Lin Dan
-
సినిమాల్లో 'డాన్'లు చాలా మందే.. బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక్కడే 'డాన్'
డాన్... ఆ పేరులోనే ప్రపంచాన్ని శాసిస్తున్న భావన వినిపిస్తుంది! ఈ డాన్ కూడా అలాగే చేశాడు. సుదీర్ఘకాలం పాటు బ్యాడ్మింటన్ ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఎందరు పోటీకొచ్చినా.. ఎందరు ప్రయత్నించినా అతడిని పడగొట్టలేకపోయారు. సాధించిన ఘనతలు, రికార్డులు చూస్తే అతని తిరుగులేని ఆట కళ్ల ముందు కనిపిస్తుంది. టీనేజర్‌గా దూసుకొచ్చి దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయాలకు చిరునామాగా మారిన ఆల్‌టైమ్ బ్యాడ్మింటన్ గ్రేట్ లిన్ డాన్. షటిల్‌ను చైనా నడిపించిన కాలం నుంచి ఇతర దేశాల షట్లర్ల జోరు పెరిగే దాకా.. ఎక్కడా ఆటలో వన్నె తగ్గని వీరుడతను. బ్యాడ్మింటన్ ప్రపంచంలో 9 టోర్నమెంట్లను అత్యుత్తమమైనవిగా భావిస్తారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ కప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్... సూపర్ గ్రాండ్స్లామ్గా వ్యవహరించే వీటన్నింటిని గెలుచుకున్న తొలి, ఏకైక ఆటగాడు లిన్ డాన్ మాత్రమే. 28 ఏళ్ల వయసు వచ్చే సరికే అతను సాధించిన ఈ ఘనత.. డాన్ స్థాయి ఏమిటో చూపిస్తుంది. ఇన్నేళ్లలో మరే ఆటగాడికి సాధ్యం కాని రీతిలో అతను ప్రదర్శించిన ఆట డాన్‌ను బాడ్మింటన్ దిగ్గజంగా మార్చింది. ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ఏకైక షట్లర్ డాన్ మాత్రమే. 2008లో బీజింగ్‌లో సొంత అభిమానుల సమక్షంలో పసిడి సాధించిన అతను 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ కనకాన్ని సొంతం చేసుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం కూడా అసాధారణ రికార్డే! మొత్తంగా అంతర్జాతీయ పోటీల్లో 666 విజయాలు, 66 టైటిల్స్ లిన్ డాన్ దిగ్గజ హోదాకు చిరునామాగా నిలిచాయి. సుదీర్ఘకాలం సత్తా చాటుతూ.. అద్భుతమైన ఫిట్నెస్, పదునైన ఆటతో సుదీర్ఘ కాలం పాటు డాన్ బ్యాడ్మింటన్‌ను శాసించగలిగాడు. సరిగ్గా చెప్పాలంటే వేర్వేరు దశకాల్లో అతను భిన్నమైన ప్రత్యర్థులతో తలపడుతూ అన్ని సమయాల్లోనూ తనదైన ముద్ర చూపించాడు. ఉదాహరణకు డాన్‌ను ఎదుర్కొన్న భారత షట్లర్లను చూస్తే అతని ఆట ఏమిటో అర్థమవుతుంది. తన 17 ఏళ్ల వయసులో 2001లో అతను పుల్లెల గోపీచంద్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. తన కెరీర్ అత్యుత్తమంగా సాగుతున్న 2000 మధ్యకాలంలో అనూప్ శ్రీధర్, అరవింద్ భట్‌లాంటి వారితో తలపడ్డాడు. ఆ దశాబ్దం చివర్లో పారుపల్లి కశ్యప్నూ ఓడించాడు. 2010 దాటాక భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్లను డాన్ ఎదుర్కొన్నాడు. ఇక 2018కి వచ్చేసరికి భారత యువ ఆటగాడు లక్ష్య సేన్తోనూ కోర్టులో పోటీ పడ్డాడు. అటాకింగ్‌కి మారు పేరుగా డాన్ తన ప్రత్యర్థులపై చెలరేగాడు. పదిసార్లు షటిల్ గాల్లోకి లేస్తే తొమ్మిదిసార్లు డాన్ జంప్ చేసి స్మాష్ కొట్టడం సహజం. అదే అతని శైలి అంటూ మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ కితాబు ఇచ్చాడు. బాడ్మింటన్‌లో లిన్ డాన్ అత్యుత్తమ ఆటగాడు అన్నది మరో మాటకు తావులేని స్టేట్మెంట్! టెన్నిస్లోనైనా కొన్నిసార్లు కొందరు ఆటగాళ్ల గురించి చర్చ సాగుతుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదు అని అరవింద్ భట్ చెప్పాడు. సంగీతం నుంచి షటిల్ వరకు.. చిన్నతనంలో పియానో బాగా వాయించడం చూసి తల్లిదండ్రులు డాన్‌ను సంగీతంలోనే కొనసాగమని ప్రోత్సహించారు. అయితే అతను మాత్రం దానిని సరదాకే పరిమితం చేసి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టాడు. అతనిలోని సహజ ప్రతిభ ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే దూసుకుపోయేలా చేసింది. చైనా ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆర్మీ స్పోర్ట్స్ టీమ్ దృష్టి డాన్‌పై పడిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తన రాకను ఘనంగా చాటిన డాన్ ఆ తర్వాత అదే జోరుతో అద్భుతాలు చేశాడు. వరుస విజయాలతో 21 ఏళ్లకే తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. చిరకాల ప్రత్యర్థితో.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ఆసక్తికరమైన, సమ ఉజ్జీల సమరాలు అంటే.. లిన్ డాన్ – లీ చోంగ్ వీ (మలేసియా) మధ్య జరిగిన మ్యాచ్‌ల గురించే చెప్పాలి. ఒక తరం పాటు వీరిద్దరి మధ్య సాగిన పోటీ షటిల్ అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఈ ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ మ్యాచ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పోలిస్తే లీ చోంగ్ వీ అత్యధిక అంతర్జాతీయ విజయాలు (732), అత్యధిక వారాలు వరల్డ్ నంబర్‌వన్ (348) ఘనత సాధించాడు. ప్రతిభ, సాంకేతికపరంగా చూస్తే డాన్ కంటే చోంగ్ వీ ఎంతో ముందుంటాడు. కానీ కోర్టులోకి దిగేసరికి మాత్రం డాన్ ఒక్కసారిగా పూనకం వచ్చినవాడిలా మారిపోతాడు అనేది పుల్లెల గోపీచంద్ అభిప్రాయం. నిజంగానే ఓవరాల్ రికార్డు అలాగే ఉంది. వీరిద్దరూ 40 సార్లు తలపడగా లిన్ డాన్ 28–12తో ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే ఈ అంకెలు చూస్తే అంతా ఏకపక్షంగా కనిపించినా.. వాస్తవం అది కాదు. ఒక్కో పాయింట్ కోసం, సుదీర్ఘ ర్యాలీలతో వీరిద్దరూ పోరాడిన తీరు ఆయా మ్యాచ్‌లను అద్భుతాలుగా నిలిపాయి. వీరిద్దరి మధ్య జరిగిన 2012 ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. మరో చర్చ లేకుండా లిన్ డాన్ మాత్రమే బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు అంటూ లీ చోంగ్ వీ చేసిన ప్రశంస డాన్ ప్రతిభకు అందిన సర్టిఫికెట్‌గా చెప్పొచ్చు. ఈ ఏడాది మే నెలలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తమ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఒకేసారి ఈ ఇద్దరు స్టార్లను చేర్చడం విశేషం. కోర్టులోనే ప్రేమ.. బ్యాడ్మింటన్‌లో సహచర క్రీడాకారిణి గ్జి గ్జింగ్ఫాంగ్తో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం డాన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గ్జింగ్ఫాంగ్ కూడా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. మాడ్రిడ్‌లో జరిగిన 2006 వరల్డ్ చాంపియన్‌షిప్ సింగిల్స్ పురుషుల, మహిళల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచాక ప్రేమబంధం మరింత బలపడింది. ఆటలో ఏ స్థాయికి ఎదిగినా చదువులో కూడా డాన్ చురుగ్గా ఉండేవాడు. కెరీర్లో ఉచ్ఛ దశలో ఉన్న సమయంలోనే అతను హువాఖియో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తద్వారా ఆటగాడిగా ఉంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి చైనా ప్లేయర్‌గా నిలిచాడు. 2012లో రెండోసారి ఒలింపిక్స్ పతకం గెలిచాక లిన్ డాన్ బయోగ్రఫీ వచ్చింది. ‘అన్టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ పేరుతో వచ్చిన ఈ పుస్తకం ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచి అత్యంత ఆదరణ పొందింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: భారత మహిళలకు చేజారిన విజయం టైటిల్‌కు అడుగు దూరంలో... -
లిన్ డాన్ గుడ్‌బై
బీజింగ్: రెండు దశాబ్దాలు బ్యాడ్మింటన్‌ను ఏలిన చైనా విఖ్యాత షట్లర్ లిన్ డాన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. శనివారం తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రత్యర్థులకే కాదు... బ్యాడ్మింటన్‌కే ‘సూపర్ డాన్’గా చిరపరిచితుడైన లిన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘2000 నుంచి 2020 వరకు ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగిన నేను జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడం నాకు చాలా క్లిష్టమైనా తప్పలేదు. నాకు ఇప్పుడు 37 ఏళ్లు. నా శారీరక సామర్థ్యం. గాయాలతో ఒకప్పటిలా నేను మా జట్టు సహచరులతో కలిసి పోరాడలేను. ఆటపై కృతజ్ఞత ఉంది. పైబడిన వయసుతో ఇబ్బంది ఉంది. అందుకే ఇక కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నా. జీవితంలో నాకిది కొత్త పోటీ’ అని వెటరన్ లిన్ డాన్ చైనా సోషల్ మీడియా యాప్ ‘వైబో’లో పోస్ట్ చేశాడు. ఆటనే ప్రేమించిన తను అంకితభావంతో నాలుగు ఒలింపిక్స్ ఆడానని చెప్పాడు. ఇన్నేళ్లుగా బ్యాడ్మింటనే లోకమైన తాను ఇలా రిటైర్మెంట్ చెబుతానని ఎప్పుడు అనుకోలేదని అన్నాడు. ర్యాంకింగ్ కంటే ఎక్కువగా ఆడటంపైనే దృష్టిపెట్టిన తనకు శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు తెలిపాడు. ‘ఆటలో నన్ను ఉత్సాహంగా పోటీపడేలా స్ఫూర్తి పెంచిన నా మేటి ప్రత్యర్థులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని లిన్ డాన్ తనకెదురైన పోటీదారులను గౌరవించాడు. మేరునగధీరుడు... 666 మ్యాచ్‌లలో విజయాలు... 66 టైటిల్స్...ఇదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో డాన్ సాధించిన ఘనత. గ్లోబ్‌లోని దేశాలన్నీ చుడుతూ అతను టైటిళ్లన్నీ పట్టేశాడంటే అతిశయోక్తి కాదు. చైనీస్ సూపర్‌స్టార్ కచ్చితంగా చాంపియనే. ఏళ్ల తరబడి... దశాబ్దాలు తలపడి ఎవరికీ అనితర సాధ్యమైన టైటిళ్లన్నీ అతనొక్కడే సాధించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్. ఐదు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్. మరో ఐదుసార్లు ఆసియా గేమ్స్ విజేత. ఇంకో ఐదు సుదిర్మన్ కప్ విజయాలు. థామస్ కప్‌లో అరడజను బంగారు పతకాలు. 4 ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణాలు. 2 ప్రపంచకప్ విజయాలు. ఈ వేటలో రన్నరప్ రజతాలు, కాంస్యాలు చెప్పుకుంటూ పోతే డాన్ పతకాల జాబితా చాంతాడంత ఉంది. 2004లోనే వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు అన్ని గెలుస్తూపోతూ 28 ఏళ్లకే ‘సూపర్ గ్రాండ్ స్లామ్’ సాధించాడు. అంటే బ్యాడ్మింటన్ చరిత్రలో ఉన్న 9 మేజర్ టైటిళ్లను సాధించిన ఏకైక షట్లర్‌గా చరిత్రకెక్కాడు. ఒలింపిక్ చాంపియన్‌షిప్ (2008, 2012) నిలబెట్టుకున్న తొలి, ఒకేఒక్క బ్యాడ్మింటన్ ఆటగాడు కూడా లిన్ డానే! 2004లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇతని దెబ్బకు తలవంచిన పీటర్ గేడ్... చైనీస్ ఆటగాడిని ఉద్దేశిస్తూ ‘సూపర్ డాన్’గా కితాబిచ్చాడు. తర్వాత్తర్వాత అదే పేరు స్థిరపడిపోయేలా తన రాకెట్‌తో బ్యాడ్మింటన్ లోకాన్నే రఫ్ఫాడించాడు. 2002లో తన తొలి టైటిల్ సాధించినప్పటినుంచి ప్రతీ సంవత్సరం అతను కనీసం ఒక్క టోర్నీలోనైనా విజయం సాధించడం విశేషం. బ్యాడ్మింటన్‌లో దిగ్గజ చతుష్టయంగా గుర్తింపు తెచ్చుకున్న నలుగురిలో చివరగా డాన్ రిటైరయ్యాడు. మిగతా ముగ్గురు లీ చోంగ్ వీ, తౌఫీక్ హిదాయత్, పీటర్ గేడ్‌లతో పోలిస్తే సాధించిన ఘనతల ప్రకారం లిన్ డాన్ అందరికంటే గ్రేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ దిగ్గజం
బీజింగ్ : చైనా బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ 36 ఏళ్ల లిన్ డాన్ ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు శనివారం ప్రకటించాడు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాడిగా లిన్ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించాడు. 'కెరీర్లో కష్టతరమైన సమయంలో ఉన్నప్పుడు నా కుటుంబం జహా కోచ్‌లు, జట్టు సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. ఇప్పుడు నా వయస్సు 37 ఏళ్లు కావడంతో ఫిజికల్ ఫిట్నెస్ను కాపాడుకోవడం కష్టమవుతుంది. జట్టు తరపున ఇతర ఆటగాళ్లతో కలిసి ఆడలేను.. అందుకే రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో దేశం తరపున ఆడాలని మొదట్లో భావించా.. కానీ ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలను వాయిదా వేయడంతో నా కల చెదిరిపోయింది. ఇన్ని రోజులు నన్ను అభిమానించిన వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు' అంటూ ట్విటర్లో లిన్ డాన్ చెప్పుకొచ్చాడు. (యూనిస్ జోక్ చేస్తే.. సీరియస్ వ్యాఖ్యలా?) డబుల్ ఒలింపిక్ స్వర్ణాలతో పాటు లిన్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చాలా కాలం ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ గా నిలిచిన లిన్ డాన్‌కు సూపర్ డాన్ గా పేరుంది. తన ప్రత్యర్థి అయిన మలేషియా స్టార్, స్నేహితుడు లీ చోంగ్ వీ రిటైర్ అయిన ఏడాది తర్వాత లిన్ తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. లీ చోంగ్ వీ, లిన్ డాన్ లు దశాబ్దానికి పైగా బాడ్మింటన్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక వెలుగు వెలిగారు. కాగా లిన్ డాన్ 666 సింగిల్స్ లలో విజయాలు సాధించాడు.(2011 ఫిక్సింగ్ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక) -
శభాష్ సాయిప్రణీత్
ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్య పతకం గాలివాటంగా వచ్చినది కాదని తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ నిరూపించాడు. తనదైన రోజున ఎంతటి మేటి క్రీడాకారులనైనా బోల్తా కొట్టిస్తానని ఈ హైదరాబాద్ ప్లేయర్ మరోసారి రుజువు చేశాడు. మంగళవారం ఆరంభమైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సాయిప్రణీత్ తొలి రౌండ్లో పెను సంచలనం సృష్టించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన చైనా దిగ్గజం లిన్ డాన్‌ను వరుస గేముల్లో ఓడించి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది లోటుగా ఉన్న వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో... డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సాయిప్రణీత్ 36 నిమిషాల్లో 21–14, 21–17తోప్రపంచ 18వ ర్యాంకర్, మాజీ నంబర్‌వన్, 36 ఏళ్ల లిన్ డాన్ (చైనా)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 38 నిమిషాల్లో 22–20, 21–18తో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడనుండగా... ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో సాయిప్రణీత్ తలపడతాడు. గతంలో లిన్ డాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సాయిప్రణీత్ ఈసారి మాత్రం అదరగొట్టాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ, నిలకడగా పాయింట్లు సాధించాడు. మొదట్లో 3–0తో ఆధిక్యం సంపాదించిన సాయిప్రణీత్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కొనసాగించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. 16–16తో స్కోరు సమంగా ఉన్నదశలో సాయిప్రణీత్ రెండు పాయింట్లు సాధించి 18–16తో ముందంజ వేశాడు. ఆ తర్వాత లిన్ డాన్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చైనా స్టార్ ప్లేయర్ ఓటమిని ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 13–21, 12–21తో సితికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో... సౌరభ్ వర్మ 21–19, 11–21, 17–21తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 24–22, 21–11తో కిమ్ జి జంగ్–లీ యోంగ్ డే (దక్షిణ కొరియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 23–25, 18–21తో టాప్ సీడ్ మాయు మత్సుమోతో–వకానా నాగాహార (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; కాంటా సునెయామ (జపాన్)తో సమీర్ వర్మ; మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సయాక తకహాషి (జపాన్)తో సైనా నెహా్వల్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మార్విన్ సిడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా)లతో సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప పోటీపడతారు. ►1 ప్రపంచ మాజీ చాంపియన్స్ లేదా ఒలింపిక్ మెడలిస్ట్లైన ఆరుగురు ఆటగాళ్లను (తౌఫిక్ హిదాయత్–ఇండోనేసియా; లీ చోంగ్ వీ–మలేసియా; చెన్ లాంగ్–చైనా; విక్టర్ అక్సెల్సన్–డెన్మార్క్; కెంటో మొమోటా–జపాన్; లిన్ డాన్–చైనా) కనీసం ఒక్కసారైనా ఓడించిన ఏకైక భారత క్రీడాకారుడు సాయిప్రణీత్. ►4 చైనా దిగ్గజం లిన్ డాన్‌ను కనీసం ఒక్కసారి ఓడించిన నాలుగో భారత ప్లేయర్ సాయిప్రణీత్. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ మూడుసార్లు లిన్ డాన్‌పై నెగ్గగా... పుల్లెల గోపీచంద్ రెండుసార్లు (2002లో) ఓడించగా... శ్రీకాంత్ (2014లో) ఒక్కసారి గెలిచాడు. -
ప్రణయ్ ప్రతాపం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అన్ని గొప్ప టోర్నమెంట్లలో టైటిల్స్ సాధించి దిగ్గజ క్రీడాకారుడి హోదా పొందిన చైనా సూపర్ స్టార్ ప్లేయర్ లిన్ డాన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచి, రెండుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించి ఎందరో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఆరాధ్యుడిగా మారిన లిన్ డాన్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ షాక్ ఇచ్చాడు. హోరాహోరీ పోరులో లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్ ఈ క్రమంలో మూడుసార్లు చైనా స్టార్‌ను ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్‌కు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుంది. బాసెల్ (స్విట్జర్లాండ్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్నా... జాతీయ క్రీడా పురస్కారాల్లో హెచ్ఎస్ ప్రణయ్‌కు ఈసారీ మొండిచేయి లభించడంతో ఆ కసినంతా అతను ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శనలో చూపిస్తున్నాడు. తొలి రౌండ్లో తనకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్‌ను ఓడించడానికి ఇబ్బంది పడ్డ ఈ కేరళ ఆటగాడు... రెండో రౌండ్లో మాత్రం జూలు విదిల్చాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 21–11, 13–21, 21–7తో గెలుపొంది సంచలనం సృష్టించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లిన్ డాన్‌తో ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డ ప్రణయ్ ముఖాముఖి రికార్డులో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు 2015 ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 ఇండోనేసియా ఓపెన్‌లో లిన్ డాన్‌పై ప్రణయ్ గెలిచాడు. తద్వారా లిన్ డాన్‌ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో లిన్ డాన్‌పై పుల్లెల గోపీచంద్ రెండుసార్లు... ప్రస్తుత భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఒకసారి గెలిచారు. 62 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ ఆద్యంతం దూకుడుగా ఆడాడు. లిన్ డాన్ స్థాయిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడిన ప్రణయ్ తొలి గేమ్‌లో 10–5, 19–11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్... నిర్ణాయక మూడో గేమ్‌లో రెచ్చిపోయాడు. స్కోరు 6–5తో ఉన్నదశలో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14–5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత చైనా ప్లేయర్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. టోర్నీ తొలి రోజు సోమవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్, భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో లో కీన్ యెయి (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో సుమీత్–మనూ జంట డబుల్స్ విభాగంలోభారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటకు చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ తున్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి వాకోవర్ లభించింది. దండు పూజ–సంజన ద్వయం 15–21, 14–21తో సు యా చింగ్–హు లింగ్ ఫాంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి 21–13, 21–13తో థామ్ గికెల్–రోనన్ లేబర్ (ఫ్రాన్స్)లపై... ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 21–14, 21–16తో తొబియాస్ కుయెంజి–ఒలివర్ షాలెర్ (స్విట్జర్లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా 18–21, 11–21తో టకుటో ఇనుయు–యుకీ కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు. లిన్ డాన్‌తో తొలి గేమ్‌లో, చివరి గేమ్‌లో బాగా ఆడాను. అయితే రెండో గేమ్‌లో నా వ్యూహం బోల్తా కొట్టింది. దీంతో కోచ్‌ల సలహాలతో కీలకదశలో నా ఆటతీరు మార్చుకొని మంచి ఫలితం సాధించాను. సంయమనం కోల్పోకుండా సుదీర్ఘ సమయం ఆడాను. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటాతో తలపడనున్నాను. ఈ మ్యాచ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను. –ప్రణయ్ -
లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్
బసెల్(స్విట్జర్లాండ్): భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ రెండో రౌండ్లో ఐదుసార్లు విశ్వవిజేత, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్(చైనా)ను ఇంటిబాట పట్టించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ 21–11, 13–21, 21–7తో లిన్ డాన్‌ను చిత్తుచేశాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ప్రణయ్ తొలి సెట్ ఆరంభం లోనే 6–2తో ఆధిక్యంలో దూసుకెళ్లాడు. ఇదే ఊపులో 21–11తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే, రెండో సెట్లో లిన్ తన అసలైన ఆటతీరు ప్రదర్శించాడు. 5–5 వద్ద ప్రణయ్‌ని నిలువరించాడు. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లి 18–13 వద్ద వరుసగా మూడు పాయింట్లు సాధించి సెట్‌ను దక్కించు కున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రణయ్ తిరుగులేని ఆట ప్రదర్శించాడు. 21–7తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ గెలుచుకు న్నాడు. తర్వాతి రౌండ్లో వరల్డ్ నెం.1 కెంటో మొమోటా(జపాన్)తో ప్రణయ్ తలపడతాడు. కాగా, మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ క్యూన్(కొరియా)పై నెగ్గగా, 14వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో ప్రపంచ 34వ ర్యాంకర్ లొహ్ ఈ కియాన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
లిన్ డాన్ రెండేళ్ల తర్వాత...
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ దిగ్గజం, ఐదు సార్లు ప్రపంచ చాంపియన్, రెండు సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ 35 ఏళ్ల వయసులోనూ తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. గత రెండేళ్లుగా అనామక ఆటగాళ్ల చేతుల్లో వరుస పరాజయాలతో దాదాపు నిష్క్రమించినట్లుగా కనిపించిన అతను మరో పెద్ద విజయంతో సత్తా చాటాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ మలేసియా ఓపెన్‌లో డాన్ విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో డాన్ తన జూనియర్ చెన్ లాంగ్ (చైనా)పై 9–21, 21–7, 21–11 స్కోరుతో విజయం సాధించాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మలేసియా ఓపెన్ (అప్పట్లో సూపర్ సిరీస్ ప్రీమియర్)ను గెలుచుకున్న అనంతరం డాన్ మరో టైటిల్ సాధించలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ అదే టోర్నీతో అతను తన విలువను ప్రదర్శించాడు. డాన్ చిరకాల ప్రత్యర్థి, ప్రస్తుతం క్యాన్సర్‌నుంచి చికిత్స పొందుతూ ఆటకు దూరంగా ఉన్న లీ చోంగ్ వీ (మలేసియా) విజేతకు బహుమతి అందజేయడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (తైపీ) వరుసగా మూడో సారి గెలుచుకుంది. ఫైనల్లో తై జు 21–16, 21–19తో అకానె యామగుచి (జపాన్)ను ఓడించింది. డబుల్స్ ఈవెంట్లన్నీ చైనా షట్లర్లే గెలుచుకున్నారు. పురుషుల డబుల్స్‌లో లి జున్ హు–లి యుచెన్ (చైనా), మహిళల డబుల్స్‌లో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ (చైనా), మిక్స్డ్ డబుల్స్‌లో జెంగ్ సివే– హువాంగ్ (చైనా) జోడీలు విజేతలుగా నిలిచాయి. -
లిన్ డాన్‌కు ప్రణయ్ షాక్
జకార్తా: భారత షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ తన కెరీర్లో మరో అపూర్వ విజయాన్ని సాధించాడు. ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌ను కంగుతినిపించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్‌తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 21–15–9–21, 21–14తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. లిన్ డాన్‌పై ప్రణయ్‌కిది రెండో విజయం. 2015 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ప్రణయ్ తొలి రౌండ్లోనే లిన్ డాన్‌ను ఓడించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ ల్లో సమీర్ వర్మ 21–19, 12–21, 22–20తో రస్ముస్ గెమ్కె (డెన్మార్క్)పై నెగ్గగా... సాయిప్రణీత్ 10–21, 13–21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ 21–12, 21–12తో దినర్ ద్యా అయుస్టిన్ (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా జోడీ 11–21, 18–21తో అగత ఇమానుయెలా–సిటి ఫదియాసిల్వ (ఇండోనేసియా) జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 8–21, 15–21తో హిరొయుకి–యుత వతనబె (జపాన్) జంట చేతిలో ఓడిపోయాయి. -
హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 తేడాతో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ లిన్‌డాన్(చైనా)కు షాకిచ్చాడు. 59 నిమిషాల పోరులో ప్రణయ్ ఆద్యంత ఆకట్టుకుని తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. మొదటి గేమ్‌ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ సత్తాచాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది లిన్డాప్పై ప్రణయ్‌కు రెండో విజయం. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ మూడుసార్లు తలపడితే రెండు సందర్భాలో ప్రణయ్‌నే విజయం వరించింది. ప్రణయ్ రెండో రౌండ్లో వాంగ్ జు వియ్(చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు. -
భార్యను మోసం చేశాను.. సారీ!
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను మోసం చేశానని చైనా బాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ అంగీకరించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే లిన్ డాన్ భార్య తమ తొలిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ‘మిస్టరీ మహిళ’తో లిన్ డాన్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. ‘డిటెక్టివ్ ఝావో’ అనే నెటిజన్ ఆన్లైన్లో పోస్టుచేసిన ఈ ఫొటోలు లిన్ డాన్ అభిమానుల్ని షాక్‌కు గురిచేశాయి. లిన్‌తో తిరిగిన సదరు మహిళ ప్రముఖ మోడల్, నటి ఝావో యాకిగా తేలింది. గత సెప్టెంబర్ నెలలో ఓ రెస్టారెంట్ వద్ద లిన్, యాకీ సన్నిహితంగా తిరుగుతుంటే తాను గమనించి.. వారిని అనుసరించానని, లిన్ యాకీని తన ఇంటికి తీసుకెళ్లాడని, రెండుగంటలు గడిపిన అనంతరం వారు బయటకు వచ్చారని, ఆ తర్వాత ఒక హోటల్లోను వారు రాసలీలలు నెరిపారని డిటెక్టివ్ ఝావో పేర్కొన్నాడు. లిన్ భార్య గ్జీ జింగ్ఫంగ్ కూడా బ్యాడ్మింటన్ చాంపియన్. ఆమె ఈ నెల 5న బిడ్డను ప్రసవించింది. ఈ క్రమంలోనే లిన్, యాకీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగుచూడటంతో చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో అతనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.దీంతో లిన్ డాన్ స్పందిస్తూ ‘ ఒక వ్యక్తిగా నా తప్పులకు సాకులు వెతుక్కోను. నా ప్రవర్తన కుటుంబాన్ని గాయపరిచింది. అందుకే నా కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా’అని ఆయన ‘వీబో’లో బదులిచ్చారు. 33 ఏళ్ల లిన్ డాన్ ఐదుసార్లు బ్యాడ్మింటన్ ప్రపంచ చాపింయన్గా నిలిచాడు. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన అతను ఇటీవలి రియో ఒలింపిక్స్ లో మాత్రం పతకం సాధించలేకపోయాడు. -
పోరాడి ఓడాడు
పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. చైనా దిగ్గజం లిన్ డాన్‌తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21తో పోరాడి ఓడిపోయాడు. ‘హ్యాట్రిక్’ స్వర్ణంపై గురి పెట్టిన లిన్ డాన్ తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. శ్రీకాంత్ షటిల్‌ను పలుమార్లు నెట్‌కు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకున్నాడు. నమ్మశక్యంకానిరీతిలో ఆడుతూ లిన్ డాన్‌ను ముప్పుతిప్పలు పెట్టి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో ఆధిక్యంలోకి వెళ్లినా లిన్‌డాన్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని సాధించి ఊపిరి పీల్చుకున్నాడు. -
శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
-
శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
రియోలో మరో భారత ఆశాకిరణం పోరాటం ముగిసింది. ఒలింపిక్ పతకం సాధించాలన్న భారత యువ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. పోరాటపటిమ ప్రదర్శించినా చైనా అడ్డుగోడను దాటడంలో విఫలమయ్యాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 స్కోరుతో చైనా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. దీంతో భారత అభిమానులకు మరోసారి నిరాశతప్పలేదు. శ్రీకాంత్ పతకం వేటలో విఫలమైనా, తన ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తొలి గేమ్‌లో ఆద్యంతం లిన్ డాన్‌దే ఆధిక్యం. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్‌లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో లిన్ డాన్ 21-6తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా రెండో గేమ్‌లో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకుని పోరాటపటిమ ప్రదర్శించాడు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ లిన్ డాన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. రెండో గేమ్ ఆరంభం నుంచే శ్రీకాంత్ దూసుకెళ్తూ ప్రత్యర్థికి ఎక్కడా దొరకలేదు. తెలుగుతేజం రెండో గేమ్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌ను 1-1తో సమం చేసి విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్ తొలి రెండు గేమ్‌లకు భిన్నంగా ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. శ్రీకాంత్, లిన్ డాన్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఆరంభంలో లిన్ డాన్ ముందంజలో ఉన్నా, శ్రీకాంత్ వెంటనే పుంజుకుని నిలువరించాడు. కాగా ఈ గేమ్ ఓ దశలో 13-13, 14-14 స్కోర్లతో సమమైంది. ఆ తర్వాత లిన్ 16-14, 19-16తో ముందంజ వేయడంతో భారత అభిమానుల్లో ఉత్కంఠ తీవ్రమైంది. చివర్లో శ్రీకాంత్ వెనుకబడగా, లిన్ అదే జోరు సాగిస్తూ 21-18తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
ఈ భారీ అడ్డు 'గోడ'ను శ్రీకాంత్ దాటుతాడా?
కిదంబి శ్రీకాంత్ ముందు ఇప్పుడో ఓ భారీ సవాల్ ఉంది. రియో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించాలంటే అతను.. చైనా ప్రత్యర్థి లిన్ డాన్‌ను ఓడించాలి. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించి.. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న లిన్ డాన్ ఓడించడమంటే మాటలు కాదు. శ్రీకాంత్ ఇప్పటివరకు మూడుసార్లు లిన్ డాన్‌తో తలపడ్డాడు. రెండుసార్లు ఓడిపోయాడు. కానీ, ఒక్కసారి గెలిచాడు. అది మామూలుగా కాదు లిన్ డాన్‌ను అతని సొంత గడ్డపై.. 2014లో చైనా ఓపెన్ సీరిస్ ఫైనల్లో చిత్తు చేశాడు. చైనా బ్యాడ్మింటన్ స్టాన్ లిన్ డాన్ అంటే ప్రత్యర్థులు హడలిపోతారు. ఒలింపిక్స్‌లో అతను ఎప్పుడూ ఓడిపోలేదు. సొంత గడ్డపై కూడా పరాజయం రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదని చెప్తారు. కానీ, సొంత గడ్డపైనే లిన్ డాన్‌కు ఓటమిని రుచి చూపించాడు శ్రీకాంత్. పక్కా ఫామ్‌తో ఒలింపిక్స్ బరిలోకి దిగాడు డాన్. 32 ఏళ్ల వయస్సున్న ఈ ఆటగాడికి ఇది చివరి ఒలింపిక్స్ అయ్యే అవకాశముంది. కాబట్టి రియోలో అతన్ని ఓడించడం అంటే మాటలు కాదు. కానీ, 23 ఏళ్ల మన శ్రీకాంత్ అతన్ని చూసి బెదిరిపోవడం లేదు. సొంతగడ్డపై అతన్ని ఓడించలేమన్న అభిప్రాయాన్ని తుత్తునియలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు ఒలింపిక్ వేదికపైనా అతనికి పరాజయాన్ని రుచి చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇందుకోసం నెట్లో చెమటలు కక్కేలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నానని చెప్పిన శ్రీకాంత్.. అతన్ని ఓడించడం అంత సులువు కాదు.. ఇందుకు చివరివరకు పోరాడాల్సి ఉంటుందనే విషయాన్ని పదేపదే మననం చేసుకుంటున్నానని తెలిపాడు. 'నేను అతన్ని ఓడించగలనన్న ధీమా నాకుంది. నేను అతి ఆత్మవిశ్వాసంతో ఏమీ లేను కానీ, నాకూ అవకాశాలు ఉన్నాయి' అని శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. 'ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు బాగా ఆడటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతేకాకుండా అతని కోసం మేం ఓ వ్యూహాన్ని సిద్ధం చేశాం' అని శ్రీకాంత్ తెలిపాడు. -
లిన్ డాన్ ‘సిక్సర్’
ఆరోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సొంతం బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చైనా సూపర్‌స్టార్ లిన్ డాన్ మరోసారి సత్తా చాటుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లిన్ డాన్ 21-9, 21-10తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం లిన్ డాన్కిది ఆరోసారి కావడం విశేషం. గతంలో లిన్ డాన్ 2004, 2006, 2007, 2009, 2012లలో టైటిల్ సాధించాడు.