Malaysia Masters tournament
-
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
టైటిల్ విజయం కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లో సింధూ ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి రౌండ్లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు రౌండ్లలో ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో రౌండ్ ముగిసే సరికి ఇరువరు చెరో విజయంతో సమంగా నిలవగా.. ఫలితాన్ని తెల్చే మూడో రౌండ్లో ప్రత్యర్ధి వాంగ్ జీయీ చెలరేగిపోయింది.సింధూకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
కౌలాలంపూర్: భారత టాప్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో సింధు 13–21, 21–16, 21–12 స్కోరుతో బుసానన్ ఆంగ్బమ్రున్పన్ (థాయిలాండ్)పై విజయం సాధించింది. తన కెరీర్లో ఐదేళ్ల క్రితం ఒకే ఒక సారి బుసానన్ చేతిలో ఓడిన సింధుకు ఇది ఆమెపై 18వ గెలుపు కావడం విశేషం. వరల్డ్ నంబర్ 20 బుసానన్ తొలి గేమ్‌లో ఆధిక్యం ప్రదర్శించి ముందంజ వేసింది. అయితే వెంటనే కోలుకున్న సింధు ర్యాలీలతో చెలరేగి గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో సింధు తన స్థాయిలో సత్తా చాటింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది. అదే జోరును కొనసాగిస్తూ 17–10తో దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నంబర్ 7 వాంగ్ జి యీ (చైనా)తో సింధు తలపడుతుంది. -
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు..
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్, తెలుగు తేజం పీవీ సింధు తన జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో సింధు నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో సింధు ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే బుసానన్‌పై సింధూ ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా ప్రత్యర్ధిని ఓడించడానికి సింధూకు 2 గంటల 28 నిమిషాల సమయం పట్టింది. ఈ ఏడాది మాస్టర్స్ టోర్నీలో సింధూ ఫైనల్ అర్హత సాధించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. సింధూ చివరగా గత ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్‌కు చేరింది. కాగా 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో సింధూను బుసానన్ ఓడించి టైటిల్ సాధించింది. తాజా విజయంతో సింధూ తన ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో చైనా ప్లేయర్ వాంగ్ ఝీయితోస సింధూ తలపడనుంది. Sindhu makes it to her 1️⃣st final this year & 4️⃣th in #Super500 events after an exceptional comeback win 13-21, 21-16, 21-12 🥳🚀Well done Sindhu 🫶📸: @badmintonphoto@himantabiswa | @sanjay091968 | @Arunlakhanioffi #MalaysiaMasters2024#IndiaontheRise#Badminton pic.twitter.com/XtqcCaLOnv— BAI Media (@BAI_Media) May 25, 2024 -
Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అషి్మత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2022 ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్–500 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. సిమ్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి (భారత్) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్ షువో యున్–యు చెయున్ హుయ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్–థినా మురళీధరన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 9–21, 15–21తో టాప్ సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ హాన్ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్ జాంగ్ యి మాన్ (చైనా)తో అషి్మత తలపడతారు. -
Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్ఎస్ ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్ల ప్రణయ్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు. వెంగ్ హంగ్ యాంగ్, హెచ్ ప్రణయ్ మధ్య మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో వెంగ్ హంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ప్రణయ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 9-9 తేడాతో స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత 15-12 తేడాతో 3 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 15-15 తేడాతో స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. అయితే వరుసగా రెండు పాయింట్లు సాధించి 17-16 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, మొదటి సెట్‌ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో ప్రణయ్ పూర్తిగా తేలిపోయాడు. ప్రణయ్ చేసిన తప్పిదాలతో 11-17 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దాన్ని కాపాడుకుంటూ 13-21 తేడాతో రెండో సెట్ సొంతం చేసుకుని, గేమ్‌ని 1-1 తేడాతో సమం చేశాడు.. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. మూడో సెట్లో 10-10 తేడాతో ఇద్దరు ప్లేయర్లు సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత దూకుడు చూపించిన హెచ్ఎస్ ప్రణయ్, వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్‌పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా 3 పాయింట్లు సాధించి, సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు.. మలేషియా మాస్టర్స్ ఉమెన్స్ సింగిల్స్‌లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలవగా.. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన మొదటి భారత షట్లర్‌గా హెచ్ఎస్ ప్రణయ్ చరిత్రకెక్కాడు. WATCH: Moments when HS Prannoy won his first ever BWF World Tour Title! via Sports 18#Badminton #MalaysiaMasters2023 pic.twitter.com/qVuqwmYvWL — Sayak Dipta Dey (@sayakdd28) May 28, 2023 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡 🏆🏆🏆 HS Prannoy has done it!! 🫡😍 The WR 9 Indian beats Weng Hong Yang of China 21-19, 13-21, 21-18 in #MalaysiaMasters2023 men's singles final to win his maiden BWF World Tour title. 🇮🇳#MalaysiaMasters #HSPrannoy pic.twitter.com/Kc3YfHnFdu — Khel Now (@KhelNow) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ.. సెమీఫైనల్లో ప్రణయ్ ఓటమి
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ఓటమి చవిచూశాడు. సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 21–17, 9–21, 17–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో ఓడిన ప్రణయ్‌కు 5,220 డాలర్ల (రూ. 4 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. చదవండి: World Games 2022: సురేఖ జంటకు కాంస్యం -
మలేసియా మాస్టర్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ.. మళ్లీ తైజు చేతిలో ఓటమి
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తై జూయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 13-21, 21-12, 12-21 తేడాతో సింధూ పరాజయం పాలైంది. తొలి సెట్ లో ఓడిపోయిన సింధు, రెండో సెట్ లో పుంజుకుని విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో తైజు చేలరేగి ఆడింది. దీంతో మరో విజయాన్ని తైజు తన ఖాతాలో వేసుకుంది. కాగా తై జూయింగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన మలేషియా ఓపెన్ క్వార్టర్‌ఫైనల్స్‌లోను సింధూపై తై జూ గెలుపొందింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు 22 మ్యాచ్‌ల్లో వీరిద్దరూ తలపడగా..5 మ్యాచ్‌ల్లో సిందూ,17 మ్యాచ్‌ల్లో తై జూ విజయం సాధించింది. చదవండి: Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే! -
Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీలో హి బింగ్ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 21–16, 17–21, 14–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–8, 21–9తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై, కశ్యప్ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–19, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. సమీర్ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ– అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వార్టర్స్‌లో సింధు, సైనా
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆరంభ బ్యాడ్మింటన్ టోర్నీ అయిన మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా... పురుషుల విభాగంలో మాత్రం హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో పీవీ సింధు 21–10, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందింది. ఆయా ఓహోరిపై సింధుకిది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 25–23, 21–12తో టోర్నీ ఎనిమిదో సీడ్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా... కీలక సమయంలో పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఆన్ సె యంగ్ చేతిలో ఎదురైన ఓటమికి సైనా ప్రతీకారం తీర్చుకున్నట్లంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు; మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సమీర్ వర్మ 19–21, 20–22తో లీ జి జియా (మలేసియా) చేతిలో, ప్రణయ్ 14–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో వరుస సెట్లలో ఓడి ఇంటి ముఖం పట్టారు. -
సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కౌలాలంపూర్: గతేడాది అద్భుత ఆటతీరుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోనూ స్థానం సంపాదించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంటకు కొత్త ఏడాది కలిసి రాలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో ప్రస్తుత ప్రపంచ 12వ ర్యాంక్ జంట సాతి్వక్–చిరాగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. ప్రపంచ 19వ ర్యాంక్ ద్వయం ఓంగ్ యెవ్ సిన్–తియో ఈ యి 21–15, 18–21, 21–15తో సాత్విక్ –చిరాగ్ జంటకు షాక్ ఇచ్చింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌లో తడబడి రెండో గేమ్‌లో తేరుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–17 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు సమరి్పంచుకొని ఓటమిని ఖాయం చేసు కుంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శుభాంకర్ (భారత్) 15–21, 15–21తో డారెన్ ల్యూ (మలేసియా) చేతిలో... లక్ష్య సేన్ (భారత్) 21–11, 18– 21, 14–21తో విటింగ్‌హస్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. నేడు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కెంటో మొమోటా (జపాన్)తో కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ; సునెయామ (జపాన్)తో ప్రణయ్; రస్ముస్ జెమ్కె (డెన్మార్క్)తో సాయిప్రణీత్ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లియాన్ తాన్ (బెల్జియం)తో సైనా; కొసెత్‌స్కాయ (రష్యా)తో పీవీ సింధు తలపడతారు. -
బ్యాడ్మింటన్ సీజన్‌కు వేళాయె
కౌలాలంపూర్: గతేడాది ఆశించినరీతిలో రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు కొత్త సీజన్‌ను టైటిల్‌తో మొదలుపెట్టాలనే లక్ష్యంతో మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. గత సంవత్సరం పీవీ సింధు ప్రపంచ చాంపియన్ కావడం, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించడం మినహా భారత్‌కు ఇతర గొప్ప ఫలితాలేవీ రాలేదు. మరో ఏడు నెలల కాలంలో టోక్యో ఒలింపిక్స్ జరగనుండటంతో సీజన్ ప్రారంభం నుంచే భారత క్రీడాకారులందరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మలేసియా మాస్టర్స్ టోర్నీలో తొలి రోజు పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మలేసియాకు చెందిన ఓంగ్ యెవ్ సిన్–తియో ఈ యిలతో తలపడనుంది. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, సైనా... పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సమీర్ వర్మ, సాయిప్రణీత్, శ్రీకాంత్ బరిలో ఉన్నారు. -
మలేసియా ఓపెన్ : సైనా ఓటమి
కౌలాలంపూర్ : మలేసియా మాస్టర్స్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సైనా 16-21, 13–21తో పరాజయం పాలైంది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మారిన్ జోరు ముందు సైనా చేతులెత్తేసింది. తొలి గేమ్‌లో 14-14తో మారిన్‌కు గట్టిపోటీనిచ్చిన భారత స్టార్ తర్వాత అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సైనా-మారిన్‌ల ముఖాముఖీ రికార్డు 5-6గా మారింది. ఈ మ్యాచ్ అనంతరం సైనా.. మారిన్‌కు అభినందనలు తెలపుతూ ట్వీట్ చేసింది.‘ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. అద్భుతంగా ఆడిన మారిన్‌కు అభినందనలు.. వచ్చే వారం జరిగే ఇండోనేషియా ఓపెన్‌లో రాణిస్తాను’. అని పేర్కొంటూ సైనా ధీమా వ్యక్తం చేసింది. Was not up to the mark today in the match ... but will try again next week to do well .. congratulations to @carolinamarin for playing so well today 👍 16-21 13-21 #malaysiamasterssuper500 #semifinals .. looking forward to indonesia open next week 🙏.. pic.twitter.com/i33MpMbjqs — Saina Nehwal (@NSaina) 19 January 2019 -
సైనా జోరు...
కౌలాలంపూర్: సీజన్ తొలి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ ఓపెన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ విజయపరంపర కొనసాగుతోంది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 21–18, 23–21తో గెలిచింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా రెండు గేముల్లోనూ వెనుకంజలో ఉండి కోలుకొని విజయాన్ని దక్కించుకోవడం విశేషం. తొలి గేమ్‌లో 9–15తో... రెండో గేమ్‌లో 14–18తో సైనా వెనుకబడినా పట్టుదల కోల్పోకుండా పోరాడి ప్రత్యర్థి ఆట కట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడుతుంది. ముఖాముఖీ రికార్డులో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 23–21, 16–21, 17–21తో సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
కౌలాలంపూర్: కొత్త ఏడాది ఆరంభ టోర్నీ మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్... మహిళల డబుల్స్ కేటగిరీలో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ రెండో రౌండ్లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సైనా (భారత్) 21–14, 21–16తో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)పై వరుస గేముల్లో కేవలం 39 నిమిషాల్లోనే గెలుపొందింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో 2017 ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా తలపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా ముఖాముఖీ రికార్డులో 8–4తో ఒకుహారా (వరల్డ్ నెం.2)పై ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ శ్రీకాంత్ (భారత్) 23–21, 8–21, 21–18తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై పోరాడి గెలిచాడు. నేటి మ్యాచ్‌లో నాలుగో సీడ్ సన్‌వాన్‌హో (కొరియా)తో శ్రీకాంత్ తలపడతాడు. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ కశ్యప్ 17–21, 23–25తో ఆరోసీడ్ ఆంథోని సినిసుకా జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్ రెండోరౌండ్లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 18–21, 17–21తో ని కెటుట్ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
సింధుకు నిరాశ
మలేసియా మాస్టర్స్ టోర్నీ కుచింగ్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత క్రీడాకారులెవరూ ఫైనల్ చేరుకోకుండానే ఇంటిముఖం పట్టారు. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు 21-19, 13-21, 8-21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో; పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ 21-10, 17-21, 16-21తో హ్యోక్ జిన్ జియోన్ (దక్షిణ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సింధు, జయరామ్‌లిద్దరూ తమ ప్రత్యర్థులపై తొలి గేమ్ గెలిచాక తర్వాతి రెండు గేమ్‌లను చేజార్చుకోవడం గమనార్హం. ప్రపంచ 24వ ర్యాంకర్ ఒకుహారా చేతిలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో ఓటమి. గతేడాది హాంకాంగ్ ఓపెన్‌లోనూ ఒకుహారా చేతిలో సింధు ఓడిపోయింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి రెండు గేముల్లో గట్టిపోటీనే ఇచ్చింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహారా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున, మరో రెండుసార్లు వరుసగా మూడు పాయింట్ల చొప్పున ఈ జపాన్ అమ్మాయి పాయింట్లు సాధించి సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడిన సింధు, జయరామ్‌లకు 1,740 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. లక్షా 7 వేలు)తోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.