ప్రపంచ 10వ ర్యాంకర్‌పై అష్మిత విజయం
డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అషి్మత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది.
2022 ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్–500 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. సిమ్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి (భారత్) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్ షువో యున్–యు చెయున్ హుయ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్–థినా మురళీధరన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 9–21, 15–21తో టాప్ సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ హాన్ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్ జాంగ్ యి మాన్ (చైనా)తో అషి్మత తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment