టీ20 వరల్డ్‌కప్ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ స్టయిల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ పిచ్‌పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సైతం గ్రాండ్‌స్లామ్ విజయానంతరం ఇలాగే చేస్తాడు.
జకో.. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ చేసుకున్న జకో స్టయిల్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్ తమ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో జకోవిచ్, రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి.. GOATs eating grass అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Wimbledon's Facebook post - GOATs eating grass.
Rohit Sharma 🤝 Novak Djokovic. pic.twitter.com/jrkCPBi7PX— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2024
కాగా, నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది.
వరల్డ్‌కప్ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్‌కప్ ఇది. 2011లో భారత్..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్‌కప్ సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌కు అందించాడు.
ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..
భారత్ 176/7
సౌతాఫ్రికా 169/8
7 పరుగుల తేడాతో భారత్ విజయం
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్- జస్ప్రీత్ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు)
Comments
Please login to add a commentAdd a comment