భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి.
కౌలాలంపూర్: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం సంపాదించి ఆరో ర్యాంక్ సొంతం చేసుకుంది.
ఇక కశ్యప్, శ్రీకాంత్ ఏడేసి స్థానాలు మెరుగుపరచుకుని వరసగా 21, 16 ర్యాంక్లు కైవసం చేసుకున్నారు. వర్ధమాన షట్లర్ పీవీ సింధు పదో ర్యాంక్ను నిలబెట్టుకుంది.