సైనా కోసం బీ టౌన్ ప్రముఖులు | B-Town wishes Saina speedy recovery | Sakshi
Sakshi News home page

సైనా కోసం బీటౌన్ ప్రముఖులు

Published Sat, Aug 20 2016 4:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

సైనా కోసం  బీ టౌన్ ప్రముఖులు

సైనా కోసం బీ టౌన్ ప్రముఖులు

ముంబై: లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ (26) ఆరోగ్య  పరిస్థితిపై  బాలీవుడ్  ప్రముఖులు స్పందించారు.  భారత స్టార్ షట్లర్ సైనా మోకాలి  శస్త్రచికిత్స తర్వాత తొందరగా కోలుకోవాలనే అభిలాషను  సోషల్ మీడియా ద్వారా   వ్యక్తం చేశారు.

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , దర్శకుడు కరణ్ జోహార్  హీరో రితేష్ దేశ్ ముఖ్, హీరోయిన్ సోనాక్షి సిన్హా, దియా మీర్జా. గాయని శుభా ముద్గల్  తదితరులు ట్విట్టర్ ద్వారా తమ సందేశాలను షేర్ చేశారు.   ఆపరేషన్  తర్వాత త్వరగా కోలుకొని మళ్లీ మునుపటిలా కోర్టులో  ఛాంపియన్ లా వెలిగిపోవాలని ప్రార్థించారు. అంతా మంచే జరుగుతుందనీ, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సైనా స్పీడీ రికవరీ కోసం  ప్రార్థిస్తున్నామంటూ ఛాంపియన్ పట్ల తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. అటు సైనా  నెహ్వాల్ కూడా రేపు(శనివారం) తనకు ఆపరేషన్ నిర్వహించనున్నారనీ,  తనకోసం ప్రార్థించమంటూ ట్విట్ చేశారు. దీంతో పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయవేత్తలు సహా సుష్మా కూడా  ట్వీట్ చేశారు.  అలాగే ఆపరేషన్ తనకు విషెస్ తెలిపిన అందరికీ సైనా ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఫోటోలను సైనా ట్విట్టర్  పంచుకున్నారు.  

కాగా  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో హైదరాబాదీ సైనా మొదటి రౌండ్ తర్వాత రియో ​​ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. హైదరాబాద్ తరలించారు. శస్త్రచికిత్స నిమిత్తం ఆమెను ముంబైకి తరలించారు.  వైద్యులు ఆమెకు ఈ ఉదయం (శనివారం) ఆపరేషన్ నిర్వహించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement