సైనా శుభారంభం..!
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ లో ఇండియన్ టాప్ షట్లర్, ప్రపంచ నంబర్ వన్ సైనా నేహ్వాల్ శుభారంభం చేసింది. సైనాతో పాటు పారుపల్లి కశ్యప్, కిదాంబిశ్రీకాంత్, ప్రణయ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు. అయితే పీవీ సింధు కు మాత్రం తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా 21-14, 21-20 తేడాతో.. థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై గెలిచింది.
మరో మ్యాచ్‌లో సింధు 21-13, 17-21,21-11 స్కోర్ తో జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఓడిపోయింది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా ఎదురయ్యేది. సింధు ఓటమితో ప్రిక్వార్టర్ ఫైనల్లో మితానీతో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కశ్యప్ జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల - అశ్వనిపొన్నప్ప జంట చైనా జంట ఎనిమిదో సీడ్ జుహో యున్ లీ- జాంగ్ జంట చేతిలో 22-20, 18-21, 21-13 స్కోర్ తేడాతో ఓడిపోయారు.