లండన్: కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) దూసుకుపోతున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 12వసారి జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 6–4, 6–2తో గారిన్ (చిలీ)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 4–6, 4–6, 6–0, 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–1, 6–3, 7–5తో ఎనిమిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–3, 6–1తో ఇవాష్క (బెలా రస్)పై, 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–4, 6–3, 5–7, 10–8తో ‘బర్త్‌డే బాయ్’ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై; ఫీలిక్స్ ఉజర్ అలియాసిమ్ (కెనడా) 6–4, 7–6 (8/6), 3–6, 3–6, 6–4తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై... ఆన్స్ జెబర్ (ట్యూనిషియా) 5–7, 6–1, 6–1తో స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచారు. సబలెంకా 6–3, 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై, కెర్బర్ 6–4, 6–4తో కోకో గాఫ్ (అమెరికా)పై, ముకోవా 7–6 (8/6), 6–4తో బదోసా (స్పెయిన్)పై, గోలూబిచ్ 7–6 (7/3), 6–3తో కీస్ (అమెరికా)పై, ప్లిస్కోవా 6–2, 6–3 తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇందులో ముకోవా, కెర్బర్ మినహా మిగతా వారంతా ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్ చేరారు.
ఇటు జొకోవిచ్... అటు బార్టీ
Published Tue, Jul 6 2021 5:25 AM | Last Updated on Tue, Jul 6 2021 5:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment