జపాన్ ఓపెన్ లో సింధుకి షాక్
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి షాక్ తగిలింది. తొలి రౌండ్ మ్యాచ్ లోనే ఇంటి దారి పట్టింది. జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మూడు రౌండ్ల పాటు జరిగిన మ్యాచ్ లో 21-13, 17-21,21-11 స్కోర్ తో ఓడిపోయింది.
మరో వైపు.. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టాడు. జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వనిపొన్నప్ప జంట కూడా ఓటమితో నిరాశ పరిచారు.