రేస్ 3’ సినిమా షూటింగ్ టైమ్‌లో ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే సామెతను హిందీలో గుర్తు చేసుకుని ఉండి ఉంటారు కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటే... ఆ సినిమా సెట్లో జాక్వెలిన్ కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. కంటికి ఏదైనా దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉందా? కెరీర్ క్లోజ్ అయిపోదూ. కానీ ఇంత కష్టపడ్డ జాక్వెలిన్‌కు ఈ చిత్రం చేదు అనుభావాన్నే మిగిల్చింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘రేస్3’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో దిశా పాట్నీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో జిమ్నాస్టిక్స్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నారామె. ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ టైమ్‌లో దిశా గాయపడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాది భామలేనా? మన దక్షిణాది భామలకు కూడా బోలెడంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఒకసారి సౌత్‌కు వస్తే... యాక్షన్ సీన్స్‌లో నవ్వులపాలు కాకూడదని డిసైడ్ అయ్యారు అమలాపాల్. అందుకు ఎందాకైనా తెగించాలని డిసైడ్ అయ్యారు. తమిళ సినిమా ‘అదో అంద పరవై పోల’ కోసం అడవిలో నైట్ షూట్‌కి సై అన్నారు. నాలుగైదు రోజులు షూటింగ్ సజావుగానే సాగిందట. కానీ ఓ బ్యాడ్ డే ఓ ఫైట్ సీన్ కోసం ఆమె చేతిని విరగ్గొట్టుకున్నారు. లొకేషన్లో చాలా రక్తం పోయింది. కానీ వెంటనే అమలాపాల్ ఆసుపత్రికి పోలా. ఆ సీన్ షూట్‌ను కంప్లీట్ చేసి, డాక్టర్ రూమ్ డోర్ నాక్ చేశారు. ఈ గాయం గురించి అమలాపాల్ ఏమన్నారో తెలుసా. ‘‘శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోతే హీరో అనిపించుకోలేం’’ అన్నారు. ఇలా అమలాపాల్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్లో కనిపిస్తారామె. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అదా శర్మ అయితే పొరపాటున తన చేతివేలిని తానే చితక్కొట్టుకున్నారు. యాక్షన్ సీన్లో భాగంగా కారు డోర్‌ని విసురుగా వేసేటప్పుడు మరో చేతిని డోర్ మీద నుంచి తీయడం మరచిపోయారు. ఇది ‘కమాండో 3’ సెట్లో జరిగింది. పాపం.. అదాశర్మ నొప్పితో అల్లాడిపోయారు. అయినా టైమ్ వేస్ట్ కానివ్వకుండా షూటింగ్లో పాల్గొన్నారు. అదా ధైర్యం ఉన్న యువతి అని చిత్రబృందం మెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం హ్యాపీగా షూట్లో పాల్గొంటున్నారు. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారీ సినిమాలో .ఈ సినిమాకు విపుల్ షా డైరెక్టర్. అలాగే రాజమండ్రి షెడ్యూల్లో ‘రంగస్థలం’ సినిమా కోసం కంటిన్యూస్‌గా వర్క్ చేయడంతో ఓ రోజు చేతి నొప్పితో విలవిల్లాడిపోయారు ఆ సినిమా కథానాయిక రామలక్ష్మీ.. అదేనండీ మన సమంత. అంతేనా.. ఈ సినిమా షూట్ వేసవి టైమ్‌లో జరిగినప్పుడు వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయారట. మొన్నా మధ్య గౌతమ్ హీరోగా నటించిన చిత్రం ‘మను’. ఈ సినిమా సెట్‌ను హైదరాబాద్‌కు దూరంగా వేశారు. ఆ సెట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో దాదాపు నెల రోజులు వైరల్ ఫీవర్‌తో షూట్‌కు దూరమైయ్యారు చాందినీ చౌదరి. అలాగే ‘నేల టిక్కెటు’్ట సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మాళవికా శర్మ కూడా సెట్లో గాయపడ్డారు. కానీ ఇది చిన్న గాయమే కావడంతో వెంటనే కోలుకున్నారు. ఇలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్‌కి అయినా∙రెడీ అంటున్నారు ఈ తరం హీరోయిన్లు. పాటలకే కాదు.. ఫైట్స్‌కి కూడా పనికొస్తామని నిరూపించుకుంటున్నారు. గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. మళ్లీ గాయం అయినా ఫర్వాలేదనుకుంటున్నారు. ‘డోంట్ కేర్’.. ఇది మన హీరోయిన్ల కొత్త నినాదం. అదా శర్మ, అమలా పాల్, కంగనా, జాక్వెలిన్, ఆలియా భట్ -
గెలుపు కోసం...
బరిలో దిగిన ఇద్దరు ఆటగాళ్లూ ప్రతిభావంతులైనప్పుడు గేమ్ భలే మజాగా ఉంటుంది. ఇలాంటి గేమ్‌లో పాయింట్ గెలుచుకోవడానికి ఇద్దరూ చెమటోడ్చాల్సిందే. అదే చేస్తున్నట్లున్నారు కథానాయిక శ్రద్ధాకపూర్. ఆ విషయం ఇక్కడున్న ఫొటోను చూస్తూంటే అర్థం అవుతుంది. ప్రముఖ హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘సైనా’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. -
‘సైనా’ షూటింగ్ షురూ!
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. నార్త్, సౌత్ తేడాలేకుండా పలు భాషల్లో బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తెలుగులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, తమిళ్లో జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై తీయబోతోన్న సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ‘సైనా’ గా రాబోతోన్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ లీడ్ రోల్‌ను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మించనుండగా, అమోల్ గుప్తే దర్శకత్వం వహించనున్నాడు. IT'S OFFICIAL... Shraddha Kapoor as Saina Nehwal... #SainaNehwalBiopic starts filming from 22 Sept 2018... Directed by Amole Gupte... Produced by Bhushan Kumar. pic.twitter.com/Vw4wmgF38R — taran adarsh (@taran_adarsh) 24 September 2018 -
సైనా,కశ్యప్ పెళ్లి చేసుకోబోతున్నారా?
-
హైదరాబాద్ చేరుకున్న సైనా,పీవీ సింధు
-
సైనా ఇంటికి... సింధు సెమీస్‌కి
టాప్ సీడ్ సింధు ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆడుగులు వేస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కథ క్వార్టర్స్‌లో ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి జోడీ సెమీస్ చేరింది. న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బరిలో భారత్ నుంచి సింగిల్స్‌లో సింధు, డబుల్స్‌లో సిక్కి రెడ్డి మిగిలారు. మిగతా వారంతా క్వార్టర్‌ఫైనల్స్‌కే పరిమితమయ్యారు. ఈ ఏడాది తొలి టైటిల్‌పై కన్నేసిన భారత స్టార్, టాప్ సీడ్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేసియా టోర్నీ రన్నరప్, నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోనే కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్ పరాజయం చవిచూశారు. శ్రమించిన సింధు... ఈ టోర్నీలో అలవోక విజయాలతో నెగ్గుకొచ్చిన సింధుకు క్వార్టర్స్‌లోనూ అలాంటి ఫలితమే ఎదురవుతుందని తొలి గేమ్‌తో అనిపించింది. కానీ రెండో గేమ్‌లో ఆమె ప్రత్యర్థి బియట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్) నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సింధు ఈ టోర్నీలో తొలిసారి మ్యాచ్ గెలిచేందుకు మూడో గేమ్ వరకు పోరాడింది. చివరకు తెలుగు తేజం 21–12, 19–21, 21–11తో గెలుపొందింది. సెమీఫైనల్లో సింధు... ప్రపంచ మూడో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సైనా 10–21, 13–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–8, 21–13తో హన్ చెంగ్‌కాయ్–కా తొంగ్ వీ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 13–21తో మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) 21–17, 21–14తో సమీర్ వర్మను ఓడించగా, కశ్యప్‌నకు 16–21, 18–21తో కియావో బిన్ (చైనా) చేతిలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ మేఘన–పూర్వీషా జంట 10–21, 15–21తో జోంగ్ కొల్ఫన్ – ప్రజోంగ్జయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో, సిక్కి–అశ్విని జంట 17–21, 21–23తో డు యుయి–యిన్హుయ్ (చైనా) ద్వయం చేతిలో కంగుతిన్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని జంట 17–21, 11–21తో క్రిస్టియన్సన్–క్రిస్టినా (డెన్మార్క్) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్‌లో మనూ–సుమీత్ రెడ్డి ద్వయం 19–21, 19–21తో ఫెర్నాల్డి–çసుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడాయి. -
శ్రీకాంత్, ప్రణయ్ ముందుకు
∙ సింధు, సైనా, సమీర్ ఇంటికి ∙ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్స్‌కు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సమీర్ వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ పరాజయం చవిచూశారు. అలవోకగా...: వరుసగా మూడో సూపర్ సిరీస్ టైటిల్‌పై దృష్టి పెట్టిన శ్రీకాంత్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ 27వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ కేవలం 29 నిమిషాల్లో గెలుపొందాడు. ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–11తో హు యున్ను ఓడించాడు. హు యున్‌తో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్లు చొప్పున సాధించడం విశేషం. ‘మ్యాచ్ బాగా జరిగింది. హు యున్ ప్రమాదకర ప్రత్యర్థి. అతనికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇచ్చినా ఇబ్బంది తప్పదు. అందుకే నిలకడగా పాయింట్లు సాధించడంపైనే దృష్టి పెట్టాను’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–16, 23–21తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... సమీర్ వర్మ 21–10, 17–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... షి యుకితో ప్రణయ్ తలపడతారు. ఈసారి ఏకపక్షం...: మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో ఓడిపోయింది. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ మూడోసారి ముఖాముఖిగా తలపడటం విశేషం. ఈ విజయంతో గతవారం కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా బదులు తీర్చుకుంది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు ఆ తర్వాత చివర్లో 18–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒకుహారా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకుహారా జోరు పెంచగా... సింధు డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాకపోవడం గమనార్హం. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో, కొరియా ఓపెన్ ఫైనల్లో వీరిద్దరి మధ్య పాయింట్ల కోసం సుదీర్ఘ ర్యాలీలు జరగ్గా, ఈసారి అవి అంతగా కనబడలేదు. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 16–21, 13–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో 14–10తో... రెండో గేమ్‌లో 6–4తో ఆధిక్యంలో వెళ్లినప్పటికీ దీనిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది. క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ జోడీ: మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ ద్వయం 21–13, 21–17తో యుకి కనెకో–కొహారు యెనెమోటో (జపాన్) జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్పప్ప (భారత్) జోడీ 27–29, 21–16, 12–21తో నాలుగో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–డెబ్బీ సుశాంతో (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
శ్రీకాంత్ శుభారంభం
►ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ►సింధు, సైనా, సమీర్ వర్మ కూడా టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 12–21, 21–11తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. హువీతో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఆడిన శ్రీకాంత్ రెండోసారి మాత్రమే నెగ్గడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–12, 21–14తో అంటోన్సెన్ (డెన్మార్క్)పై, సమీర్ వర్మ 21–12, 21–19తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. అయితే సాయిప్రణీత్ 23–21, 17–21, 14–21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో, సౌరభ్ వర్మ 21–11, 15–21, 13–21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 12–21, 21–15, 21–17తో మినత్సు మితాని (జపాన్)పై, సైనా 21–17, 21–9తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు; రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా; హు యున్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్; షి యుకి (చైనా)తో సమీర్ వర్మ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 21–17, 21–13తో ఇస్రియానెత్–పచారపున్ (థాయ్‌లాండ్)లపై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 25–27, 15–21తో గిడియోన్–కెవిన్ (ఇండోనేసియా) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 15–21తో లీ జె–హుయ్–లీ యాంగ్ (కొరియా) చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నçప్ప 17–21, 12–21తో చాంగ్ యె నా–లీ సో హీ (కొరియా) చేతిలో ఓడిపోయారు. -
మరో ‘సూపర్’ టైటిల్ లక్ష్యంగా...
►జపాన్ ఓపెన్ బరిలో సింధు ►సైనా, శ్రీకాంత్‌లపై దృష్టి టోక్యో: వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ బరిలోకి దిగనుంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో... మహిళల సింగిల్స్‌లో సింధుతోపాటు సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తొలి రోజు క్వాలిఫయింగ్‌తోపాటు మిక్స్డ్ డబుల్స్‌లో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)తో కశ్యప్ ఆడతాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మితాని మినత్సు (జపాన్)తో సింధు... పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా తలపడతారు. ఒకవేళ సింధు తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) లేదా చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)లతో ఆడే చాన్స్ ఉంది. మరోవైపు సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి గా రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్) లేదా చెన్ జియోజిన్ (చైనా) ఎదురవుతారు. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఒకుహారాపై సింధు గెలిచి టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉండటంతో వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది. -
సైనా, సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో వారిరువురు కాంస్య, రజిత పతకాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సైనా, సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్ చేశారు. Well played #Sindhu. Congratulations @NSaina & @Pvsindhu1 for bringing home bronze & silver. — YS Jagan Mohan Reddy (@ysjagan) 28 August 2017 -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ ఓటమి
గ్లాస్కో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత్ అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. స్కాట్లాండ్ లో శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 14-21, 18-21 తో వరల్డ్ నంబర్ వన్ షట్లర్ సన్ వాన్ చేతిలో ఓడిపోయాడు. 49 నిమిషాల పాటు జరిగిన పోరులో సన్ వాన్ అనుభవం ముందు శ్రీకాంత్ తేలిపోయాడు. తొలి గేమ్ ను పెద్దగా ప్రతిఘటించకుండానే కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ లో మాత్రం కడవరకూ పోరాడి ఓటమి చెందాడు. దాంతో టోర్నీ నుంచి శ్రీకాంత్ భారంగా నిష్ర్కమించాడు. ఈ ఓటమితో వరల్డ్ చాంపియన్ షిప్ లో పతకం సాధించాలనుకున్న శ్రీకాంత్ ఆశలు తీరలేదు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో పివీ సింధు, సైనా నెహ్వాల్ లు క్వార్టర్ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. -
సింధు శ్రమించి...
►క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ►శ్రీకాంత్, సైనా ముందుకు.. సాయి ప్రణీత్ అవుట్ ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింధు ప్రిక్వార్టర్స్ ప్రత్యర్థి ఎన్గాన్ యి చెయుంగ్. ఈ హాంకాంగ్ అమ్మాయిపై గతంలో మూడు సార్లు అలవోక విజయం సాధించిన రికార్డు సింధుది. ఆమె ఫామ్ దృష్ట్యా ఈసారి కూడా అదే ఫలితమని భావించినా... మ్యాచ్ మాత్రం మరోలా సాగింది. ఎన్గాన్ పట్టుదలగా ఆడటంతో మ్యాచ్ తుదికంటా హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు ఒక దశలో రెండో గేమ్‌లోనూ వెనుకబడింది. చివరకు తన అనుభవాన్నంతా రంగరించి మ్యాచ్‌లో నిలిచిన తెలుగమ్మాయి, మూడో గేమ్ విజయంతో గట్టెక్కింది. గ్లాస్గో: అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పీవీ సింధు ఆపసోపాలు పడింది. సులువైన ప్రత్యర్థితో తలపడుతూ కూడా ఓటమి దిశగా వెళ్లినట్లు కనిపించింది. అయితే చివరకు తన అసలు సత్తాను ప్రదర్శించి కీలక సమరంలో విజయాన్ని అందుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సింధు 19–21, 23–21, 21–17తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. మరో వైపు సైనా నెహ్వాల్ అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 13వ సీడ్ అజయ్ జయరామ్, 15వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. అజయ్ 11–21, 10–21తో ఐదో సీడ్ చెన్ లాంగ్ చేతిలో పరాజయం చవిచూడగా, సాయిప్రణీత్ 21–19, 10–21, 12–21తో ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతిన్నాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సివచ్చింది. 13వ సీడ్ ఎన్గాన్ ఆరంభం నుంచి పట్టుబిగించడంతో పోటాపోటీగా సాగిన తొలి గేమ్‌ను హాంకాంగ్ ప్లేయర్ వశం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ తన దూకుడు పెంచడంతో సింధు 13–16తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో సర్వశక్తులు ఒడ్డి నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. ఐతే చెయుంగ్ కూడా దీటుగా పాయింట్లు సాధిస్తుండటంతో ఉత్కంఠ పెరిగింది చివరకు 21–21 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న హైదరాబాదీ స్టార్ నిర్ణాయక మూడో గేమ్‌లో మొదటి నుంచి జాగ్రత్తగా ఆడింది. నెట్ వద్ద చురుగ్గా స్పందించిన ఆమె స్మాష్‌లతో రాణించింది. 5–1తో టచ్‌లోకి వచ్చిన ఆమె 12–8 స్కోరు వరకు ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో ఎన్గాన్ వరుసగా 4 పాయింట్లు చేసి 12–12తో స్కోరును సమం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన సింధు వరుసగా మూడు పాయింట్లు చేసి జోరు పెంచింది. 21–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. మరో ప్రి క్వార్టర్స్‌లో 12వ సీడ్ సైనా 21–19, 21–15తో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–18తో 14వ సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. వరుస గేముల్లో 42 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి గేమ్ ఆరంభంలో కాసేపు మాత్రమే పోటీనిచ్చిన డెన్మార్క్ ఆటగాడు ఆ తర్వాత తేలిగ్గానే చేతులెత్తేశాడు. 5–6తో ఉన్న శ్రీకాంత్ వరుసగా 6 పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వచ్చాడు ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం రాని హైదరాబాద్ ఆటగాడు నిమిషాల వ్యవధిలో గేమ్‌ను ముగించాడు. తర్వాత రెండో గేమ్‌లో రెట్టించిన ఉత్సాహాన్ని కనబరిచిన అతను 11–3తో ఆధిపత్యాన్ని చాటాడు. అయితే ఆంటోన్సెన్ వరుసగా ఆరు పాయింట్లు సాధించి నిలువరించే ప్రయత్నం చేసినా... శ్రీకాంత్ నెట్‌వద్ద తెలివిగా ఆడి పైచేయి కొనసాగించాడు. చివరి దాకా ఆధిక్యంలోనే నిలిచిన ఈ ప్రపంచ పదో ర్యాంకర్ 21–18తో గేమ్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో 15వ సీడ్ సిక్కిరెడ్డి– ప్రణవ్ చోప్రా ద్వయం 22–20, 18–21, 18–21తో ఆరో సీడ్ డెబ్బి సుశాంటో–ప్రవీణ్ జోర్డాన్ జంట చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... టాప్‌సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో, మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు... ఐదో సీడ్ సన్ యూ (చైనా)తో, గిల్మోర్ (స్కాట్లాండ్), బింగ్ జియావో (చైనా) మ్యాచ్ విజేతతో సైనా తలపడుతుంది. -
విజయం అంచుల్లోంచి...
మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, డిఫెండింగ్ చాంపియన్ సైనా పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ సింధు 21–10, 20–22, 16–21తో ఓడింది. తొలి గేమ్‌ను గెలిచిన సింధు రెండో గేమ్‌లో 20–19తో విజయం అంచుల్లో నిలిచింది. మరో పాయింట్ సాధిస్తే విజయం ఖాయమయ్యే స్థితిలో సింధు వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మూడుసార్లు (8–4, 12–9, 14–10) ఆధిక్యంలో నిలిచినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. గత ఏడాది రన్నరప్ సన్ యు (చైనా)తో 78 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–10, 17–21తో పోరాడి ఓడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 15–13తో ఆధిక్యంలో ఉన్న దశలో తన ప్రత్యర్థికి వరుసగా ఏడు పాయింట్లు సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. -
మరో టైటిల్‌పై సాయిప్రణీత్ గురి!
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్ బరిలో సైనా, కశ్యప్, గురుసాయిదత్ బ్యాంకాక్: గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గి మంచి ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయిప్రణీత్ మూడో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. 64 మందితో కూడిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి 16 మంది క్రీడాకారులు ఉండటం విశేషం. సాయిప్రణీత్‌తోపాటు కశ్యప్, గురుసాయిదత్, సౌరభ్ వర్మ, రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్, సిరిల్ వర్మ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో నథానియల్ (ఇండోనేసియా)తో సాయిప్రణీత్, మౌలానా (ఇండోనేసియా)తో గురుసాయిదత్, ద్రాత్వా (స్లొవేకియా)తో కశ్యప్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో 2012 చాంపియన్ సైనా నెహ్వాల్‌తోపాటు గద్దె రుత్విక శివాని, శ్రీకృష్ణప్రియ, రితూపర్ణ దాస్, సాయి ఉత్తేజిత రావు, శైలి రాణే, రేష్మా కార్తీక్ బరిలోకి దిగనున్నారు. వచ్చే నెలలో జరిగే ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు పీవీ సింధు, భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్, శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు
-
క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ రాకెట్లు సింధు, సైనా నెహ్వాల్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటిదాకా రెండో రౌండ్ దాటని పూసర్ల వెంకట సింధుతో పాటు, 2015 రన్నరప్ సైనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఒకవేళ వీళ్లిద్దరు క్వార్టర్స్ అడ్డంకిని అధిగమిస్తే... సెమీఫైనల్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతను 13–21, 5–21తో ఏడో సీడ్ తియాన్ హౌవే (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 21–12, 21–4తో ఇండోనేసియాకు చెందిన దినార్ ద్యా అయుస్తిన్‌పై అలవోక విజయం సాధించింది. జోరు మీదున్న ఈ హైదరాబాదీ సంచలనం కేవలం అరగంటలోనే ప్రత్యర్థికి ఇంటిదారి చూపించింది. మరో పోరులో సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 21–18, 21–10తో ఫ్యాబియెన్ డెప్రిజ్ (జర్మనీ)ని వరుస గేముల్లో ఓడించింది. తొలి గేమ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో 12–8తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సైనా తర్వాత ప్రతిపాయింట్‌కు చెమటోడ్చాల్సి వచ్చినా చివరకు విజయం దక్కింది. -
సైనాపై సింధు పైచేయి
పీబీఎల్–2 ఫైనల్లో చెన్నై స్మాషర్స్ న్యూఢిల్లీ: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో తనకు ఎదురులేదని పీవీ సింధు నిరూపించుకుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో భాగంగా అవధ్ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో చెన్నై స్మాషర్స్ 4–1 పాయింట్ల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అందరి దృష్టినీ ఆకర్షించిన మహిళల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో పీవీ సింధు (చెన్నై) 11–7, 11–8తో సైనా నెహ్వాల్ (వారియర్స్)ను ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం, చైనా ఓపెన్‌లో టైటిల్‌తో కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న సింధు అదే జోరును సైనాతో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న సైనా తన ప్రత్యర్థి దూకుడు ముందు నిలబడలేకపోయింది. అంతకుముందు తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–గాబ్రియెలా అడ్కాక్ (చెన్నై) జంట 11–9, 8–11, 5–11తో సావిత్రి అమిత్రపాయ్–బోదిన్ ఇసారా (వారియర్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. అయితే పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ (చెన్నై) 11–4, 11–6తో విన్సెంట్ వోంగ్ (వారియర్స్)పై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 14–12, 11–7తో టామీ సుగియార్తో (చెన్నై)పై నెగ్గడంతో వారియర్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. బరిలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ‘ట్రంప్’ మ్యాచ్‌లో సైనాపై సింధు నెగ్గడంతో చెన్నై 3–2తో ఆధిక్యంలోకి వచ్చింది. వారియర్స్ ఎంచుకున్న పురుషుల డబుల్స్ ‘ట్రంప్’ మ్యాచ్ లో క్రిస్ అడ్కాక్–కోల్డింగ్ (చెన్నై) జంట 11–3, 12–10తో గో వి షెమ్–మార్కిస్ కిడో (వారియర్స్) ద్వయంపై గెలవడంతో చెన్నై స్మాషర్స్ తుదకు 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్, ముంబై రాకెట్స్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
సైనా, శ్రీకాంత్ గెలుపు
అవధ్ చేతిలో ఢిల్లీ ‘మైనస్’ ఓటమి ∙పీబీఎల్–2 లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో వారియర్స్ 6–(–1)తో ఢిల్లీ ఏసర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. అవధ్ తరఫున సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు అదరగొట్టారు. పురుషుల డబుల్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విషెమ్ గో–మార్కిస్ కిడో (అవధ్) జోడి 11–4, 11–4తో వ్లాదిమిర్ ఇవనోవ్–అక్షయ్ దివాల్కర్ (ఢిల్లీ) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌ను అవధ్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్ (అవధ్) 14–12, 11–7తో నిచావోన్ జిందాపొల్ (ఢిల్లీ)పై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సైనా జోరు పెంచింది. దీంతో ప్రత్యర్థి జిందాపొల్ ఏ దశలోనూ ఆమెకు పోటీనివ్వలేకపోయింది. ట్రంప్ విజయంతో బోనస్ పాయింట్ సాధించిన వారియర్స్ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్) 11–9, 11–13, 11–9తో జానొ జోర్గెన్సెన్ (ఢిల్లీ)పై చెమటోడ్చి నెగ్గాడు. తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోదిన్ ఇసారా–సావిత్రి అమిత్రాపాయ్ (అవధ్) జోడి 12–10, 11–5తో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తాజ్వాల (ఢిల్లీ) జంటపై నెగ్గింది. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ పోరు ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కాగా ఇందులోనూ పరాజయాన్నే చవిచూడటంతో మైనస్ 1 తో చిత్తయింది. వాంగ్ వింగ్ కి విన్సెంట్ (అవధ్) 11–8, 11–6తో సొన్ వాన్ హో (ఢిల్లీ)పై గెలిచి వారియర్స్‌కు పరిపూర్ణ విజయాన్ని అందించాడు. -
స్పోర్ట్స్ క్యాలెండర్ 2017
గత ఏడాది పలు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిపించారు. అదే జోరును కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. తొలిసారిగా భారత్ ఫుట్‌బాల్‌లో అండర్–17 విభాగంలో ప్రపంచకప్ నిర్వహించనుంది. ఇంగ్లండ్ వేదికగా భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. బ్యాడ్మింటన్‌లో సింధు, సైనా, శ్రీకాంత్ మరిన్ని ఘనతలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయంగా భారత క్రీడాకారులు సందడి చేయనున్నారు.ఈ నేపథ్యంలో 2017లో జరిగే ప్రధాన క్రీడా టోర్నమెంట్ల వివరాలు తెలుపుతూ ‘సాక్షి క్రీడావిభాగం’ అందిస్తోన్న స్పోర్ట్స్ క్యాలెండర్.... క్రికెట్ జనవరి 15: భారత్–ఇంగ్లండ్ తొలి వన్డే (పుణే) జనవరి 19: భారత్–ఇంగ్లండ్ రెండో వన్డే (కటక్) జనవరి 22: భారత్–ఇంగ్లండ్ మూడో వన్డే (కోల్‌కతా) జనవరి 26: భారత్–ఇంగ్లండ్ తొలి టి20 (కాన్పూర్) జనవరి 29: భారత్–ఇంగ్లండ్ రెండో టి20 (నాగ్‌పూర్) ఫిబ్రవరి 1: భారత్–ఇంగ్లండ్ మూడో టి20 (బెంగళూరు) ఫిబ్రవరి 8–12: భారత్–బంగ్లాదేశ్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ (హైదరాబాద్) ఫిబ్రవరి 23–27: భారత్–ఆస్ట్రేలియా తొలి టెస్టు (పుణే) మార్చి 4–8: భారత్–ఆస్ట్రేలియా రెండో టెస్టు (బెంగళూరు) మార్చి 16–20: భారత్–ఆస్ట్రేలియా మూడో టెస్టు (రాంచీ) మార్చి 25–29: భారత్–ఆస్ట్రేలియా నాలుగో టెస్టు (ధర్మశాల) ఏప్రిల్ 5–మే 21: ఐపీఎల్–10 సీజన్ (భారత్‌లో) జూన్ 1–18: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ఇంగ్లండ్‌లో) జులై: వెస్టిండీస్‌లో భారత్ పర్యటన (5 వన్డేలు, ఒక టి20) జులై–ఆగస్టు: శ్రీలంకలో భారత్ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20) అక్టోబరు: భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన (5 వన్డేలు, ఒక టి20) టెన్నిస్ జనవరి 2–8: చెన్నై ఓపెన్ టోర్నీ జనవరి 16–29: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫిబ్రవరి 3–5: న్యూజిలాండ్‌తో భారత్ డేవిస్ కప్ మ్యాచ్ మార్చి 9–19: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మార్చి 23–ఏప్రిల్ 2: మియామి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఏప్రిల్ 16–23: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 7–14: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 14–21: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 28–జూన్ 11: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జులై 2–16: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆగస్టు 7–13: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 13–20: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఆగస్టు 28–సెప్టెంబరు 10: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అక్టోబరు 8–15: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ అక్టోబరు 30–నవంబరు 5: పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నవంబరు 12–19: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ బ్యాడ్మింటన్ జనవరి 1–14: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ జనవరి 17–22: మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (సిబు) జనవరి 24–29: సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో) ఫిబ్రవరి 14–19: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (వియత్నాం) ఫిబ్రవరి 28–మార్చి 5: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (ముల్హీమ్ యాన్ డెర్ రుర్) మార్చి 7–12: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (బర్మింగ్హమ్) మార్చి 14–19: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (బాసెల్) మార్చి 28–ఏప్రిల్ 2: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (న్యూఢిల్లీ) ఏప్రిల్ 4–9: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (కౌలాలంపూర్) ఏప్రిల్ 11–16: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సింగపూర్ సిటీ) ఏప్రిల్ 25–20: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ మే 21–28: సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (గోల్డ్‌కోస్ట్, ఆస్ట్రేలియా) జూన్ 13–18: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (జకార్తా) జూన్ 20–25: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సిడ్నీ) ఆగస్టు 21–27: ప్రపంచ చాంపియన్‌షిప్ (గ్లాస్గో, స్కాట్లాండ్) సెప్టెంబరు 12–17: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్) సెప్టెంబరు 19–24: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (టోక్యో) అక్టోబరు 17–22: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఒడెన్స్) అక్టోబరు 24–29: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (పారిస్) నవంబరు 14–19: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఫుజు) నవంబరు 21–26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలూన్) డిసెంబరు 13–17: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ (దుబాయ్) హాకీ జనవరి 21–ఫిబ్రవరి 20: హాకీ ఇండియా లీగ్ జూన్ 15–25: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–1 (లండన్) జులై 9–23: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–2 (దక్షిణాఫ్రికా) జూన్ 21–జులై 2: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–1 (బెల్జియం) జులై 8–22: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–2 (దక్షిణాఫ్రికా) నవంబరు 18–26: మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (న్యూజిలాండ్) డిసెంబరు 2–10: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (భారత్) రెజ్లింగ్ జనవరి 2–19: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 (భారత్) జనవరి 31–ఫిబ్రవరి 3: డేవ్ షల్ట్ స్మారక టోర్నీ (అమెరికా) మే 10–14: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ) జూన్ 15–18: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (చైనీస్ తైపీ) ఆగస్టు 1–6: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఫిన్లాండ్) ఆగస్టు 21–26: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (పారిస్) టేబుల్ టెన్నిస్ జనవరి 26–28: వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ (ఇండోర్, భారత్) ఫిబ్రవరి 14–19: వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ (న్యూఢిల్లీ) మే 3–7: ఇండియా జూనియర్, క్యాడెట్ ఓపెన్ (న్యూఢిల్లీ) మే 29–జూన్ 5: ప్రపంచ చాంపియన్‌షిప్ (జర్మనీ) వెయిట్‌లిఫ్టింగ్ ఏప్రిల్ 3–10: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్) ఏప్రిల్ 22–28: ఆసియా చాంపియన్‌షిప్ (తుర్క్మెనిస్తాన్) జూన్ 16–23: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (జపాన్) జులై 22–30: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (నేపాల్) సెప్టెంబరు 3–9: కామన్వెల్త్ సీనియర్, జూనియర్, యూత్ చాంపియన్‌షిప్ (ఆస్ట్రేలియా) నవంబరు 28–డిసెంబరు 5: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (అమెరికా) ఫార్ములావన్ మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) ఏప్రిల్ 9: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 16: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 30: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి) మే 14: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) మే 28: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 11: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 25: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) జులై 9: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్బర్గ్) జులై 16: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జులై 30: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్టావెలోట్) సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబరు 17: సింగపూర్ గ్రాండ్‌ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబరు 1: మలేసియా గ్రాండ్‌ప్రి (కౌలాలంపూర్) అక్టోబరు 8: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) అక్టోబరు 22: యూఎస్ గ్రాండ్‌ప్రి (టెక్సాస్) అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబరు 12: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబరు 26: అబుదాబి గ్రాండ్‌ప్రి (అబుదాబి) ఫుట్‌బాల్ జనవరి 14–ఫిబ్రవరి 5: ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (గాబోన్) మే 20–జూన్ 11: ‘ఫిఫా’ అండర్–20 ప్రపంచకప్ (కొరియా) జూన్ 3: చాంపియన్స్ లీగ్ ఫైనల్ (కార్డిఫ్, వేల్స్) జూన్ 17–జులై 2: ‘ఫిఫా’ కాన్ఫెడరేషన్స్ కప్ (రష్యా) అక్టోబరు 6–28: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్ (భారత్) డిసెంబరు 6–16: ‘ఫిఫా’ క్లబ్ ప్రపంచకప్ (యూఏఈ) బాక్సింగ్ ఆగస్టు 25–సెప్టెంబరు 3: ప్రపంచ చాంపియన్‌షిప్ (జర్మనీ) నవంబరు: ప్రపంచ మహిళల యూత్ చాంపియన్‌షిప్ చెస్ ఫిబ్రవరి 10–మార్చి 5: ప్రపంచ మహిళల నాకౌట్ చాంపియన్‌షిప్ (ఇరాన్) ఫిబ్రవరి 17–28: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–1 (షార్జా) మార్చి 31–ఏప్రిల్ 9: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్) మే 1–10: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (ఇరాన్) మే 11–22: ఆసియా పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ (చైనా) మే 11–22: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–2 (రష్యా) జూన్ 16–28: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (రష్యా) జులై 5–16: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–3 (స్విట్జర్లాండ్) సెప్టెంబరు 1–25: ప్రపంచకప్ (జార్జియా) సెప్టెంబరు 16–26: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (ఉరుగ్వే) అక్టోబరు 1–16: ప్రపంచ జూనియర్, అండర్–20 మహిళల చాంపియన్‌షిప్ (ఇటలీ) నవంబరు 15–26: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–4 (స్పెయిన్) అథ్లెటిక్స్ మార్చి 26: ప్రపంచ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్ (ఉగాండా) మే 5: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) మే 13: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) మే 27: డైమండ్ లీగ్ మీట్–3 (యూజిన్, అమెరికా) జూన్ 8: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) జూన్ 15: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో, నార్వే) జూన్ 18: డైమండ్ లీగ్ మీట్–6 (స్వీడన్) జులై 1–4: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (భారత్) జులై 1: డైమండ్ లీగ్ మీట్–7 (పారిస్) జులై 6: డైమండ్ లీగ్ మీట్–8 (స్విట్జర్లాండ్) జులై 9: డైమండ్ లీగ్ మీట్–9 (లండన్) జులై 12–16: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (కెన్యా) జులై 16: డైమండ్ లీగ్ మీట్–10 (మొరాకో) జులై 21: డైమండ్ లీగ్ మీట్–11 (మొనాకో) ఆగస్టు 4–13: ప్రపంచ చాంపియన్‌షిప్ (బ్రిటన్) ఆగస్టు 20: డైమండ్ లీగ్ మీట్–12 (బర్మింగ్హమ్) ఆగస్టు 24: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిచ్) సెప్టెంబరు 1: డైమండ్ లీగ్ మీట్–14 (బెల్జియం) ఆర్చరీ మే 16–21: ప్రపంచకప్ స్టేజ్–1 (షాంఘై, చైనా) జూన్ 6–11: ప్రపంచకప్ స్టేజ్–2 (అంటాల్యా, టర్కీ) జూన్ 20–25: ప్రపంచకప్ స్టేజ్–3 (సాల్ట్‌లేక్ సిటీ, అమెరికా) ఆగస్టు 8–13: ప్రపంచకప్ స్టేజ్–4 (బెర్లిన్, జర్మనీ) అక్టోబరు 15–22: ప్రపంచ చాంపియన్‌షిప్ (మెక్సికో సిటీ) -
సాయిప్రణీత్ శుభారంభం
మకావు: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సారుుప్రణీత్ కేవలం 19 నిమిషాల్లో 21-3, 21-8తో లామ్ హూ హిమ్ (మకావు)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21-11, 21-16తో మిలాన్ లుదిక్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... పారుపల్లి కశ్యప్‌కు తన ప్రత్యర్థి సిమ్ గు జెంగ్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించింది. చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 2-6తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో చున్ వీ చెన్‌తో కశ్యప్; మొహమ్మద్ బాయు (ఇండోనేసియా)తో సమీర్ వర్మ; సున్ ఫిజియాంగ్ (చైనా)తో సారుుప్రణీత్... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హనా రమాదిని (ఇండోనేసియా)తో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ తలపడతారు. -
సెమీస్‌లో సింధు
సమీర్ వర్మ కూడా ముందుకు క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ కౌలూన్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో టాప్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్స్‌లో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. 79 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో గ్జియావు లియాంగ్‌పై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించిన సింధుకు క్వార్టర్స్‌లో గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను చకచకా గెల్చుకున్న సింధు, రెండో గేమ్‌లో చేజేతులా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో ఉన్నా... లియాంగ్ వరుస పారుుంట్లతో దూసుకురావడంతో స్కోరు 18-18 వద్ద సమమైంది. ఆ తర్వాత 21-21కి చేరాక సింగపూర్ అమ్మారుు వరుసగా రెండు పారుుంట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో 15-15 వరకు ఇద్దరు సమఉజ్జీలుగా కనిపించినా, కీలక సమయంలో పారుుంట్లతో సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గాయంనుంచి కోలుకున్న తర్వాత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సైనాకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌ల పాటు పోరాడిన ఆమె ఈ సారి తలవంచింది. హాంకాంగ్‌కు చెందిన చుంగ్ గాన్ రుు 21-8, 18-21, 21-19తో సైనాను ఓడించింది. 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో సైనా పేలవ ప్రదర్శన కనబర్చింది. అరుుతే కోలుకొని రెండో గేమ్ గెలుచుకోగలిగింది. మూడో గేమ్‌లో ఒక దశలో 11-18తో వెనుకబడింది. అరుుతే పుంజుకున్న సైనా వరుసగా ఏడు పారుుంట్లు కొల్లగొట్టి 18-18తో సమం చేసింది. కానీ చివరకు ప్రత్యర్థిదే పైచేరుు అరుుంది. సైనాను ఓడించి చుంగ్ గాన్‌తో సెమీస్‌లో సింధు తలపడుతుంది. సెమీస్‌లో సమీర్ వర్మ... పురుషుల విభాగంలోనూ భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించారుు. భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టగా, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 23-21తో ఫెంగ్ చోంగ్ వీపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 15-21, 14-21 తేడాతో ఆంగస్ లాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. తొమ్మిదో ర్యాంక్‌కు సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్‌సలో పీవీ సింధు తొమ్మిదో ర్యాంక్‌కు చేరగా... సైనా నెహ్వాల్ టాప్-10లోంచి బయటకు వెళ్లింది. గత వారం చైనా ఓపెన్ గెలిచిన సింధు రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ ఏకంగా ఐదు స్థానాలు కోల్పోరుు 11వ ర్యాంక్‌కు చేరింది. -
కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా
-
కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతో పాల్గొని లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే వారంలో పునరాగమనం చేయనుంది. అయితే భవిష్యత్‌లో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని సైనా తెలిపింది. ‘చాలా మంది నా కెరీర్ ముగిసిందని భావిస్తున్నారు. ఇక పునరాగమనం చేయలేనని అనుకుంటున్నారు. గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే ఒక్కోసారి నాకూ అలాగే అనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం’ అని 26 ఏళ్ల సైనా అభిప్రాయపడింది. నవంబరు 15 నుంచి జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం సైనా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ‘సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నాను. నా పని అరుుపోయిందని ఇతరులు అనుకుంటే సంతోషమే. ఒకరకంగా ఇప్పటిదాకా వారు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి నా గురించి వారు ఆలోచించడం మానేస్తారేమో’ అని సైనా తెలిపింది. -
సైనా కోసం బీ టౌన్ ప్రముఖులు
ముంబై: లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ (26) ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. భారత స్టార్ షట్లర్ సైనా మోకాలి శస్త్రచికిత్స తర్వాత తొందరగా కోలుకోవాలనే అభిలాషను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , దర్శకుడు కరణ్ జోహార్ హీరో రితేష్ దేశ్ ముఖ్, హీరోయిన్ సోనాక్షి సిన్హా, దియా మీర్జా. గాయని శుభా ముద్గల్ తదితరులు ట్విట్టర్ ద్వారా తమ సందేశాలను షేర్ చేశారు. ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకొని మళ్లీ మునుపటిలా కోర్టులో ఛాంపియన్ లా వెలిగిపోవాలని ప్రార్థించారు. అంతా మంచే జరుగుతుందనీ, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సైనా స్పీడీ రికవరీ కోసం ప్రార్థిస్తున్నామంటూ ఛాంపియన్ పట్ల తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. అటు సైనా నెహ్వాల్ కూడా రేపు(శనివారం) తనకు ఆపరేషన్ నిర్వహించనున్నారనీ, తనకోసం ప్రార్థించమంటూ ట్విట్ చేశారు. దీంతో పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయవేత్తలు సహా సుష్మా కూడా ట్వీట్ చేశారు. అలాగే ఆపరేషన్ తనకు విషెస్ తెలిపిన అందరికీ సైనా ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఫోటోలను సైనా ట్విట్టర్ పంచుకున్నారు. కాగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో హైదరాబాదీ సైనా మొదటి రౌండ్ తర్వాత రియో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. హైదరాబాద్ తరలించారు. శస్త్రచికిత్స నిమిత్తం ఆమెను ముంబైకి తరలించారు. వైద్యులు ఆమెకు ఈ ఉదయం (శనివారం) ఆపరేషన్ నిర్వహించారు. Stay strong @NSaina ....and Godspeed!! You are a fighter and a solid talent!!! Sending you lots of love...and healing.... — Karan Johar (@karanjohar) August 20, 2016 @NSaina join all your fans in praying for your speedy recovery. Take care. — Shubha Mudgal (@smudgal) August 19, 2016 After the surgery -
వారియర్స్ బోణీ
► ఢిల్లీ ఏసర్స్‌పై 4-3తో గెలుపు ► సైనా, సాయిప్రణీత్ విజయం ► ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లక్నో: తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు... స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రాకతో రెండో మ్యాచ్‌లోనే పుంజుకుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ జట్టు 4-3 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఏసర్స్ జట్టుపై విజయం సాధించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున ముంబై రాకెట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ తమ జట్టు సొంతగడ్డపై జరిగిన పోటీలో మాత్రం బరిలోకి దిగింది. ఈ పోటీలో ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలిసొచ్చింది. పురుషుల తొలి సింగిల్స్‌లో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ (అవధ్ వారియర్స్) 13-15, 11-15తో టామీ సుగియార్తో (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో వారియర్స్ జట్టు 0-1తో వెనుకబడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-9, 15-10తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. వారియర్స్ జట్టు ఈ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొంది. దాంతో సైనా నెగ్గడంతో వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (వారియర్స్) ద్వయం 15-12, 15-14తో కీ కీట్ కీన్-తాన్ బూన్ హెయోంగ్ (ఢిల్లీ) జోడీపై గెలిచింది. దాంతో వారియర్స్ జట్టు ఆధిక్యం 3-1కి పెరిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 15-12, 15-9తో ప్రపంచ 17వ ర్యాంకర్ రాజీవ్ ఉసెఫ్ (ఢిల్లీ ఏసర్స్)ను బోల్తా కొట్టించాడు. దాంతో వారియర్స్ జట్టు 4-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో హెంద్రా గుణవాన్-మనీషా (వారియర్స్) జోడీ 14-15, 15-13, 5-15తో అక్షయ్ దివాల్కర్-గాబ్రియెల్లా అడ్కాక్ (ఢిల్లీ ఏసర్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ఢిల్లీ ఏసర్స్ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించడంతో ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరినా ఫలితం లేకపోయింది. తుదకు వారియర్స్ జట్టు 4-3తో విజయం దక్కించుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో చెన్నై స్మాషర్స్‌తో ఢిల్లీ ఏసర్స్; ముంబై రాకెట్స్‌తో బెంగళూరు టాప్‌గన్స్ తలపడతాయి. -
కొంచెం ముందుకు.. కొంచెం వెనక్కి
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన వారు ఒకరు... నిలకడైన ఆటతీరుకు అర్థం చెబుతూ ప్రపంచ టైటిల్స్‌ను కూడా అలవోకగా సాధించొచ్చని నిరూపించిన వారు మరొకరు... పక్కాగా నిర్వహిస్తే గ్రామీణ క్రీడ కూడా అందరి హృదయాలను దోచుకోవచ్చని... ముందు చూపులేకపోతే ఎన్నాళ్లయినా తమ నాణ్యతా ప్రమాణాలను పెంచుకోలేమని... ఈ ఏడాది భారత క్రీడారంగానికి అనుభవంలోకి వచ్చింది. ఈ సంవత్సరం కొన్ని క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు మెరుగ్గా రాణించి తమ ఉనికిని మరింత చాటుకోగా... మరికొన్నింటిలో మాత్రం అంతంత ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. - సాక్షి క్రీడావిభాగం సైనా... సాధించెన్ కొన్నేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయ పదంగా నిలుస్తోన్న సైనా నెహ్వాల్ ఈ ఏడాది అనుకున్నది సాధించింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌లో విజేతగా నిలిచి శుభారంభం చేసిన సైనా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలిసారి టైటిల్ నెగ్గి, అలాగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ఎంతోకాలంగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని దక్కించుకొని ఊరట చెందింది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా రజత పతకం సొంతం చేసుకొని మరో అరుదైన ఘనత సాధించింది. చైనా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా... సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మాత్రం లీగ్ దశలో నిష్ర్కమించింది. ఈ ఏడాది సైనా మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి... 37 విజయాలు, 12 పరాజయాలు నమోదు చేసింది. మరోవైపు పీవీ సింధుకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు మిగిల్చింది. గాయాలతో బాధపడిన సింధు చివర్లో మెరిసింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు, మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది చేదు, తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ వరుస వారాల్లో స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. అయితే ఆ తర్వాత శ్రీకాంత్ ఆటతీరు గాడితప్పింది. వరుసగా 14 టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన శ్రీకాంత్ చివర్లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గకుండా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాడు. మరో ప్లేయర్ అజయ్ జయరామ్ కొరియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, డచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ నెగ్గి సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పారుపల్లి కశ్యప్... ఇండోనేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం కెనడా ఓపెన్‌లో... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట మెక్సికో ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గి తమ ఉనికిని చాటుకున్నారు. కబడ్డీ కేక... గతేడాది మొదలైన ప్రొ కబడ్డీ లీగ్‌కు ఈసారి మరింత ఆదరణ పెరిగింది. క్రితంసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న యు ముంబా జట్టు ఈసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో యు ముంబా ఆరు పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తెలుగు టైటాన్స్ జట్టు కూడా ఆకట్టుకొని మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌కు లభించిన ఆదరణతో నిర్వాహకులు వచ్చే ఏడాది రెండుసార్లు ఈ లీగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అదే ‘గురి’ ఈ సంవత్సరం కూడా మన ‘షూటర్లు’ మెరిశారు. ఇప్పటివరకైతే ఎనిమిది మంది భారత షూటర్లు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అంతర్జాతీయ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన ఆధారంగా అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), గగన్ నారంగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్), గుర్ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), ప్రకాశ్ నంజప్ప, జీతూ రాయ్ (50 మీటర్ల పిస్టల్), చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్), అపూర్వీ చండిలా (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. అలవోకగా ప్రపంచ టైటిల్స్... క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో తనకు తిరుగులేదని భారత స్టార్ పంకజ్ అద్వానీ ఈసారీ నిరూపించుకున్నాడు. ప్రపంచ టైటిల్స్ నెగ్గడం ఇంత సులభమా అన్నట్లుగా ఈ సంవత్సరం ఈ బెంగళూరు ప్లేయర్ మూడు ప్రపంచ టైటిల్స్ (బిలియర్స్ టైమ్ ఫార్మాట్, స్నూకర్, సిక్స్ రెడ్ స్నూకర్)ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఉమా దేవి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. మందగమనమే గతంతో పోలిస్తే ఈసారీ మన పరుగు మందగమనంగానే ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్స్ పతకాల పంట పండించకపోయినా... వ్యక్తిగత ప్రదర్శనతో ఏకంగా 15 మంది రియో ఒలింపిక్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మహిళా అథ్లెట్ ద్యుతీచంద్ శరీరంలో హైపర్‌ఆండ్రోజెనిజమ్ (పురుష హార్మోన్ లక్షణాలు) ఉన్నాయనే కారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిషేధం విధించగా... ద్యుతీచంద్ న్యాయం కోసం కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో కేసు వేసింది. వాదనలు విన్నాక కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ మహిళా అథ్లెట్స్ విషయంలో హైపర్‌ఆండ్రోజెనిజమ్ నిబంధనలను రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. దాంతో ద్యుతీచంద్ మళ్లీ పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. మళ్లీ డోపింగ్ భూతం గతేడాది డోపింగ్ రహితంగా కనిపించిన భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈసారి మళ్లీ ఆ జాఢ్యం వచ్చింది. ఆయా టోర్నీల్లో పాల్గొన్న లిఫ్టర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా 26 మంది వెయిట్‌లిఫ్టర్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పోటీపడిన ప్రమీలా కృసాని, మినాతి సేథి డోపింగ్‌లో పట్టుబడ్డారు. ఒక దేశానికి చెందిన లిఫ్టర్లు ఒకే ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో మూడుసార్లు డోపింగ్‌లో విఫలమైతే ఆ దేశం లిఫ్టర్లపై ఏడాదిపాటు నిషేధం విధిస్తారు. గతంలో భారత్‌పై మూడుసార్లు నిషేధం విధించారు. ఎక్కడ వేసిన బంతి అక్కడే ఒకప్పుడు ఒలింపిక్స్‌లో మెరిసిన భారత ఫుట్‌బాల్ పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా కనిపించడంలేదు. గ్వామ్లాంటి చిన్న జట్టు చేతిలోనూ భారత్‌కు ఓటమి తప్పడంలేదు. ప్రపంచకప్-2018 క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ ఒకే ఒక్క విజయం సాధించి మరోసారి నిరాశపరిచింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ జట్టు విజేతగా నిలువగా... ఐఎస్ఎల్లో భారత ఫుట్‌బాల్‌కు ఏరకంగా మేలు జరుగుతుందో తెలియదని గోవా జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన బ్రెజిల్ దిగ్గజం జికో వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 166వ స్థానంలో ఉన్న భారత్ తమ ఉనికిని చాటుకోవాలంటే క్షేత్రస్థాయి నుంచి మార్పులు మొదలవ్వాలి. జోష్నా జిగేల్ ఐదేళ్ల తర్వాత దీపిక పళ్లికల్‌ను వెనక్కి నెట్టి భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్‌గా నిలిచిన జోష్నా చినప్ప ఈ ఏడాది మెరిపించింది. ఖతార్ క్లాసిక్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ రానిమ్ ఎల్ వెలిలీ (ఈజిప్టు)ను బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. మెల్బోర్న్, ముంబై టోర్నీల్లో విజేతగా నిలిచిన జోష్నా ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకుంది. పురుషుల విభాగంలో సౌరవ్ ఘోషాల్ నాలుగు అంతర్జాతీయ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకొని ఒకదాంట్లో విజేతగా నిలిచాడు. ‘ఫోర్స్’ పెరిగింది ఫార్ములావన్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక జట్టు ‘ఫోర్స్ ఇండియా’కు ఈ ఏడాది కలిసొచ్చింది. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ (78 పాయింట్లు), నికో హుల్కెన్‌బర్గ్ (58 పాయింట్లు) డ్రైవర్స్ చాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో వరుసగా తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. 30 రేసుల తర్వాత ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. రష్యా గ్రాండ్‌ప్రి రేసులో సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని దక్కించుకొని ఈ ఘనత సాధించాడు. ఇక కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో 136 పాయింట్లతో ఐదో స్థానాన్ని సంపాదించింది. -
తొమ్మిదో ర్యాంక్‌కి శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రెండో స్థానాన్ని నిలుపుకుంది. దుబాయ్‌లో గత వారం జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తాను ఆడిన అన్ని గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఓడడం శ్రీకాంత్ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. పారుపల్లి కశ్యప్ కూడా 14 నుంచి 15వ స్థానానికి వచ్చాడు. ప్రణయ్ (20) ర్యాంకులో మార్పు లేదు. అజయ్ జయరాం 23 నుంచి 22కు వచ్చాడు. మహిళల ర్యాకింగ్స్లో పీవీ సింధు 12వ ర్యాంకులోనే ఉండగా డబుల్స్‌లో జ్వాల, అశ్విని జోడి 13వ స్థానాన్ని నిలుపుకున్నారు. -
చాంపియన్‌కు చుక్కలు
మారిన్‌పై సైనా సంచలన విజయం నిరాశపర్చిన శ్రీకాంత్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: టోర్నమెంట్లో ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. చాలాకాలంగా తన విజయాలకు అడ్డుగా నిలుస్తున్న ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను కంగుతినిపించింది. సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల గ్రూప్-ఎ మ్యాచ్‌లో సైనా 23-21, 9-21, 21-12తో మారిన్‌ను ఓడించింది. గంటా 15 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా అప్పుడప్పుడు తడబడినా తొందరగానే తేరుకుంది. తొలి గేమ్‌లో 9-4 ఆధిక్యంలోకి వెళ్లినా వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయింది. ఓ దశలో మారిన్ 15-12 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ సైనా పుంజుకుని స్కోరును 21-21తో సమం చేసి... క్రాస్ షాట్స్‌తో వరుసగా రెండు పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో ఊహించని రీతిలో హైదరాబాదీ ఆట గాడి తప్పింది. స్కోరు 5-5తో సమమైన తర్వాత మారిన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా ఐదు, ఆరు పాయింట్ల చొప్పున సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైనా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. రక్షణాత్మకంగా కాకుండా అటాకింగ్ గేమ్‌తో వణికించింది. స్కోరు 4-4తో సమమైన తర్వాత సైనా తన అనుభవాన్ని రంగరించి 10-5 ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత మారిన్ పుంజుకోవడంతో ఆధిక్యం 8-11కు తగ్గింది. ఈ దశలో మారిన్ చేసిన అనవసర తప్పిదాలను హైదరాబాద్ అమ్మాయి అందిపుచ్చుకుంది. చకచకా పాయింట్లతో 16-8 స్కోరు సాధించింది. తర్వాత అద్భుతమైన క్రాస్ కట్స్‌తో 19-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మారిన్ పోరాడినా... రెండు సూపర్ స్మాష్‌లతో సైనా గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్‌కు చుక్కెదురు: మరోవైపు పురుషుల గ్రూప్-బి మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకున్నాడు. రెండో లీగ్ మ్యాచ్‌లో 13-21, 18-21తో అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. దీంతో టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. -
సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ ఆటగాళ్ల చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో... మహిళల గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 14-21, 6-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్, కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడతారు. ఒకుహారాతో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా ఈసారి మాత్రం తేలిపోయింది. చీలమండ గాయంతో బాధపడుతున్న సైనా కోర్టులో చురుకుగా కదల్లేకపోయింది. ఇక మొమొటాతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ తన సహజశైలి ఆటతీరును కనబర్చలేకపోయాడు. ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సైనా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ కమిటీ ఎన్నికల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పోటీపడనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగు స్థానాల కోసం మొత్తం 24 మంది స్టార్ క్రీడాకారులు పోటీపడనున్నారు. -
రన్నరప్‌తో సరి
చైనా ఓపెన్ ఫైనల్లో లీ జురుయ్ చేతిలో సైనా ఓటమి ఫుజౌ (చైనా): వరుసగా రెండో ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఓటమి చవిచూసింది. లండన్ ఒలింపిక్స్ విజేత, ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సైనా 12-21, 15-21తో పరాజయం పాలైంది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ తుది పోరులో సైనా పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలిచిన లీ జురుయ్‌కు 52 వేల 500 డాలర్లు (రూ. 34 లక్షల 70 వేలు), రన్నరప్ సైనా నెహ్వాల్‌కు 26 వేల 600 డాలర్లు (రూ. 17 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా తుది సమరంలో మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌కు ముందు సైనాను తొమ్మిది సార్లు ఓడించిన అనుభవం ఉన్న లీ జురుయ్ ఈసారీ పక్కా ప్రణాళికతో ఆడి భారత స్టార్ ఆట కట్టించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సైనా తొలి గేమ్ మొదట్లో 4-1తో ముందంజ వేసింది. అయితే సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆడిన లీ జురుయ్ వెంటనే తేరుకొని ఆరు పాయింట్లు స్కోరు చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ చైనా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నిలకడగా పాయింట్లు సాధిస్తూ తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సైనా కొలుకున్నట్లు కనిపించింది. డ్రాప్ షాట్లు, స్మాష్ షాట్లతో చెలరేగిన ఈ భారత స్టార్ 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సైనా ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న లీ జురుయ్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి 13-12తో ఆధిక్యంలోకి వచ్చింది. భారీ ఆధిక్యాన్ని కోల్పోయిన సైనా ఈ దశలో డీలా పడింది. అనవసర తప్పిదాలు చేసి ఓటమిని ఖాయం చేసుకుంది. తాజా ఫలితంతో లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 2-10తో వెనుకబడింది. చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌ను ఓడించిన సైనా ఆ తర్వాత ఆమెతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకొని ఓడిపోవడం సైనాకిది నాలుగోసారి. గతంలో సైనా ఇండోనేసియా ఓపెన్ (2011), ఫ్రెంచ్ ఓపెన్ (2012), ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (2015) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. రెండు గేముల్లో శుభారంభం చేశాను. అయితే దానిని నిలబెట్టుకోలేకపోయాను. ఫైనల్లో నా ఆటతీరుపట్ల నాకే ఆశ్చర్యమేసింది. షటిల్స్‌ను నియంత్రించలేకపోయాను. నేను కొట్టిన చాలా షాట్లు బయటకు వెళ్లాయి. మరోవైపు లీ జురుయ్ పక్కాగా ఆడింది. పాయింట్లను తొందరగా సాధించాలనే తాపత్రయంలో చాలా పొరపాట్లు చేశాను. నేనింకా కాస్త సంయమనంతో ఆడాల్సింది. ఈ టోర్నీకి సన్నద్ధం కావడానికి తగినంత సమయం లేకపోయినా, నా ఆటతీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. - సైనా నెహ్వాల్ -
చైనాలో సైనా జోరు
క్వార్టర్స్‌కు చేరిన స్టార్ క్రీడాకారిణి సింధు, శ్రీకాంత్, జ్వాల జోడికి చుక్కెదురు ఫుజోహ్ (చైనా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో అదరగొడుతోంది. సహచరులందరూ వెనుదిరిగినా... అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సైనా 21-10, 19-21, 21-19తో ప్రపంచ 34వ ర్యాంకర్ టీ జింగ్ యీ (మలేసియా)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 55 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఈ హైదరాబాదీ పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో చెలరేగింది. అయితే రెండో గేమ్‌లో జింగ్ పుంజుకోవడంతో సైనా 5-8, 8-11తో వెనుకబడింది. నెట్ వద్ద కీలకమైన డ్రాప్ షాట్లతో వరుస పాయింట్లు రాబట్టిన మలేసియా ప్లేయర్ చివరి వరకు అదే జోరుతో గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో జింగ్ 6-2 ఆధిక్యంలోకి వెళ్లినా... సైనా పోరాటపటిమతో 8-8తో సమం చేసింది. తర్వాత ఇరువురు ఒక్కో పాయింట్ గెలవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. జింగ్ 15-13తో ఆధిక్యంలో ఉన్న దశలో హైదరాబాద్ అమ్మాయి భిన్నమైన షాట్లతో చెలరేగింది. సుదీర్ఘమైన స్మాష్‌లతో పాటు నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించి 17-17తో సమం చేసింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లతో పాటు మరోటి నెగ్గి గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-18, 18-21, 16-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో కంగుతింది. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సింధు తడబడింది. ప్రత్యర్థి అనుభవం, బలమైన సర్వీస్ ముందు తలవంచింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఐదోసీడ్ శ్రీకాంత్ 12-21, 18-21 హు యున్ (హాంకాంగ్) చేతిలో; అజయ్ జయరామ్ 12-21, 11-21తో టాప్‌సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో; హెచ్.ఎస్.ప్రణయ్ 14-21, 21-17, 19-21తో క్వాలిఫయర్ గుయె కాయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. డబుల్స్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి.. ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని 16-21, 11-21తో నాకో ఫుక్మన్-కురుమి యోనావో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. శుక్రవారం జరిగే క్వార్టర్ఫైనల్లో సైనా... నొజోమి ఓకురా (జపాన్)తో తలపడుతుంది. -
సైనా, శ్రీకాంత్‌లకు సవాల్
నేటి నుంచి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫుజౌ (చైనా): గతేడాది అంచనాలకు అందని విధంగా చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు ఈసారి వాటిని నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నమెంట్లో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన తర్వాత సైనా... స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిల్స్ గెలిచాక శ్రీకాంత్ తాము బరిలోకి దిగిన టోర్నమెంట్లలో నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు డిఫెండింగ్ చాంపియన్స్ ఈసారి టైటిల్స్ నిలబెట్టుకుంటారో లేక తొందరగానే నిష్ర్కమిస్తారో వేచి చూడాలి. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా పోటీపడుతున్న సైనా తొలి రౌండ్లో చైనా యువతార సున్ యుతో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 4-1తో ఆధిక్యంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ పీవీ సింధు తొలి రౌండ్లో సెనియా పొలికర్పోవా (రష్యా)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ హాంకాంగ్ ప్లేయర్ హు యున్ను ఢీ కొంటాడు. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ మూడో రౌండ్లో హు యున్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని శ్రీకాంత్ పట్టుదలతో ఉన్నాడు. మిగతా తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో అజయ్ జయరామ్.. క్వాలిఫయర్‌తో ప్రణయ్ తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం వైదొలగగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో నోకో ఫకుమన్-కురిమి యోనౌ (జపాన్) జంటతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ తలపడుతుంది. -
హైదరాబా'దిల్'వాలే
సైనా బ్యాటూ... రామ్ చరణ్ ట్రీటూ, సానియా బిర్యాని...మహేష్‌తో బాతాఖానీ... నెలరోజులుగా సిటీలో బాలీవుడ్ సినిమా దిల్వాలే యూనిట్ చేయని సందడి లేదు. మన సిటీ టాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ టీమ్‌కు ఆతిథ్యం అందించేందుకు పోటీపడుతున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ తన సింప్లిసిటీతో సిటీ పీపుల్ని మెప్పిస్తున్నాడు. ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఈ తరహా మీటింగ్‌లలో... మన సిటీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నె హ్వాల్ హయత్‌నగర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మరీ షారూఖ్‌తో ముచ్చట్లు పెట్టి ఆయనతో సెల్ఫీలు సైతం దిగిందనేది ఒకటి. ఈ మీటింగ్ కోసం షారూఖ్‌కు ఆమె ఆన్లైన్లో రిక్వెస్ట్ పెడితే ఆయన స్వయంగా సైనాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. మన సిటీ స్పోర్ట్స్ స్టార్ సైనాని చూసి ఇన్స్పైర్ అయ్యాడో, లేక ఆమె గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌తో తన బ్యాడ్మింటన్ సత్తా పరీక్షించుకుందామనుకున్నాడో గాని సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం షారూఖ్ నెట్ కట్టేసి బ్యాడ్మింటన్‌లో మునిగి తేలుతున్నాడు. ఈద్‌కు సానియా ఆతిథ్యం.. ఈద్ సందర్భంగా ఇంట్లో వండించిన బిర్యాని పంపి సానియా మీర్జా ఇచ్చిన ఆతిథ్యం దిల్వాలే యూనిట్‌కు సంతోషాన్ని వడ్డించింది. దీనిపై ఈ సినిమా నటీనటులు సానియాకు మనస్ఫూర్తిగా ట్వీటర్లో కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ సైతం దిల్‌వాలేలో మరో హీరో అయిన వరుణ్ధావన్ను ఇంటికి పిలిచి బిర్యానీ విందు వడ్డించాడు. మరోవైపు దిల్వాలే చిత్ర బృందం కూడా షూటింగ్ గ్యాప్‌లో మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబును రెండు దఫాలు కలిసింది. తాజాగా రామ్‌చరణ్ బ్రూస్లీ సినిమా షూటింగ్ స్పాట్‌కు వచ్చిన షారూఖ్... రామ్‌చరణ్ స్టెప్పులు చూసి ఫిదా అయిపోయాడు. సరదాగా రామ్‌తో స్టెప్పులేశారు బాద్ షా. రోడ్లపై బైక్‌తో చక్కర్లు... దిల్వాలే దర్శకుడు రోహిత్‌శెట్టి తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్లీ డేవిడ్సన్ బైక్ మీద షారూఖ్ సిటీలో చక్కర్లు కొడుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టే షూటింగ్ స్పాట్‌కు బైక్ మీద వెళ్లడం అంటే తనకెంతో ఇష్టమని, అలా రౌండ్స్ వేశాక చెదిరిపోయిన జుట్టును చూసుకోవడం కూడా సరదా అని ట్వీట్ చేశాడు షారూఖ్. హైదరాబాద్‌లో షూటింగ్ చేసుకున్న గత హిందీ సినిమా యూనిట్లకు భిన్నంగా, దిల్వాలే యూనిట్ సందడి చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా హైదరాబాద్‌కు తీపిగుర్తులు ఇంకెన్ని వదిలి వెళ్తుందో చూద్దాం... - సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
సైనా శుభారంభం..!
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ లో ఇండియన్ టాప్ షట్లర్, ప్రపంచ నంబర్ వన్ సైనా నేహ్వాల్ శుభారంభం చేసింది. సైనాతో పాటు పారుపల్లి కశ్యప్, కిదాంబిశ్రీకాంత్, ప్రణయ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు. అయితే పీవీ సింధు కు మాత్రం తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా 21-14, 21-20 తేడాతో.. థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై గెలిచింది. మరో మ్యాచ్‌లో సింధు 21-13, 17-21,21-11 స్కోర్ తో జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఓడిపోయింది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా ఎదురయ్యేది. సింధు ఓటమితో ప్రిక్వార్టర్ ఫైనల్లో మితానీతో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల - అశ్వనిపొన్నప్ప జంట చైనా జంట ఎనిమిదో సీడ్ జుహో యున్ లీ- జాంగ్ జంట చేతిలో 22-20, 18-21, 21-13 స్కోర్ తేడాతో ఓడిపోయారు. -
ఇండోనేషియా ప్రిక్వార్టర్స్ కి సైనా, కశ్యప్
జకర్తా: భారత నం.1 స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సింగిల్స్ విభాగంలో ఇండోనేషియా ఓపెన్ ప్రిక్వార్టర్స్ లో ప్రవేశించింది. పి.వి.సిందూ ఇంటి దారి పట్టింది. పురుషుల కేటగిరిలో పారుపల్లి కశ్యప్ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ కి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో థాయ్‌లాండ్ కి చెందిన నిచాన్ జిందాపొన్పై 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది. తొలిసెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సైనాకు రెండోసెట్ లో కొంత ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో 18-17 తో వెనకబడి ఉన్న సైనా వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని విజయం సాధించింది. 2009, 2010, 2012 సంవత్సరాలలో సైనా ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే. పారుపల్లి కశ్యప్ 21-17, 21-7 తేడాతో వరుస సెట్లను కైవసం చేసుకొని థాయ్‌లాండ్ కి చెందిన టనొంగ్ సాక్ పై విజయం సాధించాడు. ఈ రెండు సెట్లను కేవలం 29 నిమిషాల్లోనే ముగించడం విశేషం. సిందూ ఓటమి హైదరాబాదీ షట్లర్ పి.వి.సిందూ 21-15, 21- 14 తేడాతో వరస సెట్లు కోల్పోయి చైనాకి చెందిన క్రీడాకారిణి హు యా చింగ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సిందూ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. -
సానియా... సైనా... మేరీకోమ్... సాధ్వీ పాండే
ఆడపిల్లలు ఏం చేసినా అపురూపంగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్లేం చేయడానికీ వీలుండదు కాబట్టి. ఆడపిల్లలు ఎంత సాధించినా అది ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్లు చిన్న గెలుపు కోసం కూడా పెద్ద ఫైట్ చెయ్యాల్సి ఉంటుంది. ‘మళ్లీ బాలి కలే ఫస్ట్’ అనే ఘనత వాళ్లేం సునాయాసంగా సాధి స్తున్నది కాదు? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లిష్ అని ఏదో ఒక టైం టేబుల్ వేసుకుంటే వారు నెగ్గలేరు. ఇల్లూడవడం, గిన్నెలు కడగడం, నీళ్లు పట్ట డం, అమ్మకు కూరగాయలు తరిగి ఇవ్వడం, నాన్న కు వేళకు మందులు గుర్తుచెయ్యడం అనే ఇంకో టైమ్ టేబుల్ కూడా పారలల్‌గా వేస్కోవాలి. ఇంత కష్టపడతారు కనుకే అంతకు అంత ఆడపిల్లలకు మనం అప్రీసియేషన్ ఇవ్వాలి. సానియా మీర్జా టైటిల్ కొట్టుకొచ్చిందా లేదా అన్నది కాదు. టైటిల్ కోసం ఆమె ఎంత స్ట్రగుల్ అయిందన్నదే పాయిం ట్. సైనా నెహ్వాల్ కూడా అంతే. ఇవాళ వన్‌లో ఉండి, రేపటికి ఆమె నన్లోకి పడిపోవచ్చు. వన్‌కి నన్‌కి మధ్య శంకించడానికి వీల్లేని ఆమె ఫైట్‌ని మనం చూడాలి. కేసీఆర్ కోటి రూపాయలిచ్చినా, ఇంకొకరు ఇంకోటి ఇచ్చినా గెలిచినందుకు కాక, గెలవడం కోసం పోరాడినందుకేనని అనుకోవాలి. చదువులు, ఆటల్లోనే కాదు, ఆడపిల్లలు రోజువారీ జీవితానికి ఎదురునిలిచే ఏ చిన్న సాహసం చేసినా, ఏ కాస్త ధైర్యం కనబరిచినా టైటిల్ సాధించిన ట్టుగా నో, ర్యాంకు కొట్టేసినట్టుగానో గుర్తించి కీర్తించాలి. గౌరవించాలి. అలా ఇప్పుడు మనం గుర్తించి, కీర్తించి, గౌర వించవలసిన ఆగ్రా ఆమ్మాయి సాధ్వీ పాండే. ఈ రెండ్రోజుల్లో మీరు ఆమె గురించి వినే ఉంటారు. వినకపోయినా ఫర్వాలేదు. వినీ విననట్టు ఉండిపో వడం మాత్రం ఆ అమ్మాయిని మనం సపోర్ట్ చేయ కపోవడమే. కొన్నిసార్లు ఆడపిల్లను సపోర్ట్ చెయ్య కపోవడం కూడా ఆమెను హర్ట్ చేయడమే అవు తుంది. అంతేకాదు, ఒక సామాజిక బాధ్యతనూ విస్మరించినట్టు అవుతుంది. ఇంతకీ ఈ ఆగ్రా అమ్మాయి ఏం చేసింది? మగ వాళ్లు వెంటపడి వేధిస్తున్నా, వెకిలిగా కామెంట్స్ చేస్తున్నా, చెయ్యి తాకిస్తున్నా, అసభ్యంగా ప్రవర్తి స్తున్నా చాలామంది ఆడపిల్లలు పరువుకు భయపడి చెయ్యలేని పని ఈమె చేసింది. కారు అద్దాల్లోంచి తనకు కన్నుగీటిన వాడిని బయటికి లాగడం కోసం ఆగ్రా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన స్కూటీని ఓ పక్కకు ఆపి, పరుగున వెళ్లి కారు పైకి ఎక్కి విండ్ షీల్డ్ పగల గొట్టింది. ‘‘నాకు కన్నుగీటినందుకు మా ఇంటికి వచ్చి మా నాన్నకు వాడు క్షమాపణ చెప్పాల్సిందే’’ అని హఠం పట్టింది. ఆ కారులో ఉన్నది ఓ రాజకీయ నాయకుడు, ఆయన గన్‌మేన్. ఆ అమ్మాయికి కన్ను గీటింది ఆ గన్మేనే. ఆడపిల్ల తనకేదైనా జరిగితే అన్నకు చెప్పుకుం టుంది. నాన్నకు చెప్పుకుంటుంది. భర్తకు చెప్పుకుం టుంది. పోలీసులకు, న్యాయస్థానాలకు చెప్పుకుం టుంది. సాధ్వీ పాండే తనే తేల్చుకోవాలనుకుంది. అంత కోపం వచ్చిందామెకు. సాద్వీ పాండే చూపిన తెగువ... సైనా, సానియాలు కొట్టిన స్మాష్‌ల కన్నా తక్కువదేం కాదు. మేరీ కోమ్ ఇచ్చిన పంచ్ కన్నా తక్కువ పవరున్నదేం కాదు. టెన్త్ ర్యాంకు కన్నా పిస రంతైనా తీసిపారేయదగింది కాదు. నిజానికి కన్ను గీటితే చప్పుడు రాదు. సాధ్వీ కూడా మౌనంగా ఉండిపోవచ్చు. ఏ రభసా చేయకుండా ఏమీ జరగ నట్టు తన దారిన తను వె ళ్లిపోవచ్చు. కానీ జీవితం పొడవునా ఆమె అంతరాత్మ ఆమెను ప్రశ్నిస్తూనే ఉం టుంది, ‘‘ఎందుకు పిరికిదానిలా మౌనంగా వచ్చే శావ్’’ అని. దానికి సమాధానం ఇవ్వలేక సతమత మవడం కరెక్టా? ఆన్ ది స్పాట్ దులిపేయడం, దులి పేసుకోవడం కరెక్టా? సాధ్వీ కరెక్ట్ పనే చేసింది. అది 23 ఏళ్ల అమ్మాయి వయసు పవర్ కాదు. ‘ఎంపవర్ మెంట్’ను చాటే స్త్రీ శక్తి. మహిళల కోసం ప్రధాని మోదీ చాలా చేస్తున్నారు. సాధ్వీని భేష్ అంటూ ఆయన చిన్న ట్వీట్ వదిలినా చాలు. చట్టాలు, శిక్షలు ఇన్‌స్టంట్‌గా చేయలేని పని ఆ ట్వీట్ చేస్తుంది. - మాధవ్ శింగరాజు -
భారత్‌కు తాడోపేడో
నేడు కొరియాతో మ్యాచ్ గెలిస్తేనే నాకౌట్ దశకు అర్హత డాంగ్వాన్ (చైనా) : సుదిర్మన్ కప్ బ్యాడ్మిం టన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో... మూడుసార్లు విజేత దక్షిణ కొరియాతో భారత జట్టు నేడు అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్1-డిలో భాగంగా జరిగే ఈ లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత పొందుతుంది. ఇదే గ్రూప్ నుంచి మలేసియా తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కొరియా జట్టులో ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గాలంటే అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 5వ ర్యాంకర్ వాన్ హో సన్తో ప్రపంచ 4వ ర్యాంకర్ శ్రీకాంత్... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్ సుంగ్ జీ హున్‌తో ప్రపంచ 2వ ర్యాంకర్ సైనా తలపడే అవకాశముంది. -
సైనా గెలిచినా...
⇒ భారత్‌కు తప్పని ఓటమి ⇒ మలేసియా చేతిలో 2-3తో పరాజయం ⇒ సుదిర్మన్ కప్ డాంగ్వాన్ (చైనా): ఊహించినట్టే జరిగింది. డబుల్స్‌లో బలహీనత భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఫలితంగా సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మలేసియాతో సోమవారం జరిగిన గ్రూప్1-డి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం గెలిచినప్పటికీ... మిగతా మూడు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. వరుసగా రెండో గెలుపుతో మలేసియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. బుధవారం కొరియా, భారత్‌ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నాకౌట్‌కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ కుర్రాడు సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట 15-21, 16-21తో గో వీ షెమ్-తాన్ వీ కియోంగ్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 24-22, 21-13తో తీ జింగ్ యిపై నెగ్గడంతో భారత్ 1-1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 16-21, 15-21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 21-18, 19-21, 21-15తో వివియాన్ కా మున్ హూ-వూన్ ఖె వీ ద్వయంపై గెలుపొందడంతో భారత్ 2-2తో స్కోరును సమం చేసింది. అయితే నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-అరుణ్ విష్ణు జంట 14-21, 18-21తో చాన్ పెంగ్ సూన్-గో లియు యింగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది. ప్రపంచ 56వ ర్యాంకర్ తీ జింగ్ యితో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనాకు గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లను కాపాడుకొన్న ఈ హైదరాబాద్ అమ్మాయి గట్టెక్కింది. రెండో గేమ్‌లో సైనా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తనపై విధించిన ఎనిమిది నెలల నిషేధం పూర్తి కావడంతో ఈ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన లీ చోంగ్ వీ ఆటతీరులో ఏమాత్రం తేడా రాలేదు. పదునైన స్మాష్‌లతో చెలరేగిన అతను శ్రీకాంత్‌కు ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో వివియాన్-వూన్ ఖె వీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ద్వారా జ్వాల జంట బదులు తీర్చుకుంది. -
సరికొత్తలుక్‌లో ’సైనా ’
-
ఫైనల్లో సైనా, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో సైనా, కిడాంబి శ్రీకాంత్‌లు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్ సైనా 21-15, 21-11తో యు హాషిమోటో (జపాన్)పై గెలవగా, రెండోసీడ్ శ్రీకాంత్ 21-16, 21-13తో క్వాలిఫయర్ జుయ్ సాంగ్ (చైనా)ను ఓడించాడు. హాషిమోటోతో 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా సుదీర్ఘమైన ర్యాలీలతో పాటు చక్కటి డ్రాప్ , డీప్ షాట్లు, రిటర్న్స్‌తో ఆకట్టుకుంది. తొలి గేమ్‌లో 18-12 ఆధిక్యం తర్వాత సైనా సర్వీస్ ఫాల్ట్‌లు చేసింది. కానీ చివర్లో హాషిమోటో రెండు అనవసర తప్పిదాలు చేయడంతో హైదరాబాద్ అమ్మాయి గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ కొనసాగిన జపాన్ క్రీడాకారిణి తప్పిదాలను ఆసరాగా చేసుకున్న సైనా 11-2 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సునాయాసంగా నెగ్గింది. ఫైనల్లో సైనా... రత్చనోక్ (థాయ్‌లాండ్)తో ఆడుతుంది. సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆరంభంలో కాస్త వెనుకబడినా బాగా పుంజుకున్నాడు. 4-4, 7-7తో స్కోరు సమమైన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓ దశలో సాంగ్ 16-17తో దూసుకొచ్చినా.. భారత కుర్రాడి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. రెండో గేమ్‌లో సాంగ్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. శ్రీకాంత్ వరుస పాయింట్లతో 9-9తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మరింత దూకుడు పెంచి సాంగ్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ గెలిచాడు. ఫైనల్లో శ్రీకాంత్... అక్సెల్సెన్ (డెన్మార్క్)తో తలపడతాడు. -
‘నంబర్‌వన్’కు చేరువగా...
ఇండియా ఓపెన్ సెమీస్‌లో సైనా శ్రమించి నెగ్గిన శ్రీకాంత్ పోరాడి ఓడిన ప్రణయ్, గురుసాయిదత్ లిన్ డాన్‌కు సుగియార్తో షాక్ న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. గతంలో ఆడిన నాలుగు పర్యాయాల్లో ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించ లేకపోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి... ఐదో ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-15, 21-12తో హనా రమాధిని (ఇండోనేసియా)పై నెగ్గి తొలిసారి ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. సైనాతోపాటు రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్), మూడో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్ లాండ్), యు హాషిమోటో కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ యు హాషిమోటో (జపాన్)తో సైనా ఆడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సైనా వచ్చే గురువారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. 1980లో ప్రకాశ్ పదుకొనే తర్వాత ఇప్పటివరకు భారత్ నుంచి ఎవ్వరూ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోలేదు. హాషిమోటోతో ముఖాముఖి రికార్డులో సైనా 0-1తో వెనుకబడి ఉంది. 2013 ఇండియా ఓపెన్ రెండో రౌండ్లో హాషిమోటోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సైనా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓడిపోవడం గమనార్హం. నాడు ఎదురైన ఓటమికి ఈసారి సైనా లెక్క సరిచేస్తుందో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ టకూమా ఉయెదా (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 79 నిమిషాల్లో 21-15, 23-25, 21-18తో కష్టపడి గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్ జుయ్ సాంగ్ (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. మరోవైపు భారత్‌కే చెందిన గురుసాయిదత్, ప్రణయ్ పోరాడి ఓడారు. క్వార్టర్ ఫైనల్స్‌లో గురుసాయిదత్ 21-15, 18-21, 13-21తో జుయ్ సాంగ్ చేతిలో; ప్రణయ్ 21-16, 9-21, 18-21తో ఆరో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్, చైనా దిగ్గజం లిన్ డాన్‌కు క్వార్టర్ ఫైనల్లో ఊహించని పరాజయం ఎదురైంది. ఎనిమిదో సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా) అద్భుత ఆటతీరును కనబరిచి 21-17, 15-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లిన్ డాన్‌ను ఇంటిముఖం పట్టించాడు. సెమీస్‌లో అక్సెల్సన్తో సుగియార్తో తలపడతాడు. -
టాప్ ర్యాంక్‌పై సైనా గురి
నేటి నుంచి ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ దక్కించుకోవాలనే రెండు లక్ష్యాలతో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది. మంగళవారం మొదలయ్యే ఈ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా ఫైనల్‌కు చేరితే తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సైనాతోపాటు ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)కు కూడా ఈ టోర్నీ ద్వారా టాప్ ర్యాంక్‌ను అందుకునే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే చెరో పార్శ్వం నుంచి సైనా, కరోలినా ఫైనల్‌కు చేరుకోవచ్చు. తొలి రౌండ్లో సైనా క్వాలిఫయర్‌తో; కరోలినా భారత్‌కు చెందిన నేహా పండిత్‌తో ఆడతారు. సైనాతోపాటు మహిళల విభాగంలో భారత్ తరఫున తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని, సయాలీ గోఖలే, రియా పిళ్లై, పి.సి.తులసీ, శ్రుతి ముందాడ, శైలి రాణే, ముద్ర ధైన్జి, తన్వీ లాడ్ పాల్గొంటున్నారు. ఇండియా ఓపెన్‌లో ఆడిన నాలుగు పర్యాయాల్లోనూ సైనా ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ విజేత కిడాంబి శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్, ఆనంద్ పవార్ బరిలో ఉన్నారు. -
సెమీస్‌లో సైనా, సింధు, కశ్యప్
లక్నో: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్... సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హవా కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సైనా 21-18, 21-17తో అరుంధతి పంత్వానే (భారత్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో మూడోసీడ్ సింధు 8-21, 21-11, 21-14తో పోర్న్‌టిప్ బురాన్ప్రాసెర్శ్చెక్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. తద్వారా ఈ ఇద్దరు సెమీస్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్ఫైనల్లో స్కోరు 17-21, 21-12 ఉన్న దశలో శ్రీకాంత్ ప్రత్యర్థి వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ కశ్యప్ 21-18, 21-9తో డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలవగా, గురుసాయిదత్ 18-21, 19-21తో ప్రణయ్ చేతిలో, సాయిప్రణీత్ 21-15, 17-21, 16-21తో అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో మను అత్రీ-సుమీత్ రెడ్డి 21-18, 4-21, 24-22తో పీటర్సెన్-కోల్డింగ్ (డెన్మార్క్)పై నెగ్గి సెమీస్‌కు చేరారు. ఇతర మ్యాచ్‌ల్లో నంద గోపాల్-అర్జున్ 9-21, 14-21తో ఇవనోవ్-సొజ్నోవ్ (రష్యా)ల చేతిలో; హేమ నాగేంద్ర-అరుణ్ 13-21, 8-21తో బోయె-మాగ్నెసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని జంట 21-6, 21-5తో జమునా రాణి-లీలా లక్ష్మీ జోడీపై నెగ్గింది. -
సైనా టైటిల్ నిలబెట్టుకునేనా..?
నేటి నుంచి సయ్యద్ మోదీ అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సీజన్‌ను ఘనంగా ఆరంభించాలనే ఆలోచనలో ఉంది. నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ అంతర్జాతీయ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగ బోతోంది. లక్షా 20 వేల డాలర్ల విలువైన ప్రైజ్‌మనీ కలిగిన ఈ టోర్నీని ఉత్తరప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం నిర్వహిస్తోంది. 24 ఏళ్ల సైనా ఈ టోర్నీని 2009, 10లో నెగ్గింది. తిరిగి గతేడాది విజేతగా నిలిచిన తనకు మహిళల సింగిల్స్‌లో ఈసారి మూడో సీడ్ పీవీ సింధు, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ‘టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. గతేడాది సీజన్ అద్భుతంగా ముగిసింది. ఈ ఏడాది ఘనంగా ఆరంభించేందుకు సయ్యద్ మోదీ టోర్నీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరోసారి విజేతగా నిలిచి సీజన్‌ను ప్రారంభించాలనుకుంటున్నాను. సింధు, కరోలినా రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నారు’ అని సైనా తెలిపింది. బుధవారం సైనా తొలి రౌండ్లో యిన్ ఫన్ లిమ్ (మలేసియా)ను ఎదుర్కోనుంది. ఇక సింధు క్వాలిఫయర్‌తో టోర్నీ ఆరంభిస్తున్నా మూడో రౌండ్లో ఆరో సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రసేర్ట్సక్తో అసలు పోటీ ఎదురుకానుంది. పురుషుల విభాగంలో గతేడాది రన్నరప్ కె.శ్రీకాంత్, పి.కశ్యప్, సాయి ప్రణీత్, అజయ్ జయరాం, ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు తొలి రౌండ్లో బై లభించింది. -
సైనాకిస్తే నాకూ ఇవ్వాల్సిందే
పద్మభూషణ్ అవార్డుపై బాక్సర్ విజేందర్ న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డు కోసం ఇప్పుడు బాక్సర్ విజేందర్ కూడా గళమెత్తుతున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా దరఖాస్తును ముందుగా తిరస్కరించినప్పటికీ తను అభ్యంతరం తెలపడంతో క్రీడా శాఖ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు రావాలని కోరుకుంటున్నట్టు విజేందర్ తెలిపాడు. ‘సైనాకు, నాకు 2010లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రదర్శన పరంగా ఇద్దరం సమానంగానే ఉన్నాం. 2008లో ఒలింపిక్ కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా గేమ్స్‌లో, ప్రపంచ పోలిస్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించాను. ఒకవేళ ఆమె పేరును ఈ అవార్డు కోసం ప్రతిపాదిస్తే నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా’ అని విజేందర్ అన్నాడు. -
నా ఉద్దేశం అది కాదు:సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ అవార్డు కోసం డిమాండ్ చేసే స్థాయి తనకు లేదని స్పష్టం చేసింది. ‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించింది. తానేనాడూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం డిమాండ్ చేయలేదని తెలిపింది. ‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది. కానీ నా ఉద్దేశం అది కాదు. నా పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలుసుకోవాలనుకున్నాను'అని సైనా తెలిపింది. -
వివాదం ముగిసింది
న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అనుకున్నది సాధించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరును ప్రత్యేకంగా హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న వివాదం ముగిసినట్టయ్యింది. అయితే నిర్ణీత గడువులోగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆమె నామినేషన్‌ను తమకు పంపలేదని మరోసారి తేల్చి చెప్పింది. ‘సైనా నెహ్వాల్ సాధించిన ఘన విజయాల ఆధారంగా ఆమె పేరును ప్రత్యేక కేసుగా పరిగణించి హోం శాఖకు ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ఏడాదే కాకుండా 2013లోనూ సైనా పేరును ప్రతిపాదిస్తూ బాయ్ నుంచి మాకు ఎలాంటి లేఖ అందలేదు. అందుకే హోం శాఖకు ఆమె పేరును పంపలేకపోయాం. అలాంటప్పుడు పద్మ అవార్డుల విషయంలో ఐదేళ్ల నిర్ణీత గడువు ముగిసినా పట్టించుకోవడం లేదనే వాదన అర్థరహితం. ఈనెల 3న మాత్రమే బాయ్ నుంచి నామినేషన్ అందింది’ అని క్రీడా శాఖ తెలిపింది. డిమాండ్ చేయడానికి నేనెవర్ని: సైనా ‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించింది. తానేనాడూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది. ‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది. కానీ నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ అవార్డును డిమాండ్ చేసేందుకు నేనెవర్ని? నేను కేవలం క్రీడాకారిణిని. దేశం కోసం ఆడుతున్నాను. నా పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయంలో క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సైనా స్పందించింది. రాష్ట్రపతి నామినేట్ చేయాల్సి ఉంటుంది పద్మభూషణ్ అవార్డు కోసం బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేరును గడువు ముగిసినా కేంద్ర క్రీడా శాఖ... హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించినప్పటికీ ఈ అవార్డు ఆమెకు దక్కడం సందేహంగానే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని లేక హోం మంత్రి మాత్రమే చివరి నిమిషంలో ఎవరి పేరునైనా పద్మ అవార్డుల కమిటీకి ప్రతిపాదించే అధికారం ఉంటుంది. మరోవైపు సైనా పేరును సోమవారం ప్రతిపాదించామని, తుది నిర్ణయం హోం శాఖ తీసుకుంటుందని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 15నే నామినేషన్ల గడువు ముగియగా అవార్డుల కోసం 1878 నామినేషన్లు వచ్చాయి. ఇందులో నుంచి రెండు పద్మవిభూషణ్, 24 పద్మభూషణ్, 101 పద్మశ్రీ అవార్డులను ఈనెల 26న ప్రకటిస్తారు. -
నా లక్ష్యం నంబర్‌వన్: సైనా
హైదరాబాద్: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపింది. అయితే దానికి నిర్ణీత కాలాన్ని గడువుగా పెట్టుకోలేదని, నంబర్‌వన్ ర్యాంక్ చేరుకోవడానికి కష్టపడతానని చెప్పింది. ‘ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌కి చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి లక్ష్యం నం.1 ర్యాంకు చేరుకోవడమే. దాని కోసం కష్టపడతాను. చైనా క్రీడాకారిణులతో పోటీ ఉన్నా ప్రయత్నిస్తాను’ అని చెప్పింది. తను ఎవరి వద్ద కోచింగ్ తీసుకుంటాననే విషయం కంటే, సాధించే పతకాలపై ప్రజలు దృష్టి పెట్టాలని సూచించింది. ‘నా ప్రదర్శన, సాధించిన పతకాలపై ప్రజలు దృష్టి సారించాలి. కోచింగ్ ఎవరి వద్ద తీసుకుంటాననేది నాకు సంబంధించిన విషయం. ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడుతున్నప్పుడు నేను కొన్ని విషయాల్లో మెరుగుపడాలని అక్కడే ఉన్న విమల్ సర్ చెప్పారు. చైనా ఓపెన్‌కు ముందు విమల్ సర్ అధ్వర్యంలో నా బలహీనతలను సరిదిద్దుకున్నాను’ అని చెప్పింది. -
చైనా ఓపెన్ వదిలేద్దామనుకున్నా
విమల్ సర్ చెబితేనే ఆడా సైనా నెహ్వాల్‌కు సూపర్ సిరీస్ విజయాలు కొత్త కాదు. కానీ చైనా ఓపెన్ గెలవడం చాలా ప్రత్యేకం. అలాగే గోపీచంద్ శిష్యురాలు విమల్ కుమార్ దగ్గరకు మారిపోయాక సాధించిన తొలి పెద్ద టైటిల్ ఇది. అయితే సైనా... అసలు చైనా ఓపెన్‌లో ఆడాలని అనుకోలేదట. కోచ్ ఆడాల్సిందే అనడంతోనే బరిలోకి దిగిందట. చైనా ఓపెన్ విజయంతో పాటు... కోచ్ గురించి, సాధించిన విజయాల గురించి సైనా ‘సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... చైనా ఓపెన్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అన్ని టోర్నీల్లోకి ఇది చాలా క్లిష్టం. ఓ రకంగా ఇది కల నిజమైన క్షణం. నా జీవితాంతం గుర్తుండిపోయే విజయం ఇది. వరుసగా ముగ్గురు చైనా అమ్మాయిలపై గెలవడం సంతోషంగా ఉంది. షిజియాన్ వాంగ్, యిహాన్ వాంగ్‌లను ఓడించిన యామగుచిపై ఫైనల్లో నెగ్గాను. ఈ టోర్నీలో యామగుచి అద్భుతమైన ఫామ్‌లో ఆడింది. నాతో కలిసి కష్టపడినందుకు విమల్ సర్‌కు కృతజ్ఞతలు. నా ఆటలో కొంత వైవిధ్యం తెచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. రోజు రోజుకు నా ఆట మెరుగుపడుతోంది. టోర్నీల మధ్య ఎక్కువ విరామం లేకపోతే ఆటకు మెరుగులు దిద్దుకోవడం కష్టం. కానీ మాకు లభించిన రెండు వారాల వ్యవధిలోనే ఆయన చాలా కష్టపడ్డారు. నిజానికి చైనా ఓపెన్ ఆడాలని నేను అనుకోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ట్రైనింగ్‌కు సమయం సరిపడా లేదు. కానీ విమల్ సర్కి నా మీద నమ్మకం ఎక్కువ. ఆయన మాట విని చైనా ఓపెన్ ఆడాను. నమ్మశక్యంకాని రీతిలో విజయం సాధించాను. ఒక టోర్నీలో ఓడినా చైనా క్రీడాకారిణులు ఎప్పుడూ బలమైన ప్రత్యర్థులే. బ్యాడ్మింటన్‌లో అంత బలమైన దేశం మరొకటి లేదు. అయితే మనం నిరంతరం కష్టపడటం ద్వారా చైనా వాళ్లను కూడా తరచుగా ఓడించవచ్చు అనే విశ్వాసం ఉంది. గోపీ, విమల్ ఇద్దరూ మంచి కోచ్‌లే. ఇద్దరూ ఆటగాళ్లతో కలిసి బాగా కష్టపడతారు. అందుకే భారత్ నుంచి చాలా మంది ఆటగాళ్లు వస్తున్నారు. చాలాకాలం గోపీ సర్ దగ్గర శిక్షణ తీసుకున్నా... కొంత మార్పు అవసరం అనుకున్నా. నా గేమ్ ఎక్కడో ఆగిపోయింది అనిపించింది. అందుకే విమల్ సర్ దగ్గరకు వెళ్లా. కొత్త ప్రయత్నాలు చేయడం ఎప్పుడూ మంచిదే. విమల్ సర్ శిక్షణతో సంతోషంగా ఉన్నా. విమల్ సర్ శిక్షణలో కచ్చితంగా ఎక్కడ మెరుగయ్యా అనే విషయం చెప్పలేను. కాకపోతే ఆటలో నా బలహీనతలన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేశాం. రెండు వారాల శిక్షణతోనే ైచె నా ఓపెన్ గెలవగలిగా. అంటే మేం నా ఆట మీద ఎలాంటి కసరత్తు చేశామో అర్థం చేసుకోవచ్చు. నేను కూడా మనిషినే. ప్రతి టోర్నీ గెలవడం సాధ్యం కాదు. బరిలోకి దిగిన ప్రతిసారీ గెలవాలనే అనుకుంటాను. చైనాకు మనకు చాలా తేడా ఉంది. వాళ్లకు ప్రతి ముగ్గురు క్రీడాకారులకు 10 మంది కోచ్‌లు ఉంటారు. అందుకే వాళ్లు ప్రతిసారీ గెలుస్తూ ఉంటారు. కానీ మన దగ్గర 40, 50 మందికి ఒక్కరే కోచ్. కాబట్టి భారత్ సింగిల్స్ క్రీడాకారులు టైటిల్స్ గెలవడం సులభం కాదు. నేను ఇప్పటివరకూ 8 సూపర్ సిరీస్‌లు గెలిచాను. వేర్వేరు టోర్నీల్లో 11 సార్లు ఫైనల్‌కు చేరాను. ఒలింపిక్ మెడల్ గెలిచాను. మన దగ్గర సౌకర్యాలు అంత గొప్పగా లేకపోయినా నేను పతకాలు సాధించాను. కాబట్టి నేను సాధించిన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. {పస్తుతం నేను విమల్ సర్ శిక్షణతో సంతోషంగా ఉన్నా. కాబట్టి అక్కడే కొనసాగుతా. నేను ఎప్పుడూ ర్యాంక్‌ల గురించి పట్టించుకోను. నా లక్ష్యం టైటిల్స్ గెలవడం. గెలుస్తూ ఉంటే ర్యాంక్ అదే మెరుగవుతుంది. -
సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించారు. తొలిరౌండ్లో సైనా 21-17, 21-11 స్కోరుతో జామీ సుబంది (అమెరికా)ను సునాయాసంగా ఓడించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్బుంరుంగ్పాన్పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో చో (చైనీస్ తైపీ)ని మట్టికరిపించాడు. -
సెమీస్‌లో సైనా, శ్రీకాంత్
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫుజౌ: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరో సీడ్ సైనా 21-13, 17-21, 21-5 స్కోరుతో ది సుయో (చైనా)పై విజయం సాధించింది. 59 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో గేమ్ నెగ్గి సమంగా నిలిచారు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒక్కసారిగా చెలరేగింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చిత్తు చేసింది. మరో క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-17, 23-21తో కెంటో మొమొటా (జపాన్)పై విజయం సాధించాడు. 44 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. సెమీస్‌లో సైనా, లి గ్జిన్ (చైనా)తో, వెబ్లర్ (జర్మనీ)తో శ్రీకాంత్ తలపడతారు. మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌కు మాత్రం క్వార్టర్ ఫైనల్లో పరాజయం ఎదురైంది. 73 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో కశ్యప్ 21-18, 18-21, 13-21తో మార్క్ వెబ్లర్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడాడు. -
శ్రమించి గెలిచారు
రెండో రౌండ్లో సైనా, కశ్యప్, శ్రీకాంత్ చైనా ఓపెన్ ఫుజౌ (చైనా): గట్టి ప్రత్యర్థులు ఎదురైనా... పట్టుదలతో పోరాడిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల తొలి రౌండ్లో ఆరో సీడ్ సైనా 21-14, 19-21, 21-17తో సయాక తకహాషి (జపాన్)పై గెలిచింది. తకహాషిపై సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-11, 9-21, 21-15తో హైదరాబాద్‌కే చెందిన తన సహచరుడు గురుసాయిదత్‌పై గెలుపొందగా... కశ్యప్ 24-22, 19-21, 21-15తో నాన్ వీ (హాంకాంగ్)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ 10-21, 21-19, 18-21తో విక్టర్ అక్జెల్సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 12-21, 15-21తో జియోలాంగ్ లియు-జిహాన్ కియు (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది. తకహాషితో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ అమ్మాయి తడబడి ఒకదశలో వరుసగా ఎనిమిది పాయింట్లను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒకదశలో 11-12తో వెనుకబడినప్పటికీ వెంటనే కోలుకుంది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 16-11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. -
సైనా, కశ్యప్ ర్యాంకులు మెరుగు
కౌలాలంపూర్: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం సంపాదించి ఆరో ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక కశ్యప్, శ్రీకాంత్ ఏడేసి స్థానాలు మెరుగుపరచుకుని వరసగా 21, 16 ర్యాంక్‌లు కైవసం చేసుకున్నారు. వర్ధమాన షట్లర్ పీవీ సింధు పదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
సైనా, సింధులకు పరీక్ష
నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ ఒడెన్స్: సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన దీర్ఘకాల కోచ్ పుల్లెల గోపీచంద్‌కు వీడ్కోలు పలికి బెంగళూరులో మరో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందుతోన్న సైనాకు ఈ టోర్నీ ఎంతో కీలకంకానుంది. మరోవైపు అద్భుత నైపుణ్యం ఉన్నా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న సింధుకు కూడా ఈ టోర్నీ సవాలుగా నిలువనుంది. వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు గతేడాది ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 2012లో డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సైనా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో, ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచి మిగతా టోర్నీలలో నిరాశ పరిచింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కరీన్ షానాస్ (జర్మనీ)తో సైనా; పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ ఇంగ్లండ్‌కు చెందిన రాజీవ్ ఉసెఫ్తో; జుయ్ సాంగ్ (చైనా)తో శ్రీకాంత్ పోటీపడతారు. వాస్తవానికి తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో శ్రీకాంత్ ఆడాలి. అయితే లీ చోంగ్ వీ వైదొలగడంతో అతని స్థానాన్ని జుయ్ సాంగ్‌తో భర్తీ చేశారు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగాల్సినప్పటికీ చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మెయిన్ ‘డ్రా’కు అశ్విని-ఇవనోవ్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అశ్విని-ఇవనోవ్ 21-13, 21-17తో క్రిస్టియాన్సన్-లీనా గ్రెబెక్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచింది. -
సైనా, సింధుపై ఆశలు
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుపై భారీ ఆశలున్నాయి. దక్షిణ కొరియాలో శనివారం ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్ బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ తరపున 13 మంది బరిలో దిగుతున్నారు. వీరిలో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఏడు కేటగిరిల్లో పతకాల కోసం పోటీపడుతున్నారు. మహిళలు, పురుషుల సింగిల్స్, మహిళలు, పరుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషులు, మహిళల ఈమ్ ఈవెంట్లలో ఆడనున్నారు. సైనా, సింధుతో పాటు పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్, గురుసాయి దత్, సుమీత్, మను అట్రి, సౌరభ్ వర్మ, పీసీ తులసి, అశ్వినీ పొన్నప్ప, తన్వీ లాడ్, ప్రణవ్ చోప్రా ఆడనున్నారు. పతకాల వేటలో సైనా, సింధుపై చాలా అంచనాలున్నాయి. ఇతర ఆటగాళ్ల కూడా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. -
‘షటిల్’ స్పీడ్‌తో....
సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్....అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ జాబితా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఎక్కడ బ్యాడ్మింటన్ టోర్నీ జరిగినా మన ఆటగాళ్లదే హవా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున సాధించే పతకాలన్నీ మన రాష్ట్ర క్రీడాకారులు అందించినవే. సీనియర్ స్థాయిలో ఒలింపిక్ మెడల్ వరకు మన ప్రభ వెలిగితే...జూనియర్ స్థాయిలోనైతే అనేకానేక విజయాలు దక్కాయి. ఒక వైపు స్టార్ ప్లేయర్లు తమ జోరును కొనసాగిస్తుంటే...మరో వైపు వర్ధమాన, యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా మన వద్ద బ్యాడ్మింటన్ ఒక్కసారిగా పాపులర్ క్రీడగా మారిపోయింది. ఆట నేర్చుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు అవకాశాలు పెరగడం కూడా అందుకు కారణం. మన రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ అకాడమీలు, కేంద్రాల్లో బ్యాడ్మింటన్‌లో చక్కటి శిక్షణ లభిస్తోంది. మన రాష్ట్రంలో ఈ ఆటలో అందుబాటులో ఉన్న శిక్షణా సౌకర్యాలపై ఒక దృష్టి... - మొహమ్మద్ అబ్దుల్ హాది పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ... దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ నంబర్‌వన్‌గా ఉన్న అకాడమీ ఇది. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో సంచలన విజయాలు సాధిస్తూ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నవారే. భారత జట్టు చీఫ్ కోచ్ గోపీచంద్ నేతృత్వంలో సైనా, సింధు, కశ్యప్‌లాంటి ఎందరో ఆటగాళ్లు వరుస విజయాలు సాధించారు. అనేక మంది వర్ధమాన షట్లర్లు ఇక్కడినుంచే వెలుగులోకి వస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, కోర్టులు, శిక్షణతో ఈ అకాడమీ తిరుగులేని ఫలితాలు కనబరుస్తోంది. ప్రవేశం గోపీచంద్ అకాడమీలో ప్రధానంగా అగ్రశ్రేణి ఆటగాళ్లే శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక లేదా జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినవారు ఇక్కడ చేరితే మరింత మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. వారి పూర్వ ప్రదర్శనను బట్టి ఇక్కడ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తిగా కొత్తవారికి కూడా పరిమిత సంఖ్యలో శిక్షణ లభిస్తుంది. అయితే అందుకోసం ఇక్కడి నిపుణులైన కోచ్‌లు నిర్దేశించిన ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. వారి ప్రాథమిక పరిజ్ఞానం, చురుకుదనాన్ని బట్టి ఎంపిక చేస్తారు. వివరాలకు గచ్చిబౌలిలోని అకాడమీ కేంద్రంలో సంప్రదించవచ్చు. నంద్యాల అకాడమీ... జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో ఈ ప్రైవేట్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఈ అకాడమీకి చెందిన ఆటగాళ్లు నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నంది పైప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ అకాడమీలో ప్రస్తుతం 60 మంది ఆటగాళ్లకు ఇద్దరు కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. ఇతర వివరాలకు నంది స్పోర్ట్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇతరత్రా... మే నెలలో కొత్తగా మరో 3 ప్రైవేట్ బ్యాడ్మింటన్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. పుల్లెల గోపీచంద్ సహకారంతోనే, చిట్టూరి సుబ్బారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్తగా అకాడమీ ప్రారంభం కానుంది. గతంలో శాప్‌లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో (షేక్‌పేట్, ఏఎస్‌రావునగర్)లలో కొత్తగా అకాడమీలను ప్రారంభిస్తున్నారు. మరో వైపు దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం ఆరిఫ్ కూడా అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇది నగరంలోని బండ్లగూడలో పూర్తి స్థాయిలో ఏర్పాటు కావచ్చు. ప్రభుత్వం తరఫున... ఖమ్మం శాప్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో హాస్టల్ సదుపాయంతో నిర్వహిస్తున్న ఒకే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఖమ్మంలో ఉంది. ఇక్కడినుంచి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో షట్లర్లు వెలుగులోకి వచ్చారు. 12-18 ఏళ్ల మధ్య వయసువారికి అవకాశం కల్పిస్తారు. గరిష్టంగా 20 మందిని తీసుకుంటారు. ఒక కోచ్ అందుబాటులో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ఎంపిక చేయడంతో పాటు అప్పటికే జూనియర్ స్థాయిలో రాణిస్తున్న చిన్నారులను అకాడమీలోకి తీసుకుంటారు. అయితే గత కొన్నాళ్లుగా టాలెంట్ సెర్చ్ కార్యక్రమం నిలిచిపోయింది. సాధారణంగా జూన్‌లో ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు ఖమ్మంలోని జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో గానీ హైదరాబాద్‌లోని శాప్ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించవచ్చు. స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ (సరూర్‌నగర్) రాజధాని నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 50 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ అకాడమీలో 12-18 ఏళ్ల మధ్య వయసు ఆటగాళ్లను కోచింగ్ కోసం ఎంపిక చేస్తారు. ముగ్గురు కోచ్‌లు పని చేస్తున్నారు. కనీసం జిల్లా స్థాయిలో ఆడిన షట్లర్లను వివిధ దశల్లో వడపోతల అనంతరం ఎంపిక చేస్తారు. అయితే పూర్తిగా కొత్తగా ఉండే లెర్నర్స్ను కూడా 6-8 ఏళ్ల మధ్య వయసు వారిని ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వివరాలకు సరూర్‌నగర్ స్టేడియంలో సంప్రదించవచ్చు. ఎల్బీ స్టేడియం... శాప్ ప్రధాన కార్యాలయం ఉన్న లాల్‌బహదూర్ స్టేడియంలో కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ సాధన చేస్తారు. ఎల్బీ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. ఈ చిన్నారులకు శాప్ నియమించిన కోచ్ శిక్షణ ఇస్తారు. శాప్ పరిధిలోని యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో కూడా పే అండ్ ప్లే పథకం కొనసాగుతోంది. అయితే ఎల్బీ స్టేడియంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో కోచ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి గలవారు స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించవచ్చు. విజయవాడలో.... ఒకప్పుడు అత్యుత్తమ క్రీడాకారులను అందించిన విజయవాడలో ఇప్పుడు బ్యాడ్మింటన్ కళ తప్పింది. కొన్నాళ్ల క్రితం చేతన్ ఆనంద్ అకాడమీని ప్రారంభించినా... వివిధ కారణాలతో అందులో శిక్షణ ఆగిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు కోచింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున ఇక్కడ ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నారులకు ఆటలో బేసిక్స్ నేర్పించేందుకు అవకాశం ఉంది. -
అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష
భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా సైనా ఈసారైనా నెగ్గేనా? నేటి నుంచే ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలువురు టాప్ షట్లర్లు పాల్గొంటున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌కు నేడే తెరలేవనుంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌తో సహా దాదాపు స్థానిక క్రీడాకారులందరికీ క్లిష్టమైన డ్రాలే ఎదురు కానుండడంతో టోర్నీపై గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి నెలకొంది. భారత షట్లర్లలో సైనాకు మాత్రమే సీడింగ్ (8వ) లభించింది. ప్రపంచ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ రచానోక్ (థాయ్‌లాండ్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. సైనాకు తొలిరౌండ్లో సిమోన్ ప్రచ్ (ఆస్ట్రియా) రూపంలో తేలికైన ప్రత్యర్థే ఎదురు పడనున్నా, క్వార్టర్స్‌కు చేరితే మాత్రం ఎనిమిదో సీడ్ చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో కఠిన పరీక్షే కానుంది. ఈ టోర్నీ గత మూడు ఎడిషన్లలో రెండో రౌండ్ దాటలేకపోయిన సైనా... ఈసారి తన రికార్డును మెరుగు పరచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక హైదరాబాద్ రైజింగ్ స్టార్ సింధు తొలి రౌండ్లోనే రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడనుంది. అయితే ఇటీవల స్విస్ ఓపెన్‌లో సింధు... షిజియాన్‌ను ఓడించడంతోపాటు ఓవరాల్‌గా ఆమెపై 3-0 రికార్డు కలిగి ఉండడం మానసికంగా పైచేయిగా కనిపిస్తోంది. ఇక ఇండియా ఓపెన్‌లో గత రెండు టోర్నీల్లో వరుసగా క్వార్టర్స్, సెమీఫైనల్‌కు చేరిన సింధుకు మంచి రికార్డే ఉంది. లీ చోంగ్ వీ (మలేసియా) టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌కు తాజా ర్యాంకింగ్ కారణంగా క్లిష్టమైన డ్రానే లభించింది. తొలిరౌండ్లోనే కశ్యప్ ఆరోసీడ్ చైనా ఆటగాడు జెంగ్‌మింగ్ వాంగ్‌తో తలపడాల్సివస్తోంది. మలేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌరభ్ వర్మ, కె.శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్ వంటివారు భారత్ తరపున ప్రధాన ఆటగాళ్లు కాగా... మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి, తన్వీ లాడ్, తృప్తి ముర్గుండే, సైలి రాణే, అరుంధతి లాంటి ద్వితీయశ్రేణి క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి-ప్రద్న్యా గాద్రె, ప్రజక్తా సావంత్-ఆరతి జోడీలు, మిక్స్‌డ్‌లో తరుణ్ కోన-అశ్విని, విష్ణు-అపర్ణా బాలన్ జంటలపై అంచనాలున్నాయి -
ఆల్ ఇంగ్లాండ్ బ్యాట్మెంటన్లో సైనా శుభారంభం
-
ఇబిఎల్ ఫైనల్లో హైదరాబాద్ హాట్ షాట్స్