Murray
-
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ కన్నుమూత
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెల్లింగ్టన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. 1969లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ తమ మొట్టమొదటి టెస్టు విజయంలో ముర్రే కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను 90 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 1968లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముర్రే.. న్యూజిలాండ్ తరపున 13 టెస్టులు ఆడారు. ఈ 13 మ్యాచ్‌ల్లో 29.9 సగటుతో 598 పరుగులు సాధించాడు. అతడు కెరీర్లో 5 హాఫ్‌సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఫస్ట్ క్లాస్ కెరీర్లో వెల్లింగ్టన్ తరపున 102 మ్యాచ్‌లు ఆడిన ముర్రే 6257 పరుగులు సాధించాడు. ఇక బ్రూస్ ముర్రే మనవరాళ్లు అమేలియా కెర్, జెస్ కెర్ ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళ జట్టులో కీలక సభ్యలుగా ఉన్నారు. చదవండి: లంకతో తొలి వన్డే.. సూపర్ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి -
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కన్నుమూత..
వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ డేవిడ్ ముర్రే(72) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముర్రే శనివారం బ్రిడ్జ్‌టౌన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కరీబియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన వికెట్ కీపర్లలో ముర్రే ఒకరు. అయితే మత్తు పదార్థాలకు బానిస కావడంతో ముర్రే క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలను ముర్రే ఎదుర్కొన్నారు. దీంతో అతను సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టులో ముర్రేకు అవకాశం దక్కలేదు. ఇక వెస్టిండీస్ తరపున 19 టెస్టులు ఆడిన ముర్రే 601 పరుగులు సాధించారు. అదే విధంగా అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. చదవండి: NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు -
రెండున్నరేళ్ల తర్వాత...
యాంట్‌వర్ప్ (బెల్జియం): ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన యూరోపియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 243వ ర్యాంకర్ ముర్రే 3–6, 6–4, 6–4తో ప్రపంచ 18వ ర్యాంకర్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేత ముర్రేకు 1,09,590 యూరోలు (రూ. 87 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వావ్రింకాతో ఫైనల్లో తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో 1–3తో వెనుకబడిన ముర్రే ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 2017 మార్చిలో దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించాక ముర్రే ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న ముర్రే ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆగస్టులో సిన్సినాటి మాస్టర్స్ టోరీ్నతో పునరాగమనం చేశాక మరో ఐదు టోర్నీల్లో పాల్గొన్న అతను ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అయితే యూరోపియన్ ఓపెన్‌లో అతను ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచాడు. -
‘నీకున్న విజ్ఞత.. పెద్దలకు కూడా లేదు’
వాషింగ్టన్: ఆడవారి టాపిక్ వస్తే చాలు.. మనలో చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడటం చాలా గొప్పగా ఫీలవుతుంటారు. అలాంటివారు ఈ చిన్నారిని చూసి బుద్థి తెచ్చుకోవాలి. వయసులో చిన్నదే కావచ్చు కానీ ఆలోచనలో మాత్రం చాలా మంది ‘పెద్ద’లకంటే ఎన్నో రెట్లు పెద్దది. అందుకే ఈ చిన్నారి చేసిన పని ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకు ఎవరా చిన్నారి.. ఏమా పని.. ఆ వివరాలు.. రిథమ్ పచేకో అనే పదేళ్ల చిన్నారి ముర్రేలోని గ్రాంట్ ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పచేకో మ్యాథ్య్ టీచర్ హోం వర్క్‌లో ఓ లెక్క ఇచ్చింది. ఓ పట్టికలో నలుగురు నాల్గవ తరగతి విద్యార్థినిల బరువులు ఇచ్చి వారిలో తక్కువ బరువున్న విద్యార్థిని కంటే ఇసాబెల్ ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమంది. అయితే ఈ లెక్క పచేకోకు నచ్చలేదు. దాంతో వర్క్‌బుక్ మీద తాను ఈ లెక్కను చేయలేనని తెలపడమే కాక అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. పచేకో తన నోట్స్‌లో ‘ఏంటిది.. ఇది వారిని చాలా బాధపెడుతుంది. నేను ఇంత కఠినంగా ఉండాలనుకోవడం లేదు. ఈ లెక్కను నేను చేయడం లేదు. మీరిచ్చిన సమస్య చాలా బాగుంది. కానీ ఓ మనిషి మిగతా వారి కంటే ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమనడం నాకు నచ్చలేదు. అందుకే మీరిచ్చిన హోం వర్క్‌ను నేను చేయడం లేదు’ అని తెలిపింది. పచేకో మ్యాథ్స్ టీచర్ కూడా ఆ చిన్నారి చూపిన విజ్ఞతకు సంతోషించింది. వెంటనే దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నెటిజన్లు కూడా పచేకో చేసిన పనిని అభినందిస్తున్నారు. అంతేకాక ఇలాంటి తలకు మాసిన సిలబస్‌ను తయారు చేసిన అధికారులను విమర్శిస్తున్నారు. పచేకో తల్లిదండ్రులు దీనిపై స్పందిస్తూ.. ‘మా కూతురు చేసిన పనికి మేం ఎంతో గర్విస్తున్నాం. ఇంత చిన్న వయసులోనే తాను ఎంతో విజ్ఞతను చూపింది. ఏది మంచో దాని వైపే తాను నిలబడింది. చాలా సున్నితమైన అంశంపై నా కుమార్తె మరింత సున్నితంగా స్పందించింది. తన పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని తెలిపారు. -
రెండో రౌండ్లోనే ముర్రే ఔట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఆట ముగిసింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్) 7–5, 2–6, 6–4, 6–4తో ముర్రేను చిత్తు చేశాడు. గాయంనుంచి కోలుకొని గత ఏడాది వింబుల్డన్ తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న ముర్రే తన స్థాయికి తగిన ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు. మరో వైపు 2016 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో అతను 7–6 (5), 4–6, 6–3, 7–5తో యుగో హంబర్ట్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల విభాగంలో ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ (అమెరికా) అలవోకగా మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో ఆమె 6–2, 6–2తో కరీనా వితాఫ్ట్ (జర్మనీ)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–4, 7–5తో కామిలా గియార్గీ (ఇటలీ)ని ఓడించి ముందంజ వేసింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో అక్కాచెల్లెళ్లు వీనస్, సెరెనా ప్రత్యర్థులుగా తలపడనుండటం విశేషం. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో స్లోన్ 4–6, 7–5, 6–2తో అన్హెలినా కలీనియా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. -
ముర్రేకు తొలిసారి టాప్ సీడింగ్
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బ్రిటన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రేకు తొలిసారి టాప్ సీడింగ్ లభించింది. జూలై 3న మొదలయ్యే ఈ టోర్నీకి సంబం ధించిన పురుషుల సింగిల్స్ సీడింగ్స్ వివరాలను బుధవారం ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ముర్రేకు సెమీఫైనల్ వరకు రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాలుగో సీడ్ నాదల్ (స్పెయిన్) ఎదురయ్యే అవకాశం లేదు. -
ఆ నలుగురిలో నం.1 ఒక్కడే!
ముర్రే, ఫెదరర్, నాదల్ ఔట్ టొరంటో: కెనడా మేజర్ ఈవెంట్ నుంచి టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే వింబుల్డన్ ఛాంపియన్ ముర్రే ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రకటించగా, అదే బాటలో రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ నడుస్తున్నారు. గాయంగా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి దూరమైనప్పటి నుంచి నాదల్ ఏ టోర్నీల్లో పాల్గొనలేదు. మణికట్టు గాయం నుంచీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికే రెండు సార్లు టొరంటో మాస్టర్స్ టైటిల్ నెగ్గిన స్విస్ దిగ్గజం రోజర్ కూడా టోర్నీలో పాల్గొనడం లేదని మంగళవారం ప్రకటించాడు. టెన్నిస్ చతుష్టయంలో ఒకడైన నొవాక్ జొకోవిచ్ ఒక్కడే ఈ మేజర్ ఈవెంట్లో పాల్గొనున్నాడు. ఇటీవల జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా, మూడో రౌండ్లో అమెరికా ఆటగాడు సామ్ కెర్రీ చేతిలో ఓటమితో ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. టోర్నీ ఏదైనా సరే ఈ నలుగురి గురించే చర్చ. ప్రస్తుతం ఫెదరర్, నాదల్, ముర్రే టొరంటో మాస్టర్స్ నుంచి తప్పుకోవడంతో ఆ నలుగురిలో ఒకడైన సెర్బియా యోధుడు, ప్రపంచ నంబర్ వన్ జొకోను టైటిల్ ఫెవరెట్ అని భావించవచ్చు. -
ముగురుజాకు షాక్
* వింబుల్డన్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం * అన్‌సీడెడ్ సెపలోవా చేతిలో ఓటమి * మూడోరౌండ్లో ముర్రే, నిషికోరి, రావోనిక్ లండన్: గత మూడు రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్‌లో నాలుగో రోజు పెను సంచలనం నమోదైంది. ఫ్రెంచ్ ఓపెన్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 127వ ర్యాంకర్ జానా సెపలోవా (స్లొవేకియా) 6-3, 6-2తో రెండోసీడ్ ముగురుజాపై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెపలోవా సర్వీస్‌లో చెలరేగిపోయింది. బలమైన ఫోర్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో స్పెయిన్ ప్లేయర్ ఆట కట్టించింది. తొలిసెట్ రెండో గేమ్‌లోనే సర్వీస్‌ను కోల్పోవడం ముగురుజాపై ప్రభావం చూపింది. నాలుగు, ఏడు, ఎనిమిది గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. ఇక రెండో సెట్లో సెపలోవా మరింత జోరు చూపెట్టింది. రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నాలుగు గేమ్‌ల్లో ముగురుజా రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్నా... ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఓవరాల్‌గా ముగురుజా మ్యాచ్ మొత్తంలో 22సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-1, 6-4తో లెప్చెంకో (అమెరికా)పై; 5వ సీడ్ హలెప్ (రొమేనియా) 6-1, 6-1తో షియావోన్ (ఇటలీ)పై; 8వ సీడ్ వీనస్ (అమెరికా) 7-5, 4-6, 6-3తో మరియా సక్కారి (గ్రీక్)పై; 9వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-4, 4-6, 6-3తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై; 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో కుమ్కుమ్ (థాయ్‌లాండ్)పై; 12వ సీడ్ నవారో (స్విట్జర్లాండ్) 3-6, 6-2, 6-1తో అలెర్టోవా (చెక్)పై; లిసికి (జర్మనీ) 6-4, 6-2తో 14వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. బొసెరుప్ (అమెరికా) 6-4, 1-0 ఉన్న దశలో ఏడోసీడ్ బెనిసిచ్ (స్విట్జర్లాండ్) మ్యాచ్ నుంచి వైదొలిగింది. ముర్రే జోరు... పురుషుల సింగిల్స్‌లో రెండోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) జోరు కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్లో 6-3, 6-2, 6-1తో యెన్ సున్ లూ (తైపీ)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-4, 6-4, 6-2తో బెన్నెట్ (ఫ్రాన్స్)పై; 6వ సీడ్ రావోనిక్ (కెనడా) 7-6 (5), 6-4, 6-2తో సెప్పీ (ఇటలీ)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-7 (6), 6-4, 6-4తో స్టాకోవోస్కీ (ఉక్రెయిన్)పై; 11వ సీడ్ గోఫిన్ (బెల్జియం) 6-4, 6-0, 6-3తో రోజెర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై; మహుట్ (ఫ్రాన్స్) 6-1, 6-4, 6-3తో 13వ సీడ్ ఫెరర్ (స్పెయిన్)పై; దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 7-6 (1), 4-6, 6-4తో 16వ సీడ్ సిమోన్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 14వ సీడ్ అగుట్ (స్పెయిన్)కు... కుష్కిన్ (కజకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. -
ముర్రే, సెరెనా సాఫీగా...
* తొలి రౌండ్లో అలవోక విజయాలు * వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: టైటిల్ నిలబెట్టుకొని ‘రికార్డు’ సాధించాలనే లక్ష్యంతో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరెనా 6-2, 6-4తో క్వాలిఫయర్ అమ్రా సాడికోవిచ్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించిఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. రెండో రౌండ్లో అమెరికాకే చెందిన క్రిస్టినా మెక్హాలెతో సెరెనా ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 5-7, 6-3తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7-5, 6-3తో మిర్యానా లూసిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ముర్రే (బ్రిటన్) 6-2, 6-3, 6-4తో తన దేశానికే చెందిన లియామ్ బ్రాడీపై గెలుపొందాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/4), 1-6, 6-7 (2/7), 6-4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, ఏడో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-3తో బెడెన్ (బ్రిటన్)పై, 12వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 7-6 (7/5), 6-4తో సెర్వాన్టెస్ (స్పెయిన్)పై, సోమవారం ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 7-6 (7/3), 6-3తో గిడో పెల్లా (అర్జెంటీనా)పై కష్టపడి గెలిచాడు. -
హోరాహోరీగా రెండో సెమీస్
♦ ఆధిక్యంలో జొకోవిచ్ ♦ మ్యాచ్ నేటికి వాయిదా వావ్రింకా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో శనివారమే తేలనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ వెలుతురు మందగించిన కారణంగా నేటికి వాయిదా పడింది. అప్పటికి జొకోవిచ్ తొలి రెండు సెట్లను 6-3, 6-3తో సొంతం చేసుకోగా... మూడో సెట్‌ను ముర్రే 7-5తో నెగ్గాడు. నాలుగో సెట్లో ఇద్దరూ 3-3తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌ను కొనసాగించేందుకు తగినంత వెలుతురు లేకపోవడంతో నిర్వాహకులు ఆటను నిలిపి వేశారు. శనివారం ఇదే స్కోరు నుంచి మ్యాచ్‌ను కొనసాగిస్తారు. సెమీఫైనల్‌కు చేరే క్రమంలో తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు నెగ్గి మరోసారి మ్యాచ్‌ను మూడు సెట్లలో ముగిస్తాడనిపించింది. అయితే మూడో సెట్లో ముర్రే అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 11వ గేమ్‌లో మ్యాచ్‌లోనే తొలిసారి జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయి ప్రమాదం నుంచి గట్టెక్కిన ముర్రే స్కోరును 3-3తో సమం చేశాడు. -
రద్వాన్‌స్కాకు చుక్కెదురు
న్యూయార్క్: సీడెడ్ క్రీడాకారిణులకు ఈసారి యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కలసిరావడంలేదు. ఇప్పటికే టాప్-10 సీడింగ్స్లోని ముగ్గురు క్రీడాకారిణులు సారా ఎరాని, కరోలిన్ వొజ్నియాకి, పెట్రా క్విటోవా మూడో రౌండ్లోపు నిష్ర్కమించగా... నాలుగో రౌండ్లో మరో ముగ్గురు వారి సరసన చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), ఎనిమిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), తొమ్మిదో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) ఓటమి పాలయ్యారు. మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఐదో సీడ్ నా లీ (చైనా) తమ జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో 24వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-4, 6-4తో రద్వాన్స్కాపై; 18వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 4-6, 6-3, 7-6 (7/3)తో కెర్బర్‌పై; నా లీ 6-0, 6-3తో జంకోవిచ్‌పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-4, 6-1తో 15వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కార్లా నవారోతో సెరెనా; మకరోవాతో నా లీ తలపడతారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో కామిలా జియార్జి (ఇటలీ)పై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, ముర్రే పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తోపాటు మాజీ విజేతలు జొకోవిచ్ (సెర్బియా), హెవిట్ (ఆస్ట్రేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో మూడో సీడ్ ముర్రే 7-6 (7/2), 6-2, 6-2తో మాయెర్ (జర్మనీ)పై, టాప్ సీడ్ జొకోవిచ్ 6-0, 6-2, 6-2తో సౌసా (పోర్చుగల్)పై, హెవిట్ 6-3, 7-6 (7/5), 3-6, 6-1తో డాన్స్కాయ్ (రష్యా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బెర్డిచ్ 6-0, 6-3, 6-2తో బెనెట్యూ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-7 (1/7), 7-6 (9/7)తో బగ్ధాటిస్ (సైప్రస్)పై, 21వ సీడ్ యూజ్నీ (రష్యా) 6-3, 6-2, 2-6, 6-3తో 12వ సీడ్ టామీ హాస్ (జర్మనీ)పై. ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్) 6-3, 6-4, 2-6, 3-6, 6-1తో 20వ సీడ్ సెప్పి (ఇటలీ)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-వాసెలిన్ (ఫ్రాన్స్) జోడి 4-6, 4-6తో 12వ సీడ్ ఫ్లెమింగ్-ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడింది