ముర్రే, సెరెనా సాఫీగా... | Serena Williams, Andy Murray headline Day 2 at Wimbledon | Sakshi
Sakshi News home page

ముర్రే, సెరెనా సాఫీగా...

Published Wed, Jun 29 2016 12:13 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

ముర్రే, సెరెనా సాఫీగా... - Sakshi

ముర్రే, సెరెనా సాఫీగా...

* తొలి రౌండ్‌లో అలవోక విజయాలు
* వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ

లండన్: టైటిల్ నిలబెట్టుకొని ‘రికార్డు’ సాధించాలనే లక్ష్యంతో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరెనా 6-2, 6-4తో క్వాలిఫయర్ అమ్రా సాడికోవిచ్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించిఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం.  

రెండో రౌండ్‌లో అమెరికాకే చెందిన క్రిస్టినా మెక్‌హాలెతో సెరెనా ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 5-7, 6-3తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7-5, 6-3తో మిర్యానా లూసిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు.
 మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ముర్రే (బ్రిటన్) 6-2, 6-3, 6-4తో తన దేశానికే చెందిన లియామ్ బ్రాడీపై గెలుపొందాడు.

పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/4), 1-6, 6-7 (2/7), 6-4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, ఏడో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-3తో బెడెన్ (బ్రిటన్)పై, 12వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 7-6 (7/5), 6-4తో సెర్వాన్‌టెస్ (స్పెయిన్)పై, సోమవారం ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 7-6 (7/3), 6-3తో గిడో పెల్లా (అర్జెంటీనా)పై కష్టపడి గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement