న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రెండో స్థానాన్ని నిలుపుకుంది. దుబాయ్‌లో గత వారం జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తాను ఆడిన అన్ని గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఓడడం శ్రీకాంత్ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. పారుపల్లి కశ్యప్ కూడా 14 నుంచి 15వ స్థానానికి వచ్చాడు. ప్రణయ్ (20) ర్యాంకులో మార్పు లేదు. అజయ్ జయరాం 23 నుంచి 22కు వచ్చాడు. మహిళల ర్యాకింగ్స్‌లో పీవీ సింధు 12వ ర్యాంకులోనే ఉండగా డబుల్స్‌లో జ్వాల, అశ్విని జోడి 13వ స్థానాన్ని నిలుపుకున్నారు.
తొమ్మిదో ర్యాంక్‌కి శ్రీకాంత్
Published Thu, Dec 17 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement
Advertisement