లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ నేడు ప్రారంభంకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సోమవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో కొరియా ప్లేయర్ సూన్‌వూ క్వాన్‌తో ఆడనున్నాడు. ఈ సీజన్‌లో తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన స్పెయిన్ స్టార్ నాదల్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు.
అయితే నాదల్‌కు ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ నుంచి అసలు సవాలు ఎదురుకానుంది ‘డ్రా’ ప్రకారం వీరిద్దరు ఫైనల్లో తలపడే అవకాశముంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత ఈ టోర్నీతో పునరాగమనం చేయనుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో సెరెనా తొలి రౌండ్‌లోనే వైదొలిగింది. అనంతరం ఆమె సింగిల్స్ విభాగంలో ఏ టోర్నీలోనూ ఆడలేదు.
Comments
Please login to add a commentAdd a comment