మలేసియా ఓపెన్ ‌: సైనా ఓటమి | Saina Nehwal Defeat to Carolina Marin in Malaysia Masters Semi Final | Sakshi

Jan 19 2019 2:12 PM | Updated on Jan 19 2019 2:24 PM

Saina Nehwal Defeat to Carolina Marin in Malaysia Masters Semi Final - Sakshi

ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ చేతిలో..

కౌలాలంపూర్‌ : మలేసియా మాస్టర్స్‌ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కథ ముగిసింది. ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌  సెమీ  ఫైనల్లో  సైనా 16-21, 13–21తో పరాజయం పాలైంది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మారిన్‌ జోరు ముందు సైనా చేతులెత్తేసింది.

తొలి గేమ్‌లో 14-14తో మారిన్‌కు గట్టిపోటీనిచ్చిన భారత స్టార్‌ తర్వాత అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సైనా-మారిన్‌ల ముఖాముఖీ రికార్డు 5-6గా మారింది. ఈ మ్యాచ్‌ అనంతరం సైనా.. మారిన్‌కు అభినందనలు తెలపుతూ ట్వీట్‌ చేసింది.‘ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. అద్భుతంగా ఆడిన మారిన్‌కు అభినందనలు.. వచ్చే వారం జరిగే ఇండోనేషియా ఓపెన్‌లో రాణిస్తాను’. అని పేర్కొంటూ సైనా ధీమా వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement