మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్, తెలుగు తేజం పీవీ సింధు తన జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో సింధు నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో సింధు ఘన విజయం సాధించింది.
తొలి రౌండ్ నుంచే బుసానన్‌పై సింధూ ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా ప్రత్యర్ధిని ఓడించడానికి సింధూకు 2 గంటల 28 నిమిషాల సమయం పట్టింది. ఈ ఏడాది మాస్టర్స్ టోర్నీలో సింధూ ఫైనల్ అర్హత సాధించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం.
సింధూ చివరగా గత ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్‌కు చేరింది. కాగా 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో సింధూను బుసానన్ ఓడించి టైటిల్ సాధించింది. తాజా విజయంతో సింధూ తన ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్‌లో చైనా ప్లేయర్ వాంగ్ ఝీయితోస సింధూ తలపడనుంది.
Sindhu makes it to her 1️⃣st final this year & 4️⃣th in #Super500 events after an exceptional comeback win 13-21, 21-16, 21-12 🥳🚀
Well done Sindhu 🫶
📸: @badmintonphoto@himantabiswa | @sanjay091968 | @Arunlakhanioffi #MalaysiaMasters2024#IndiaontheRise#Badminton pic.twitter.com/XtqcCaLOnv— BAI Media (@BAI_Media) May 25, 2024
Comments
Please login to add a commentAdd a comment