సెమీస్‌లో సైనా, శ్రీకాంత్ | Saina Nehwal, Kidambi Srikanth in semis, P Kashyap exits in China Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సైనా, శ్రీకాంత్

Published Sat, Nov 15 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

సెమీస్‌లో సైనా, శ్రీకాంత్

సెమీస్‌లో సైనా, శ్రీకాంత్

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
 
 ఫుజౌ: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరో సీడ్ సైనా 21-13, 17-21, 21-5 స్కోరుతో ది సుయో (చైనా)పై విజయం సాధించింది. 59 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో గేమ్ నెగ్గి సమంగా నిలిచారు.

అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒక్కసారిగా చెలరేగింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చిత్తు చేసింది. మరో క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-17, 23-21తో కెంటో మొమొటా (జపాన్)పై విజయం సాధించాడు. 44 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. సెమీస్‌లో సైనా, లి గ్జిన్ (చైనా)తో, వెబ్లర్ (జర్మనీ)తో శ్రీకాంత్ తలపడతారు.

 మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌కు మాత్రం క్వార్టర్ ఫైనల్లో పరాజయం ఎదురైంది. 73 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో కశ్యప్ 21-18, 18-21, 13-21తో మార్క్ వెబ్లర్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement