క్వార్టర్స్‌లో శ్రీకాంత్ ఓటమి
గ్లాస్కో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భారత్ అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. స్కాట్లాండ్ లో శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 14-21, 18-21 తో వరల్డ్ నంబర్ వన్ షట్లర్ సన్ వాన్ చేతిలో ఓడిపోయాడు. 49 నిమిషాల పాటు జరిగిన పోరులో సన్ వాన్ అనుభవం ముందు శ్రీకాంత్ తేలిపోయాడు.
తొలి గేమ్ ను పెద్దగా ప్రతిఘటించకుండానే కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ లో మాత్రం కడవరకూ పోరాడి ఓటమి చెందాడు. దాంతో టోర్నీ నుంచి శ్రీకాంత్ భారంగా నిష్ర్కమించాడు. ఈ ఓటమితో వరల్డ్ చాంపియన్ షిప్ లో పతకం సాధించాలనుకున్న శ్రీకాంత్ ఆశలు తీరలేదు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో పివీ సింధు, సైనా నెహ్వాల్ లు క్వార్టర్ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు.