రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతో పాల్గొని లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే వారంలో పునరాగమనం చేయనుంది. అయితే భవిష్యత్‌లో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని సైనా తెలిపింది. ‘చాలా మంది నా కెరీర్ ముగిసిందని భావిస్తున్నారు. ఇక పునరాగమనం చేయలేనని అనుకుంటున్నారు. గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే ఒక్కోసారి నాకూ అలాగే అనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం’ అని 26 ఏళ్ల సైనా అభిప్రాయపడింది.