womens signals
-
తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఓటమి
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జర్మనీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 19–21, 21–19, 21–16తో లీ యాంగ్–లు చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
ఇటు జొకోవిచ్... అటు బార్టీ
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) దూసుకుపోతున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 12వసారి జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 6–4, 6–2తో గారిన్ (చిలీ)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 4–6, 4–6, 6–0, 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–1, 6–3, 7–5తో ఎనిమిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–3, 6–1తో ఇవాష్క (బెలా రస్)పై, 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–4, 6–3, 5–7, 10–8తో ‘బర్త్‌డే బాయ్’ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై; ఫీలిక్స్ ఉజర్ అలియాసిమ్ (కెనడా) 6–4, 7–6 (8/6), 3–6, 3–6, 6–4తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై... ఆన్స్ జెబర్ (ట్యూనిషియా) 5–7, 6–1, 6–1తో స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచారు. సబలెంకా 6–3, 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై, కెర్బర్ 6–4, 6–4తో కోకో గాఫ్ (అమెరికా)పై, ముకోవా 7–6 (8/6), 6–4తో బదోసా (స్పెయిన్)పై, గోలూబిచ్ 7–6 (7/3), 6–3తో కీస్ (అమెరికా)పై, ప్లిస్కోవా 6–2, 6–3 తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇందులో ముకోవా, కెర్బర్ మినహా మిగతా వారంతా ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్ చేరారు. -
ఫైనల్లో సింధు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మిం టన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-13, 18-21, 21-19తో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి లీ మిచెల్లితో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. కెరీర్లో వీరిద్దరూ ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. రెండో సెమీఫైనల్లో ఏడో సీడ్ లీ మిచెల్లి 21-15, 21-16తో ఐదో సీడ్ పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)ను ఓడించింది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సింధుకు ఇటీవల జరిగిన నాలుగు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో (జపాన్, డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్) నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. అయితే గత వైఫల్యాలను మరిపిస్తూ మకావు ఓపెన్‌లో మాత్రం సింధు నిలకడగా రాణిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కిన్ జిన్జింగ్తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయికి గట్టిపోటీనే లభించింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌ల ద్వారా 21 పాయింట్లు, నెట్‌వద్ద 8 పాయింట్లు సంపాదించింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇరువురితో ఆధిక్యం దోబూచులాడింది. ఒక దశలో సింధు 14-16తో వెనుకబడినా వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 17-16తో ముందంజ వేసింది. ఆ తర్వాత కీలకదశలో సింధు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.