Wimbledon Grand Slam tennis tournament
-
Wimbledon 2024: కోకో గాఫ్ పరాజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్‌కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు. ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్‌స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నాలుగో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు. -
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్‌పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్‌కు ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు. -
Wimbledon 2023: అల్కరాజ్ అలవోకగా...
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ పది ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. చార్డీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్కరాజ్ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రియాన్ పెనిస్టన్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు. వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. పైకప్పు కలిగిన సెంటర్ కోర్టు, నంబర్‌వన్ కోర్టులోని మ్యాచ్‌లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్ (పోలాండ్)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్
లండన్: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్తో తలపడాల్సిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ రెండో సెట్ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ నెట్ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు. -
Wimbledon 2022: కార్నెట్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌లో ఫ్రాన్స్ అన్‌సీడెడ్ ప్లేయర్ అలైజ్ కార్నెట్ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను మూడో రౌండ్లోనే కంగు తినిపించింది. వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టాప్‌సీడ్, టోర్నీ హాట్ ఫేవరెట్ జైత్రయాత్రకు ప్రపంచ 37వ ర్యాంకర్ కార్నెట్ బ్రేకులేసింది. శనివారం జరిగిన పోరులో ఆమె 6–4, 6–2తో అలవోక విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2005 నుంచి గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఫ్రాన్స్ వెటరన్ స్టార్ 2014లో కూడా ఇలాదే సెరెనా విలియమ్స్‌కు షాక్ ఇచ్చింది. అప్పటికే 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన టాప్‌సీడ్ సెరెనాను కార్నెట్ మూడో రౌండ్లో ఓడించింది. తాజా సంచలనంపై ఆమె మాట్లాడుతూ సెరెనా మ్యాచే గుర్తుకొచ్చిందని పేర్కొంది. మిగతా మ్యాచ్‌ల్లో 2018 వింబుల్డన్ చాంపియన్, 15వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 5–7తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓడగా, నాలుగో సీడ్ బడొసా (స్పెయిన్) 7–5, 7–6 (7/4)తో 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 11వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)కు 6–7 (4/7), 6–2, 6–1తో 20వ సీడ్ అనిసిమోవా (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. 16వ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–1తో మగ్దలిన ఫ్రెచ్ (పోలండ్)పై నెగ్గింది. సెరెనాకు తొలిరౌండ్లోనే ఇంటిదారి చూపించిన హర్మొని టన్ (ఫ్రాన్స్) 6–1, 6–1తో బౌల్టర్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. -
Wimbledon 2022: జొకోవిచ్ అలవోకగా...
లండన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6–0, 6–3, 6–4తో 25వ సీడ్ కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–3తో బెరాన్కిస్ (లిథువేనియా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. రెండో రౌండ్లో క్వాలిఫయర్ జాక్ సాక్ (అమెరికా) 6–4, 6–4, 3–6, 7–6 (7/1)తో మాక్సిమి క్రెసీ (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. దాంతో 1995 తర్వాత వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరిన అమెరికా ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. హీతెర్, జబర్ ముందంజ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) 6–2, 6–3తో డయానా పెరీ (ఫ్రాన్స్)పై, హీతెర్ వాట్సన్ (బ్రిటన్) 7–6 (8/6), 6–2తో కాజా జువాన్ (స్లొవేనియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. హీతెర్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. -
ఒలింపిక్స్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదు: జొకోవిచ్
లండన్: ఈ నెల 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ఆడాలా... వద్దా అనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ పేర్కొన్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచాక ఒలింపిక్స్‌పై జొకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒలింపిక్స్ గురించి ఇంకా ఆలోచించాల్సి ఉంది. నేనెప్పుడూ అందులో పాల్గొనాలనే కోరుకుంటా. కానీ, కోవిడ్–19, క్వారంటైన్ నిబంధనలు, అభిమానులు లేకుం డా గేమ్స్ జరగనుండటం వంటి అంశాల వల్ల అందులో నేను పాల్గొనేది 50–50గా ఉంది’ అని జొకోవిచ్ అన్నాడు. 2008 బీజింగ్ ఒలిం పిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్ కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
చరిత్రకు చేరువగా...
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏడోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ జొకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో 7–6 (7/3), 7–5, 7–5తో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండటం విశేషం. అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ (31 సార్లు) తర్వాత జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటినితో జొకోవిచ్ తలపడతాడు. షపోవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన షపోవలోవ్ కీలకదశలో తడబడి పాయి ంట్లు కోల్పోయాడు. మరోవైపు కెరీర్లో 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ కీలకదశలో పైచేయి సాధించాడు. ఏడు ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. షపోవలోవ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 11సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా అతను ఒక్కసారి మాత్రమే సఫలమయ్యాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలిచిన జొకోవిచ్ ఆదివారం విజేతగా నిలిస్తే ... అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ప్రస్తుతం సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున) సరసన ఈ సెర్బియా స్టార్ కూడా చేరుతాడు. 1976 తర్వాత... తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ) 6–3, 6–0, 6–7 (3/7), 6–4తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా అడ్రియానో పనట్టా (1976–ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇటలీ ప్లేయర్‌గా, వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది సార్లు చాంపియన్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన హుబర్ట్ సెమీఫైనల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బెరెటిని కచ్చితమైన సర్వీస్‌లు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగి హుబర్ట్ ఆట కట్టించాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్దకు 25సార్లు దూసుకొచ్చి 16సార్లు పాయింట్లు గెలిచాడు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన హుబర్ట్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. -
ఫెడరర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రికార్డుస్థాయిలో 22వసారి బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గతంలో ఎనిమిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన 39 ఏళ్ల ఫెడరర్‌ను 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్) ఇంటిముఖం పట్టించాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల హుబర్ట్ 6–3, 7–6 (7/4), 6–0తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్‌పై హుబర్ట్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. హుబర్ట్ దూకుడైన ఆటకు ఫెడరర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. సునాయాసంగా గెలవాల్సిన పాయింట్లను కూడా ఫెడరర్ కోల్పోయాడు. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన ఫెడరర్ మూడు డబుల్ట్ ఫాల్ట్‌లు చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 81 కేజీల బరువున్న హుబర్ట్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఫెడరర్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. పదోసారి సెమీస్‌లో జొకోవిచ్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–4తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి పదోసారి సెమీఫైనల్లోకి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)తో జొకోవిచ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో షపోవలోవ్ 6–4, 3–6, 5–7, 6–1, 6–4తో 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరాడు. పోరాడి ఓడిన సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జంట 3–6, 6–3, 9–11తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)– క్లెపాక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తన కెరీర్లో ఫెడరర్ ప్రత్యర్థికి ఓ సెట్‌ను 0–6తో కోల్పోవడం ఇది ఐదోసారి మాత్రమే. గతంలో విన్సెంట్ స్పాడియా (1999లో మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ), ప్యాట్రిక్ రాఫ్టర్ (1999లో ఫ్రెంచ్ ఓపెన్), బైరన్ బ్లాక్ (1999లో క్వీన్స్ క్లబ్ టోర్నీ), నాదల్ (2008లో ఫ్రెంచ్ ఓపెన్) మాత్రమే ఫెడరర్‌ను ఓ సెట్లో 6–0తో ఓడించారు. గ్రాస్‌కోర్టులపై ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన నాలుగో ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్. గతంలో కఫెల్నికోవ్ (వింబుల్డన్ –2000), అన్చిచ్ (వింబుల్డ¯Œ –2002), ఆండీ ముర్రే (లండన్ ఒలింపిక్స్–2012) ఈ ఘనత సాధించారు. -
ఇటు జొకోవిచ్... అటు బార్టీ
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) దూసుకుపోతున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 12వసారి జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 6–4, 6–2తో గారిన్ (చిలీ)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 4–6, 4–6, 6–0, 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–1, 6–3, 7–5తో ఎనిమిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–3, 6–1తో ఇవాష్క (బెలా రస్)పై, 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–4, 6–3, 5–7, 10–8తో ‘బర్త్‌డే బాయ్’ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై; ఫీలిక్స్ ఉజర్ అలియాసిమ్ (కెనడా) 6–4, 7–6 (8/6), 3–6, 3–6, 6–4తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై... ఆన్స్ జెబర్ (ట్యూనిషియా) 5–7, 6–1, 6–1తో స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచారు. సబలెంకా 6–3, 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై, కెర్బర్ 6–4, 6–4తో కోకో గాఫ్ (అమెరికా)పై, ముకోవా 7–6 (8/6), 6–4తో బదోసా (స్పెయిన్)పై, గోలూబిచ్ 7–6 (7/3), 6–3తో కీస్ (అమెరికా)పై, ప్లిస్కోవా 6–2, 6–3 తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇందులో ముకోవా, కెర్బర్ మినహా మిగతా వారంతా ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్ చేరారు. -
శ్రమించి ముందుకు...
లండన్: తనకెంతో అచ్చొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 18వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 22వసారి ఆడుతోన్న ఫెడరర్‌కు మూడో రౌండ్లో గట్టిపోటీనే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ కామెరాన్ నోరీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల ఫెడరర్ 6–4, 6–4, 5–7, 6–4తో గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో ఫెడరర్ తలపడతాడు. నోరీతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఏడు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచాడు. 48 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ 33 అనవసర తప్పిదాలు చేశాడు. నోరీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు కామెరాన్ నోరీ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తాజా విజయంతో పాంచో గొంజాలెస్ (అమెరికా–41 ఏళ్ల వయసులో; 1969లో), కెన్ రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా–40 ఏళ్ల వయసులో; 1975లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన మూడో పెద్ద వయస్కుడిగా ఫెడరర్ గుర్తింపు పొందాడు. ఆండీ ముర్రే పరాజయం మరోవైపు 2013, 2016 చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) కథ మూడో రౌండ్లో ముగిసింది. పదో సీడ్ షపవలోవ్ (కెనడా) 6–4, 6–4, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ముర్రేను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (3/7), 6–4, 6–3, 7–6 (7/4)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 6–4తో బెడెన్ (స్లొవేనియా)పై గెలిచాడు. కోకో గాఫ్ జోరు మహిళల సింగిల్స్‌లో 20వ సీడ్, అమెరికా టీనేజర్ వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై గెలిచింది. ఇంతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ) 2–6, 6–0, 6–1తో సస్నోవిచ్ (బెలారస్)పై, 14వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/1), 3–6, 7–5తో సెవస్తోవా (లాత్వియా)పై, 19వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–3తో పావ్లుచెంకోవా (రష్యా)పై, పౌలా బదోసా (స్పెయిన్) 5–7, 6–2, 6–4తో లినెట్టి (పోలాండ్)పై గెలిచారు. సానియా జంట ఓటమి మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జోడీ 4–6, 3–6తో కుదెర్మెతోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
గట్టెక్కిన ఫెడరర్.. గాయంతో వైదొలిగిన సెరెనా
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ తొలి రౌండ్లో గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగు సెట్లు ముగిసి, ఐదో సెట్ ప్రారంభమాయ్యక మనారినో గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో ఫెడరర్ విజయం ఖాయమైంది. 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొలి సెట్‌ను 6–4తో గెలిచాడు. అనంతరం మనారినో రెండో సెట్‌ను 7–6 (7/3)తో, మూడో సెట్‌ను 6–3తో నెగ్గి సంచలనం సృష్టించే దిశగా సాగిపోయాడు. అయితే నాలుగో సెట్లో ఫెడరర్ 5–2తో ఆధిక్యంలో ఉన్నదశలో మనారినో కోర్టులో జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. ఎనిమిదో గేమ్‌లో మనారినో సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ నాలుగో సెట్‌ను 6–2తో గెల్చుకున్నాడు. ఐదో సెట్ తొలి గేమ్‌లో తొలి పాయింట్ ముగిశాక మనారినో ఇక ఆడలేనంటూ చైర్ అంపైర్‌కు చెప్పేసి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. గాయంతో వైదొలిగిన సెరెనా అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అలెక్సాండ్రా సస్నోవిచ్ (బెలారస్)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్లో స్కోరు 3–3తో సమంగా ఉన్నదశలో సెరెనా చీలమండ గాయం కారణంగా వైదొలిగింది. కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన సెరెనా వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
Stefanos Tsitsipas: సిట్సి‘పాస్’ కాలేదు
లండన్: మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్ యువ టెన్నిస్ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–3తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్‌ను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో టాప్–5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 15 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–2, 6–2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా 25 ఏస్‌లు సంధించాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–4, 6–1, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గాడు. స్లోన్ స్టీఫెన్స్ సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 6–4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–0, 6–1తో ఫియోనా (ఫ్రాన్స్) పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–4తో సు వె సెయి (చైనీస్ తైపీ)పై, 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో స్వాన్ (బ్రిటన్)పై గెలిచారు. -
ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 7–5, 6–2, 7–6 (7/4)తో లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–3, 6–2తో సోంగా (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–4తో జులియా జార్జెస్ (జర్మనీ)పై, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–1తో హరియెట్ డార్ట్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. -
సంచలనం అంటే ఇదే కదా!
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో తొలి రోజే సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), పదో సీడ్ సబలెంకా (బెలారస్), 16వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఐదుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. వింబుల్డన్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన పిన్న వయస్కు రాలిగా చరిత్ర సృష్టించిన అమెరికా టీనేజర్, 15 ఏళ్ల కోరి గాఫ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ కెరీర్‌ను చిరస్మరణీయ విజయంతో మొదలుపెట్టింది. 39 ఏళ్ల వీనస్ విలియమ్స్‌తో జరిగిన తొలి రౌండ్లో కోరి గాఫ్ 6–4, 6–4తో గెలుపొంది అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో 1991 తర్వాత వింబుల్డన్‌లో తొలి రౌండ్ మ్యాచ్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కోరి గాఫ్ గుర్తింపు పొందింది. 2004 మార్చి 13న కోరి గాఫ్ జన్మించే సమయానికి వీనస్ అప్పటికే రెండుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్‌ను, రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ యులియా పుతింత్సెవా (కజకిస్తాన్) 7–6 (7/4), 6–2తో ఒసాకాపై, రిబరికోవా (స్లొవేకియా) 6–2, 6–4తో సబలెంకాపై, బ్రింగిల్ (అమెరికా) 6–4, 6–4తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ వొండ్రుసోవాపై సంచలన విజయాలు సాధించారు. #NoTeLoPierdas ¡Cori Gauff, de 15 años, eliminó a Venus Williams de Wimbledon! 😮🎾 Es la tenista más joven en llegar a un cuadro final tras pasar la previa, y desde este lunes la verdugo de la pentacampeona de Grand Slam. 👉https://t.co/kPgdLN537gpic.twitter.com/a2I8QgJNVj — ADN Informativo Qro (@ADNQro) July 1, 2019 జొకోవిచ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. జ్వెరెవ్ 6–4, 3–6, 2–6, 5–7తో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్) చేతిలో... సిట్సిపాస్ 4–6, 6–3, 4–6, 7–6 (10/8), 3–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 7–5, 6–3తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై నెగ్గాడు. భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–7 (1/7), 4–6, 2–6తో 15వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. -
వింబుల్డన్‌కు వేళాయె...
లండన్ : ఇప్పటికే క్రికెట్ ప్రపంచకప్ కిక్‌లో ఉన్న క్రీడాభిమానులకు నేటి నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక గ్రాస్ కోర్టు సమరం వింబుల్డన్ టోర్నమెంట్ మరింత వినోదాన్ని పంచనుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇటీవల జరిగిన హాలె ఓపెన్‌ను రికార్డుస్థాయిలో పదోసారి గెలిచిన రోజర్ ఫెడరర్ తన కెరీర్లో తొమ్మిదో వింబుల్డన్ టైటిల్‌పై కన్నేశాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురవ్వడంతో అతను రెండో రౌండ్ నుంచే బలమైన ప్రత్యర్థులతో పోటీ పడాల్సి ఉంది. సోమవారం జరిగే తొలి రౌండ్లో ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)తో జొకోవిచ్ తలపడతాడు. తనస్థాయికి తగ్గట్టు ఆడితే జొకోవిచ్ ఫైనల్ చేరుకునే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ఫెడరర్, నాదల్‌లలో ఒకరు ఫైనల్ బెర్త్ దక్కించుకోవచ్చు. మంగళవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్ యుచి సుగిటా (జపాన్)తో నాదల్... లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో ఫెడరర్ పోటీపడతారు. జొకోవిచ్, ఫెడరర్, నాదల్‌లతో పాటు అండర్సన్ (దక్షిణాఫ్రికా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), వావ్రింకా (స్విట్జర్లాండ్), సిట్సిపాస్ (గ్రీస్), సిలిచ్ (క్రొయేషియా) కూడా సంచలన ఫలితాలు సాధించే సత్తా ఉన్నవారే. మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్స్ కనిపించడం లేదు. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, కొత్త ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తోపాటు మాజీ చాంపియన్స్ సెరెనా, వీనస్ (అమెరికా), కెర్బర్ (జర్మనీ), క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్), సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. ప్రజ్నేశ్‌కు క్లిష్టం భారత్ తరఫున పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఒక్కడే ఉన్నాడు. సోమ వారం జరిగే తొలి రౌండ్లో అతను 2016 రన్నరప్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ఆడతాడు. విజేతకు రూ. 20 కోట్లు ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 23 లక్షల 50 వేల పౌండ్ల (రూ. 20 కోట్ల 57 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తాయి. రన్నరప్‌గా నిలిచిన వారు 11 లక్షల 75 వేల పౌండ్ల చొప్పున (రూ. 10 కోట్ల 28 లక్షలు) అందుకుంటారు. తొలి రౌండ్లో ఓడిన వారికి 45 వేల పౌండ్ల (రూ. 39 లక్షల 40 వేలు) చొప్పున లభిస్తాయి. 12–12 వద్ద టైబ్రేక్... సింగిల్స్‌లో చివరి సెట్లో టైబ్రేక్ లేనికారణం గా గతంలో వింబుల్డన్‌లో ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది నుంచి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో చివరి సెట్లో తొలిసారి టైబ్రేక్‌ను ్రçపవేశపెట్టారు. స్కోరు 12–12 వద్ద రాగానే టై బ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈసారి కొత్తగా నంబర్‌వన్ కోర్టుకు కూడా పైకప్పును ఏర్పాటు చేశారు. -
రామ్‌కుమార్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేయగా... సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్లో తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ 4–6, 6–4, 5–7తో గిలెర్మో లోపెజ్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. లాకోతో జరిగిన మ్యాచ్‌లో రామ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 24 విన్నర్లు కొట్టిన ఈ చెన్నై ప్లేయర్ కేవలం పది అనవసర తప్పిదాలు చేశాడు. లోపెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 15 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 43 విన్నర్స్ కొట్టిన సాకేత్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
ముర్రే కథ ముగిసింది
►క్వార్టర్ ఫైనల్లో సామ్ క్వెరీ చేతిలో పరాజయం ►రావ్నిచ్ను చిత్తు చేసి సెమీస్‌లోకి ఫెడరర్ ►గాయంతో జొకోవిచ్ నిష్క్రమణ లండన్: డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 3–6, 6–4, 6–7 (4/7), 6–1, 6–1తో ముర్రేను ఓడించాడు. 42వ ప్రయత్నంలో ఈ అమెరికా అజానుబాహుడు తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. అంతేకాకుండా 2009లో ఆండీ రాడిక్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన అమెరికా క్రీడాకారుడిగానూ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 3–6, 7–6 (8/6), 7–5, 5–7, 6–1తో 16వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)ను ఓడించాడు. ఫెడరర్ ఫటాఫట్... పురుషుల సింగిల్స్ మరో క్వార్టర్ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–4, 6–2, 7–6 (7/4)తో ఆరో సీడ్ రావ్‌నిచ్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో గతేడాది ఇదే టోర్నీ సెమీస్‌లో రావ్‌నిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ఫెడరర్ బదులు తీర్చుకున్నాడు. ఫెడరర్ తన కెరీర్లో 42వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం విశేషం. థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ తొలి సెట్‌ను 6–7 (2/7) కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగాడు. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సిలిచ్‌తో సామ్ క్వెరీ; బెర్డిచ్‌తో ఫెడరర్ తలపడతారు.మిక్స్డ్ డబుల్స్ విభాగం మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7–6 (7/5), 6–2తో మెక్టిక్–అనా కొంజూ (క్రొయేషియా) జోడీపై నెగ్గగా... సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం 6–7 (4/7), 4–6తో కొంటినెన్ (ఫిన్లాండ్)–హీతెర్ వాట్సన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఎదురులేని జొకోవిచ్
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి అరుదైన రికార్డు సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ డిఫెండింగ్ చాంపియన్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం సెంటర్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-3, 7-6 (7/5)తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. జొకోవిచ్‌కిది వరుసగా 30వ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయం కావడం విశేషం. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా చేతిలో ఓటమి తర్వాత జొకోవిచ్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో అజేయంగా నిలిచి టైటిల్స్ సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో కూడా చాంపియన్‌గా నిలిచాడు. గత రెండేళ్లలో వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఈసారీ నెగ్గితే ‘హ్యాట్రిక్’ సాధిస్తాడు. దాంతోపాటు 1938లో డాన్బడ్జ్ (అమెరికా) తర్వాత వరుసగా ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. మూడో రౌండ్లో 28వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) లేదా థామస్ బెలూచి (బ్రెజిల్)లతో జొకోవిచ్ తలపడతాడు. మనారినోతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 15 సార్లు నెట్ వద్దకు వచ్చి 10 సార్లు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో ఫెడరర్ 6-0, 6-3, 6-4తో క్వాలిఫయర్, ప్రపంచ 772వ ర్యాంకర్ మార్కస్ విలిస్ (బ్రిటన్)పై గెలిచాడు. పదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 19వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 6-2, 6-1తో కొజ్లోవా (ఉక్రెయిన్)ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. వర్షం కారణంగా మూడో రోజూ వింబుల్డన్ మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. సెంటర్ కోర్టులో మాత్రం పైకప్పును మూయించి మ్యాచ్‌లను నిర్వహించారు. -
ముర్రే, సెరెనా సాఫీగా...
* తొలి రౌండ్లో అలవోక విజయాలు * వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: టైటిల్ నిలబెట్టుకొని ‘రికార్డు’ సాధించాలనే లక్ష్యంతో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరెనా 6-2, 6-4తో క్వాలిఫయర్ అమ్రా సాడికోవిచ్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించిఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. రెండో రౌండ్లో అమెరికాకే చెందిన క్రిస్టినా మెక్హాలెతో సెరెనా ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 5-7, 6-3తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7-5, 6-3తో మిర్యానా లూసిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ముర్రే (బ్రిటన్) 6-2, 6-3, 6-4తో తన దేశానికే చెందిన లియామ్ బ్రాడీపై గెలుపొందాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/4), 1-6, 6-7 (2/7), 6-4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, ఏడో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-3తో బెడెన్ (బ్రిటన్)పై, 12వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 7-6 (7/5), 6-4తో సెర్వాన్టెస్ (స్పెయిన్)పై, సోమవారం ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 7-6 (7/3), 6-3తో గిడో పెల్లా (అర్జెంటీనా)పై కష్టపడి గెలిచాడు. -
షరపోవా సెరెనా షో
-
షరపోవా సెరెనా షో
ఇక సెమీస్‌లో అమీతుమీ - ముగురుజా సంచలనం - వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడిన మరియా షరపోవా (రష్యా), సెరెనా విలియమ్స్ (అమెరికా) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ షరపోవా 6-3, 6-7 (3/7), 6-2తో అన్‌సీడెడ్ కోకో వాండెవెగె (అమెరికా)పై... టాప్ సీడ్ సెరెనా 3-6, 6-2, 6-3తో 23వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచి సెమీస్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. రెండు క్వార్టర్స్‌లోనూ షరపోవా, సెరెనా నిర్ణాయక మూడో సెట్లో తమ అసలు సిసలు ఆటతీరును కనబరిచారు. వాండెవెగెతో 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌ను షరపోవా రెండో సెట్లోనే ముగించాల్సింది. అయితే క్వార్టర్స్ చేరే క్రమంలో ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను (6వ సీడ్ సఫరోవా, 22వ సీడ్ సమంతా స్టోసుర్, 11వ సీడ్ ప్లిస్కోవా) ఓడించిన వాండెవెగె అద్భుత పోరాటంతో పుంజుకుంది. రెండో సెట్లో 5-4తో ఆధిక్యంలో ఉన్న షరపోవా పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెటుకోవాల్సిన పరిస్థితిలో కోల్పోయింది. దాంతో స్కోరు 5-5తో సమమైంది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. టైబ్రేక్‌లో షరపోవా 3-0తో ముందంజ వేసినా... ఆ తర్వాత వాండెవెగె చెలరేగి వరుసగా ఏడు పాయింట్లను సాధించి రెండో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో ఈ అమెరికా యువతార ప్రదర్శన చూశాక మరో సంచలనం నమోదవుతుందా అనే అనుమానం కలిగింది. అయితే కెరీర్లో 48వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న షరపోవా తన అనుభవాన్నంతా ఉపయోగించి నిర్ణాయక మూడో సెట్లో కోలుకుంది. ఆరంభంలోనే వాండెవెగె సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ మాజీ చాంపియన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ రష్యా భామ 10 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. 2011 తర్వాత షరపోవా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. అజరెంకాతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్‌ను కోల్పోయినా... నిరుత్సాహ పడకుండా తర్వాతి రెండు సెట్లను నెగ్గి 2012 తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది. మరోవైపు 20వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7-5, 6-3తో టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై నెగ్గి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా 1997లో అరంటా శాంచెజ్ తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. సెమీస్‌లో 13వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో ముగురుజా ఆడుతుంది. క్వార్టర్స్‌లో రద్వాన్‌స్కా 7-6 (7/3), 3-6, 6-3తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది.