సైనా, సింధుపై ఆశలు
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుపై భారీ ఆశలున్నాయి. దక్షిణ కొరియాలో శనివారం ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్ బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ తరపున 13 మంది బరిలో దిగుతున్నారు. వీరిలో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఏడు కేటగిరిల్లో పతకాల కోసం పోటీపడుతున్నారు. మహిళలు, పురుషుల సింగిల్స్, మహిళలు, పరుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషులు, మహిళల ఈమ్ ఈవెంట్లలో ఆడనున్నారు.
సైనా, సింధుతో పాటు పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్, గురుసాయి దత్, సుమీత్, మను అట్రి, సౌరభ్ వర్మ, పీసీ తులసి, అశ్వినీ పొన్నప్ప, తన్వీ లాడ్, ప్రణవ్ చోప్రా ఆడనున్నారు. పతకాల వేటలో సైనా, సింధుపై చాలా అంచనాలున్నాయి. ఇతర ఆటగాళ్ల కూడా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.