pre-quarter-final
-
Wimbledon 2024: కోకో గాఫ్ పరాజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్‌కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు. ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్‌స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నాలుగో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు. -
Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అషి్మత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2022 ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్–500 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. సిమ్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి (భారత్) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్ షువో యున్–యు చెయున్ హుయ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్–థినా మురళీధరన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 9–21, 15–21తో టాప్ సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ హాన్ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్ జాంగ్ యి మాన్ (చైనా)తో అషి్మత తలపడతారు. -
French Open 2023: ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా ఫిట్నెస్ సమస్యలతో వైదొలగగా, ఆరోసీడ్ కోకో గాఫ్, 14వ సీడ్ హదాడ్ మైయాతో పాటు పురుషుల ఈవెంట్లో సీడెడ్లు కాస్పెర్ రూడ్, హోల్గెర్ రూన్ (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. జపనీస్ స్టార్ నిషిఒకా చెమటోడ్చి ముందంజ వేయగా, 15వ సీడ్ బొర్నా కొరిచ్ మూడో రౌండ్లో నిష్క్రమించాడు. ఏకపక్షంగా... మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు (2020, 2022) ఇక్కడ క్లే కోర్ట్ చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు మూడో రౌండ్లో చైనీస్ ప్రత్యర్థి నుంచి కనీస పోటీనే లేకపోయింది. దీంతో పోలండ్ స్టార్ 6–0, 6–0తో జిన్యూ వాంగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది. కేవలం 51 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా మ్యాచ్ బరిలోకి దిగకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. అనారోగ్య కారణాలతో మూడో రౌండ్ బరిలోకి దిగలేనని 23 ఏళ్ల కజకిస్తాన్ ప్లేయర్ వెల్లడించింది. దీంతో ప్రత్యర్థి సార సొరిబెస్ టొర్మో (స్పెయిన్) వాకోవర్‌తో ప్రిక్వార్టర్స్ చేరింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (5/7), 6–1, 6–1తో మిర అండ్రీవా (రష్యా)పై గెలుపొందగా, 14వ సీడ్ హదాడ్ మైయా 5–7, 6–4, 7–5తో అలెగ్జాండ్రొవా (రష్యా)ను ఓడించింది. పోరాడి ఓడిన సెబొత్ బ్రెజిలియన్ క్వాలిఫయర్ తియాగో సెబొత్ వైల్డ్ అంటే ఇకపై ప్రత్యర్థులు హడలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఇదివరకే అతను తొలి రౌండ్లోనే యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ (2021), రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. తాజాగా అతని దూకుడుకు జపాన్ నంబర్‌వన్ ఆటగాడు యొషిహితో నిషిఒకా బ్రేకులేసినప్పటికీ సెబొత్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. 27వ సీడ్ నిషిఒకా 3–6, 7–6 (10/8), 2–6, 6–4, 6–0తో సెబొత్ వైల్డ్‌పై శ్రమించి గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్పై గెలుపొందాడు. నార్వే స్టార్‌కు తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనా... తర్వాత సెట్లలో సులువుగానే గెలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్ చేరిన ఆరోసీడ్ డెన్మార్క్ స్టార్ రూన్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఆడుతున్నాడు. మూడో రౌండ్లో తనకెదురైన ప్రత్యర్థి ఒలీవియెరి (అర్జెంటీనా)ను 6–4, 6–1, 6–3తో ఓడించాడు. కేవలం రెండు గంటల్లోనే (గంటా 58 నిమిషాలు) మ్యాచ్‌ను ముగించాడు. బొర్న కొరిచ్ (క్రొయే షియా) 3–6, 6–7(5/7), 2–6తో మార్టిన్ ఎచెవెరి (అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
All England Open Championship: గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ గాయత్రి–ట్రెసా జాలీ 21–18, 21–14తో ఎనిమిదో ర్యాంక్ జోంగ్కోల్ఫోన్ కితితారాకుల్–రవీంద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసా పూర్తి సమన్వయంతో ఆడి ఆద్యంతం తమ ఆధిపత్యం చాటుకున్నారు. గతంలో ఈ థాయ్‌లాండ్ జోడీతో ఆడిన నాలుగుసార్లూ ఓటమి పాలైన గాయత్రి–ట్రెసా ఐదో ప్రయత్నంలో మాత్రం విజయఢంకా మోగించారు. గత ఏడాది ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన గాయత్రి–ట్రెసా ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ ఫకుషిమా–సయాకా హిరోటా (జపాన్)లతో తలపడతారు. మళ్లీ తొలి రౌండ్లోనే... ఈ ఏడాది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో టోర్నమెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సింధు 17–21, 11–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 16–13తో ఆధిక్యంలోకి నిలిచింది. ఈ దశలో జాంగ్ యి మాన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. 13–16 నుంచి జాంగ్ యి మాన్ 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ గెలిచినా, ఆ వెంటనే జాంగ్ మరో పాయింట్ నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. ఆ తర్వాత సింధు మళ్లీ తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సింధు తేరుకోలేకపోయింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన తన వ్యక్తిగత కోచ్ పార్క్ తే సాంగ్‌తో విడిపోయిన సింధు ఈ ఏడాది మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం తనకు ఎవరూ వ్యక్తిగత కోచ్ లేరని, త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించుకుంటానని మ్యాచ్ అనంతరం సింధు వ్యాఖ్యానించింది. శ్రమించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడ్డాడు. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–5తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–13, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2020 చాంపియన్ స్వియాటెక్ 6–3, 7–5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై గెలిచి ఈ ఏడాది వరుసగా 31వ విజయాన్ని నమోదు చేసింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించారు. 28వ సీడ్ కమిలా జార్జి (ఇటలీ) 4–6, 6–1, 6–0తో సబలెంకాను ఓడించగా... వెరోనికా కుదెర్మెతోవా (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో బదోసా తొలి సెట్‌ను 3–6తో కోల్పోయి, రెండో సెట్లో 1–2తో వెనుబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. బదోసా, సబలెంకా ఓటమితో ఈ టోర్నీలో టాప్–10 క్రీడాకారిణుల్లో కేవలం స్వియాటెక్ మాత్రమే బరిలో మిగిలింది. బోపన్న జోడీ సంచలనం పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట 6–7 (5/7), 7–6 (7/3), 7–6 (12/10)తో రెండో సీడ్ మాట్ పావిచ్–నికోల్ మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
ఒడెన్స్: దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు శుభారంభం లభించింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–18తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో కాస్త పోటీ లభించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌లో ఉన్న శ్రీకాంత్ ముఖాముఖి కెరీర్లో టోబీ పెంటీపై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు వీరిద్దరు 2013 థాయ్‌లాండ్ ఓపెన్‌లో తలపడగా... శ్రీకాంత్ వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)తో శ్రీకాంత్ తలపడతాడు. తొలి రౌండ్లో జేసన్ 21–13, 21–18తో భారత్‌కు చెందిన శుభాంకర్ డేను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. మూడో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 12–21, 14–21తో పరాజయం పాలయ్యాడు. ‘తొలి గేమ్‌లో చక్కగా ఆడాను. రెండో గేమ్‌లో టోబీ పుంజుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టి కోర్టులో అడుగుపెట్టాను. ఇదో సాహసకార్యంలా అనిపిస్తోంది. గతంలో ఏనాడూ నేనింతకాలం మ్యాచ్‌లు ఆడకుండా విరామం తీసుకోలేదు. మొత్తానికి శుభారంభం చేసినందుకు ఆనందంగా ఉంది. కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. నా అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవాలంటే కొంత సమయం పడుతుంది. చివరిసారి నేను మార్చిలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడి తొలి రౌండ్లోనే ఓడిపోయాను. డెన్మార్క్ ఓపెన్ తర్వాత ఈ సీజన్లో మరే టోర్నీలోనూ ఆడటంలేదు. కరోనా సమయంలో లభించిన విరామాన్ని ఆస్వాదించాను. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే గడిపాను. ఆ తర్వాత ఆగస్టు తొలివారంలో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాను. ఈ టోర్నీలో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తా. జనవరి నుంచి తాజాగా సీజన్‌ను మొదలుపెడతా’ అని గుంటూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. -
సానియా జంట జోరు
మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి మహిళల డబుల్స్‌లో... ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-3తో లుద్మిలా-నాదియా కిచెంకో (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా-డోడిగ్ జంట 7-5, 6-1తో కిరియోస్-తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. జూనియర్ బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల 6-4, 5-7. 6-1తో మయూకా ఐకావా (జపాన్)పై నెగ్గి శుభారంభం చేసింది. ముగురుజాకు షాక్: మహిళల సింగిల్స్ విభాగం మూడో రౌండ్లో రెండు సంచలనాలు నమోదయ్యాయి. మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 3-6, 2-6తో బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో; తొమ్మిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 3-6, 2-6తో 21వ సీడ్ మకరోవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. ఏడో సీడ్ కెర్బర్ (జర్మనీ), 14వ సీడ్ అజరెంకా (బెలారస్), 15వ సీడ్ మాడిసన్ కీస్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వావ్రింకాకు 400వ విజయం పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో వావ్రింకా 6-2, 6-3, 7-6 (7/3) తో రసోల్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. వావ్రింకా కెరీర్లో ఇది 400వ విజయం. ముర్రే 6-2, 3-6, 6-2, 6-2తో సుసా (పోర్చుగల్)పై గెలిచాడు.