సెమీస్‌లో సైనా, సింధు, కశ్యప్ | Saina Nehwal reaches World No. 3, PV Sindhu back in top 10 | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సైనా, సింధు, కశ్యప్

Published Sat, Jan 24 2015 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

సెమీస్‌లో సైనా, సింధు, కశ్యప్

సెమీస్‌లో సైనా, సింధు, కశ్యప్

లక్నో: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్... సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హవా కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సైనా 21-18, 21-17తో అరుంధతి పంత్‌వానే (భారత్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో మూడోసీడ్ సింధు 8-21, 21-11, 21-14తో పోర్న్‌టిప్ బురాన్‌ప్రాసెర్‌శ్చెక్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. తద్వారా ఈ ఇద్దరు సెమీస్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ సెమీస్‌కు చేరుకున్నారు.

క్వార్టర్‌ఫైనల్లో స్కోరు 17-21, 21-12 ఉన్న దశలో శ్రీకాంత్ ప్రత్యర్థి వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ కశ్యప్ 21-18, 21-9తో డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలవగా, గురుసాయిదత్ 18-21, 19-21తో ప్రణయ్ చేతిలో, సాయిప్రణీత్ 21-15, 17-21, 16-21తో అక్సెల్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.

పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో మను అత్రీ-సుమీత్ రెడ్డి 21-18, 4-21, 24-22తో పీటర్సెన్-కోల్డింగ్ (డెన్మార్క్)పై నెగ్గి సెమీస్‌కు చేరారు. ఇతర మ్యాచ్‌ల్లో నంద గోపాల్-అర్జున్ 9-21, 14-21తో ఇవనోవ్-సొజ్‌నోవ్ (రష్యా)ల చేతిలో; హేమ నాగేంద్ర-అరుణ్ 13-21, 8-21తో బోయె-మాగ్నెసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని జంట 21-6, 21-5తో జమునా రాణి-లీలా లక్ష్మీ జోడీపై నెగ్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement