
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తై జూయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 13-21, 21-12, 12-21 తేడాతో సింధూ పరాజయం పాలైంది. తొలి సెట్ లో ఓడిపోయిన సింధు, రెండో సెట్ లో పుంజుకుని విజయం సాధించింది.
అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో తైజు చేలరేగి ఆడింది. దీంతో మరో విజయాన్ని తైజు తన ఖాతాలో వేసుకుంది. కాగా తై జూయింగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన మలేషియా ఓపెన్ క్వార్టర్‌ఫైనల్స్‌లోను సింధూపై తై జూ గెలుపొందింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు 22 మ్యాచ్‌ల్లో వీరిద్దరూ తలపడగా..5 మ్యాచ్‌ల్లో సిందూ,17 మ్యాచ్‌ల్లో తై జూ విజయం సాధించింది.
చదవండి: Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే!