మలేసియా మాస్టర్స్ ఓపెన్
కౌలాలంపూర్: భారత టాప్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో సింధు 13–21, 21–16, 21–12 స్కోరుతో బుసానన్ ఆంగ్‌బమ్‌రున్‌పన్ (థాయిలాండ్)పై విజయం సాధించింది.
తన కెరీర్‌లో ఐదేళ్ల క్రితం ఒకే ఒక సారి బుసానన్ చేతిలో ఓడిన సింధుకు ఇది ఆమెపై 18వ గెలుపు కావడం విశేషం. వరల్డ్ నంబర్ 20 బుసానన్ తొలి గేమ్‌లో ఆధిక్యం ప్రదర్శించి ముందంజ వేసింది. అయితే వెంటనే కోలుకున్న సింధు ర్యాలీలతో చెలరేగి గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో సింధు తన స్థాయిలో సత్తా చాటింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది. అదే జోరును కొనసాగిస్తూ 17–10తో దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నంబర్ 7 వాంగ్ జి యీ (చైనా)తో సింధు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment