
సానియా... సైనా... మేరీకోమ్... సాధ్వీ పాండే
ఆడపిల్లలు ఏం చేసినా అపురూపంగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్లేం చేయడానికీ వీలుండదు కాబట్టి. ఆడపిల్లలు ఎంత సాధించినా అది ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్లు చిన్న గెలుపు కోసం కూడా పెద్ద ఫైట్ చెయ్యాల్సి ఉంటుంది. ‘మళ్లీ బాలి కలే ఫస్ట్’ అనే ఘనత వాళ్లేం సునాయాసంగా సాధి స్తున్నది కాదు? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లిష్ అని ఏదో ఒక టైం టేబుల్ వేసుకుంటే వారు నెగ్గలేరు. ఇల్లూడవడం, గిన్నెలు కడగడం, నీళ్లు పట్ట డం, అమ్మకు కూరగాయలు తరిగి ఇవ్వడం, నాన్న కు వేళకు మందులు గుర్తుచెయ్యడం అనే ఇంకో టైమ్ టేబుల్ కూడా పారలల్‌గా వేస్కోవాలి. ఇంత కష్టపడతారు కనుకే అంతకు అంత ఆడపిల్లలకు మనం అప్రీసియేషన్ ఇవ్వాలి. సానియా మీర్జా టైటిల్ కొట్టుకొచ్చిందా లేదా అన్నది కాదు.
టైటిల్ కోసం ఆమె ఎంత స్ట్రగుల్ అయిందన్నదే పాయిం ట్. సైనా నెహ్వాల్ కూడా అంతే. ఇవాళ వన్‌లో ఉండి, రేపటికి ఆమె నన్‌లోకి పడిపోవచ్చు. వన్‌కి నన్‌కి మధ్య శంకించడానికి వీల్లేని ఆమె ఫైట్‌ని మనం చూడాలి. కేసీఆర్ కోటి రూపాయలిచ్చినా, ఇంకొకరు ఇంకోటి ఇచ్చినా గెలిచినందుకు కాక, గెలవడం కోసం పోరాడినందుకేనని అనుకోవాలి. చదువులు, ఆటల్లోనే కాదు, ఆడపిల్లలు రోజువారీ జీవితానికి ఎదురునిలిచే ఏ చిన్న సాహసం చేసినా, ఏ కాస్త ధైర్యం కనబరిచినా టైటిల్ సాధించిన ట్టుగా నో, ర్యాంకు కొట్టేసినట్టుగానో గుర్తించి కీర్తించాలి. గౌరవించాలి.
అలా ఇప్పుడు మనం గుర్తించి, కీర్తించి, గౌర వించవలసిన ఆగ్రా ఆమ్మాయి సాధ్వీ పాండే. ఈ రెండ్రోజుల్లో మీరు ఆమె గురించి వినే ఉంటారు. వినకపోయినా ఫర్వాలేదు. వినీ విననట్టు ఉండిపో వడం మాత్రం ఆ అమ్మాయిని మనం సపోర్ట్ చేయ కపోవడమే. కొన్నిసార్లు ఆడపిల్లను సపోర్ట్ చెయ్య కపోవడం కూడా ఆమెను హర్ట్ చేయడమే అవు తుంది. అంతేకాదు, ఒక సామాజిక బాధ్యతనూ విస్మరించినట్టు అవుతుంది.
ఇంతకీ ఈ ఆగ్రా అమ్మాయి ఏం చేసింది? మగ వాళ్లు వెంటపడి వేధిస్తున్నా, వెకిలిగా కామెంట్స్ చేస్తున్నా, చెయ్యి తాకిస్తున్నా, అసభ్యంగా ప్రవర్తి స్తున్నా చాలామంది ఆడపిల్లలు పరువుకు భయపడి చెయ్యలేని పని ఈమె చేసింది. కారు అద్దాల్లోంచి తనకు కన్నుగీటిన వాడిని బయటికి లాగడం కోసం ఆగ్రా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన స్కూటీని ఓ పక్కకు ఆపి, పరుగున వెళ్లి కారు పైకి ఎక్కి విండ్ షీల్డ్ పగల గొట్టింది. ‘‘నాకు కన్నుగీటినందుకు మా ఇంటికి వచ్చి మా నాన్నకు వాడు క్షమాపణ చెప్పాల్సిందే’’ అని హఠం పట్టింది. ఆ కారులో ఉన్నది ఓ రాజకీయ నాయకుడు, ఆయన గన్‌మేన్. ఆ అమ్మాయికి కన్ను గీటింది ఆ గన్‌మేనే.
ఆడపిల్ల తనకేదైనా జరిగితే అన్నకు చెప్పుకుం టుంది. నాన్నకు చెప్పుకుంటుంది. భర్తకు చెప్పుకుం టుంది. పోలీసులకు, న్యాయస్థానాలకు చెప్పుకుం టుంది. సాధ్వీ పాండే తనే తేల్చుకోవాలనుకుంది. అంత కోపం వచ్చిందామెకు. సాద్వీ పాండే చూపిన తెగువ... సైనా, సానియాలు కొట్టిన స్మాష్‌ల కన్నా తక్కువదేం కాదు. మేరీ కోమ్ ఇచ్చిన పంచ్ కన్నా తక్కువ పవరున్నదేం కాదు. టెన్త్ ర్యాంకు కన్నా పిస రంతైనా తీసిపారేయదగింది కాదు.
నిజానికి కన్ను గీటితే చప్పుడు రాదు. సాధ్వీ కూడా మౌనంగా ఉండిపోవచ్చు. ఏ రభసా చేయకుండా ఏమీ జరగ నట్టు తన దారిన తను వె ళ్లిపోవచ్చు. కానీ జీవితం పొడవునా ఆమె అంతరాత్మ ఆమెను ప్రశ్నిస్తూనే ఉం టుంది, ‘‘ఎందుకు పిరికిదానిలా మౌనంగా వచ్చే శావ్’’ అని. దానికి సమాధానం ఇవ్వలేక సతమత మవడం కరెక్టా? ఆన్ ది స్పాట్ దులిపేయడం, దులి పేసుకోవడం కరెక్టా? సాధ్వీ కరెక్ట్ పనే చేసింది. అది 23 ఏళ్ల అమ్మాయి వయసు పవర్ కాదు. ‘ఎంపవర్ మెంట్’ను చాటే స్త్రీ శక్తి. మహిళల కోసం ప్రధాని మోదీ చాలా చేస్తున్నారు. సాధ్వీని భేష్ అంటూ ఆయన చిన్న ట్వీట్ వదిలినా చాలు. చట్టాలు, శిక్షలు ఇన్‌స్టంట్‌గా చేయలేని పని ఆ ట్వీట్ చేస్తుంది.
- మాధవ్ శింగరాజు