అభిషేక్ త్వరగా కోలుకోవాలి | Rishi Kapoor wishes 'speedy recovery' to Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

అభిషేక్ త్వరగా కోలుకోవాలి

Published Mon, Apr 11 2016 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

Rishi Kapoor wishes 'speedy recovery' to Abhishek Bachchan

ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని సహ నటుడు రిషీ కపూర్ ఆకాంక్షించారు. అభిషేక్ బచ్చన్ 'స్లిప్ట్ డిస్క్' సమస్యతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా రిషి కపూర్ ‘అభిషేక్ నువ్వు త్వరగా కోలుకోవాలి. మనం కలసి మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను.’ అని  ట్వీట్ చేశారు.
 
ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్న అభిషేక్‌కు స్లిప్ట్ డిస్క్’ అని తేలింది. దీంతో కొంత కాలం ప్రయాణాలు, సినిమాలకు దూరంగా ఉండాలని వైద్యులు  సూచించారు. అబిషేక్ చేతిలో ప్రస్తుతం ‘యువ’, ‘హౌజ్ ఫుల్3, ‘హెర ఫెరి3’,  సినిమా ప్రాజెక్టులున్నాయి. ఉమేష్ శుక్లా నిర్మించిన ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమాలో రిషి కపూర్‌తో అభిషేక్ కలిసి నటించిన విషయం తెలిసిందే.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement