ఆ నలుగురిలో నం.1 ఒక్కడే! | Djokovic only member of tennis big four part in Toronto | Sakshi
Sakshi News home page

ఆ నలుగురిలో నం.1 ఒక్కడే!

Published Wed, Jul 20 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

ఆ నలుగురిలో నం.1 ఒక్కడే!

ఆ నలుగురిలో నం.1 ఒక్కడే!

ముర్రే, ఫెదరర్, నాదల్ ఔట్
టొరంటో: కెనడా మేజర్ ఈవెంట్ నుంచి టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే వింబుల్డన్ ఛాంపియన్ ముర్రే ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రకటించగా, అదే బాటలో రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ నడుస్తున్నారు. గాయంగా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి దూరమైనప్పటి నుంచి నాదల్ ఏ టోర్నీల్లో పాల్గొనలేదు. మణికట్టు గాయం నుంచీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పాడు.

ఇప్పటికే రెండు సార్లు టొరంటో మాస్టర్స్ టైటిల్ నెగ్గిన స్విస్ దిగ్గజం రోజర్ కూడా టోర్నీలో పాల్గొనడం లేదని మంగళవారం ప్రకటించాడు. టెన్నిస్ చతుష్టయంలో ఒకడైన నొవాక్ జొకోవిచ్ ఒక్కడే ఈ మేజర్ ఈవెంట్లో పాల్గొనున్నాడు. ఇటీవల జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా, మూడో రౌండ్లో అమెరికా ఆటగాడు సామ్ కెర్రీ చేతిలో ఓటమితో ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. టోర్నీ ఏదైనా సరే ఈ నలుగురి గురించే చర్చ. ప్రస్తుతం ఫెదరర్, నాదల్, ముర్రే టొరంటో మాస్టర్స్ నుంచి తప్పుకోవడంతో ఆ నలుగురిలో ఒకడైన సెర్బియా యోధుడు, ప్రపంచ నంబర్ వన్ జొకోను టైటిల్ ఫెవరెట్ అని భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement