25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి
నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్‌కు ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్‌లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్‌లో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment