రియోలో మరో భారత ఆశాకిరణం పోరాటం ముగిసింది. ఒలింపిక్ పతకం సాధించాలన్న భారత యువ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. పోరాటపటిమ ప్రదర్శించినా చైనా అడ్డుగోడను దాటడంలో విఫలమయ్యాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 స్కోరుతో చైనా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. దీంతో భారత అభిమానులకు మరోసారి నిరాశతప్పలేదు. శ్రీకాంత్ పతకం వేటలో విఫలమైనా, తన ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు
Published Wed, Aug 17 2016 7:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement