ముర్రేకు తొలిసారి టాప్‌ సీడింగ్‌ | murray gets top seed in wimbledon | Sakshi
Sakshi News home page

ముర్రేకు తొలిసారి టాప్‌ సీడింగ్‌

Published Thu, Jun 29 2017 10:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

ముర్రేకు తొలిసారి టాప్‌ సీడింగ్‌

ముర్రేకు తొలిసారి టాప్‌ సీడింగ్‌

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బ్రిటన్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ ఆండీ ముర్రేకు తొలిసారి టాప్‌ సీడింగ్‌ లభించింది. జూలై 3న మొదలయ్యే ఈ టోర్నీకి సంబం ధించిన పురుషుల సింగిల్స్‌ సీడింగ్స్‌ వివరాలను బుధవారం ప్రకటించారు.

 

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతున్న ముర్రేకు సెమీఫైనల్‌ వరకు రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా), మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), నాలుగో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఎదురయ్యే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement