ఎమ్మా నవారో సంచలన విజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్‌కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు.
ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్‌స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్‌సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్‌యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
నాలుగో సీడ్ జ్వెరెవ్‌కు షాక్
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment