speedy recovery
-
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్‌కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్‌ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్‌కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్‌కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్‌పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
సచిన్ నీకు ప్రత్యర్థి ఏంటి.. అక్తర్ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం
ముంబై: ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌లో పాల్గొన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతనితో పాటు భారత లెజెండ్స్ సభ్యులు బద్రీనాథ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్లకు కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరందరూ ప్రస్తుతం హోం క్వారెంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ త్వరగా కోలువాలంటూ పాక్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. మైదానంలో తన ఫేవరేట్ ప్రత్యర్థి అయిన సచిన్ త్వరగా కోలుకోవాలని అక్తర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే అక్తర్.. సచిన్ తనకు ప్రత్యర్థి అంటూ ట్వీట్ చేయడం పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. One of my favorite rivalries on the ground. Get well soon buddy @sachin_rt pic.twitter.com/mAleuepcwM — Shoaib Akhtar (@shoaib100mph) March 30, 2021 Shoaib bhai, U were just fast and never considered you as his rivalry. He had played and smashed more legendary bowlers like Ambrose , McGrath, Wasim , Waqar, Vaas, Donald , Steyn Caddick Lee and many more . U were just another bowler nothing more.. — A₹pit🇮🇳 (@tweet2api) March 31, 2021 నువ్వు సాధారణ ఫాస్ట్ బౌలర్‌వి మాత్రమే, ఎంతో మంది మేటి బౌలర్లను సచిన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడని ఓ నెటిజన్ అక్తర్‌ను ట్రోల్ చేయగా.. వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఆంబ్రోస్, మెక్‌గ్రాత్, అలెన్ డొనాల్డ్ లాంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లకే సచిన్ చుక్కలు చూపించాడని మరో అభిమాని పేర్కొన్నాడు. సచిన్ నీకు ప్రత్యర్థి ఏంటి.. వకార్, అక్రమ్ లాంటి దిగ్గజాలు ఆమాటంటే ఓ అర్ధముందంటూ మరో అభిమాని అక్తర్‌ను ట్రోల్ చేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్రమ్, వకార్‌లతోపాటు సచిన్.. నీకు కూడా చుక్కలు చూపించిన విషయాన్ని మర్చిపోయావా అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అక్తర్‌పై విరుచుకుపడ్డారు. కాగా, మార్చి 27న తనకు కరోనా సంక్రమించినట్లు సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కలకలం.. 30 మంది అథ్లెట్లకు పాజిటివ్ -
త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తన మిత్రుడు, ఆయన భార్య త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ట్రంప్, మెలానియా ట్రంప్ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటానన్నారు. ట్రంప్ ఉన్నత సలహాదారు హోప్ హిక్స్ కు తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ట్రంప్ , మెలానియా ట్రంప్ కు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తాను మెలానియా క్వారంటైన్ లో ఉంటూ తక్షణమే చికిత్స ప్రారంభిస్తామని ట్రంప్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. (కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) కాగా అటు ముంచుకొస్తున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికలు తరుణంలో ట్రంప్ వైరస్ బారిన పడటంతో రిపబ్లికన్ పార్టీ ఆందోళన పడిపోయింది. ప్రధాన ప్రత్యర్థి బైడెన్ ప్రచారంలో దూసుకుపోతూ, సవాలు విసురుతోంటే.. ట్రంప్ మహమ్మారి సోకి క్వారంటైన్ నిబంధనలకు పరిమితం కావడం భారీ ప్రభావాన్ని చూపనుందని భావిస్తున్నాయి. (ట్రంప్‌కు కరోనా : కుప్పకూలిన మార్కెట్లు) Wishing my friend @POTUS @realDonaldTrump and @FLOTUS a quick recovery and good health. https://t.co/f3AOOHLpaQ — Narendra Modi (@narendramodi) October 2, 2020 -
నీకేం కాదు కన్నా.. ధైర్యంగా ఉండు..
చెన్నై: ‘నీకేం కాదు.. ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను’ ఈ మాటల్ని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన అభిమానిలో ధైర్యాన్ని నింపటానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. బాషాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారంతా ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలని ఎన్నాళ్లుగానో ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కూడా కరోనా కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంట్లోనే ఉంటూ త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి సుదీర్ఘ చర్చల్లో మునిగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రజనీకాంత్ వీరాభిమానుల్లో ఒకరైన మురళి అనే అతను కరోనా వ్యాధితో ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇతనికి యూరిన్ సమస్య కూడా ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. (చదవండి: రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?) ఇలాంటి పరిస్థితుల్లో మురళి తన ట్విట్టర్లో రజినీకాంత్ గురించి ‘2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడు గాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రూ. 25 వేల ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. నీ సారథ్యంలో నడిచి సేవలు అందించలేకపోతున్నానని బాధపడుతున్నాను’ అని పేర్కొన్నాడు. తన అభిమాని∙గురించి తెలిసిన రజనీకాంత్ అతనికి ఒక వీడియోను పంపారు. అందులో ‘మురళి నేను రజనీకాంత్‌ని మాట్లాడుతున్నాను. నీకేం కాదు కన్నా. ధైర్యంగా ఉండు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తావు. ఆ తర్వాత దయచేసి కుటుంబంతో సహా మా ఇంటికి రావాలి. నేను మిమ్మల్ని చూస్తాను’ అంటూ రజనీకాంత్ తన అభిమానికి ధైర్యం చెప్పారు. -
సైనా కోసం బీ టౌన్ ప్రముఖులు
ముంబై: లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ (26) ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. భారత స్టార్ షట్లర్ సైనా మోకాలి శస్త్రచికిత్స తర్వాత తొందరగా కోలుకోవాలనే అభిలాషను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , దర్శకుడు కరణ్ జోహార్ హీరో రితేష్ దేశ్ ముఖ్, హీరోయిన్ సోనాక్షి సిన్హా, దియా మీర్జా. గాయని శుభా ముద్గల్ తదితరులు ట్విట్టర్ ద్వారా తమ సందేశాలను షేర్ చేశారు. ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకొని మళ్లీ మునుపటిలా కోర్టులో ఛాంపియన్ లా వెలిగిపోవాలని ప్రార్థించారు. అంతా మంచే జరుగుతుందనీ, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సైనా స్పీడీ రికవరీ కోసం ప్రార్థిస్తున్నామంటూ ఛాంపియన్ పట్ల తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. అటు సైనా నెహ్వాల్ కూడా రేపు(శనివారం) తనకు ఆపరేషన్ నిర్వహించనున్నారనీ, తనకోసం ప్రార్థించమంటూ ట్విట్ చేశారు. దీంతో పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయవేత్తలు సహా సుష్మా కూడా ట్వీట్ చేశారు. అలాగే ఆపరేషన్ తనకు విషెస్ తెలిపిన అందరికీ సైనా ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఫోటోలను సైనా ట్విట్టర్ పంచుకున్నారు. కాగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో హైదరాబాదీ సైనా మొదటి రౌండ్ తర్వాత రియో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. హైదరాబాద్ తరలించారు. శస్త్రచికిత్స నిమిత్తం ఆమెను ముంబైకి తరలించారు. వైద్యులు ఆమెకు ఈ ఉదయం (శనివారం) ఆపరేషన్ నిర్వహించారు. Stay strong @NSaina ....and Godspeed!! You are a fighter and a solid talent!!! Sending you lots of love...and healing.... — Karan Johar (@karanjohar) August 20, 2016 @NSaina join all your fans in praying for your speedy recovery. Take care. — Shubha Mudgal (@smudgal) August 19, 2016 After the surgery -
అభిషేక్ త్వరగా కోలుకోవాలి
ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని సహ నటుడు రిషీ కపూర్ ఆకాంక్షించారు. అభిషేక్ బచ్చన్ 'స్లిప్ట్ డిస్క్' సమస్యతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా రిషి కపూర్ ‘అభిషేక్ నువ్వు త్వరగా కోలుకోవాలి. మనం కలసి మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్న అభిషేక్‌కు స్లిప్ట్ డిస్క్’ అని తేలింది. దీంతో కొంత కాలం ప్రయాణాలు, సినిమాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. అబిషేక్ చేతిలో ప్రస్తుతం ‘యువ’, ‘హౌజ్ ఫుల్3, ‘హెర ఫెరి3’, సినిమా ప్రాజెక్టులున్నాయి. ఉమేష్ శుక్లా నిర్మించిన ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమాలో రిషి కపూర్‌తో అభిషేక్ కలిసి నటించిన విషయం తెలిసిందే.