third Grand Slam
-
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్‌పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్‌కు ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు. -
Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ నేడు ప్రారంభంకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సోమవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో కొరియా ప్లేయర్ సూన్‌వూ క్వాన్‌తో ఆడనున్నాడు. ఈ సీజన్లో తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన స్పెయిన్ స్టార్ నాదల్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. అయితే నాదల్కు ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ నుంచి అసలు సవాలు ఎదురుకానుంది ‘డ్రా’ ప్రకారం వీరిద్దరు ఫైనల్లో తలపడే అవకాశముంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత ఈ టోర్నీతో పునరాగమనం చేయనుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే వైదొలిగింది. అనంతరం ఆమె సింగిల్స్ విభాగంలో ఏ టోర్నీలోనూ ఆడలేదు. -
ఇంకొక్క అడుగే...
♦ టైటిల్‌కు విజయం దూరంలో సానియా-హింగిస్ జంట ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం మెల్బోర్న్: జతగా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించే దిశగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ మరో అడుగు ముందుకేశారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జోడీగా మహిళల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన వీరిద్దరు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జంటను చిత్తుగా ఓడించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మొత్తానికి సానియా-హింగిస్‌లకిది వరుసగా 35వ విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటతో ఈ ఇండో-స్విస్ ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో హలవకోవా-హర్డెకా 3-6, 6-3, 6-1తో యి ఫాన్ జు-సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)లపై గెలిచారు. బోపన్న జంటకు నిరాశ మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. అన్‌సీడెడ్ జంట ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)-ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్) ద్వయం 6-2, 7-5తో మూడో సీడ్ బోపన్న-జాన్ చాన్ జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముగిసిన ప్రాంజల పోరాటం జూనియర్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, కర్మాన్ కౌర్ థండి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. పదో సీడ్ ప్రాంజల 5-7, 5-7తో ఎనిమిదో సీడ్ అనస్తాసియా పొటపోవా (రష్యా) చేతిలో; కర్మాన్ కౌర్ 6-3, 5-7, 5-7తో సారా టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-కర్మాన్ జంట 6-7 (3/7), 5-7తో మాడిఇంగ్లిస్-జైమీ జోడీ చేతిలో ఓడారు.