విజయం అంచుల్లోంచి...
మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, డిఫెండింగ్ చాంపియన్ సైనా పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ సింధు 21–10, 20–22, 16–21తో ఓడింది. తొలి గేమ్‌ను గెలిచిన సింధు రెండో గేమ్‌లో 20–19తో విజయం అంచుల్లో నిలిచింది. మరో పాయింట్ సాధిస్తే విజయం ఖాయమయ్యే స్థితిలో సింధు వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది.
ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మూడుసార్లు (8–4, 12–9, 14–10) ఆధిక్యంలో నిలిచినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. గత ఏడాది రన్నరప్ సన్ యు (చైనా)తో 78 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–10, 17–21తో పోరాడి ఓడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 15–13తో ఆధిక్యంలో ఉన్న దశలో తన ప్రత్యర్థికి వరుసగా ఏడు పాయింట్లు సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది.