Toronto Masters
-
వరల్డ్ నంబర్.1 మళ్లీ ఆపసోపాలు పడి..
టొరంటో: సెర్బియా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ టొరంటో టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థామస్ బెర్డిచ్ పై 7-6(8/6), 6-4 తేడాతో విజయం సాధించి రోజర్స్ కప్ సెమిఫైనల్స్ కు చేరుకున్నాడు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో చివరకు సెర్బియా యోధుడినే విజయం వరించింది. ఈ టోర్నీ తొలి రౌండ్ నుంచీ టాప్ సీడెడ్ ను గెలుపు అంత సులువుగా వరించడం లేదు. బెర్డిచ్ పై 12 వరుస గేమ్ లలో నెగ్గి రికార్డును మెరుగు పరుచుకున్నాడు. టాప్ 5 ఆటగాళ్లతో జరిగిన గత 17 మ్యాచ్ లలో బెర్డిచ్ ఓటమిపాలయ్యాడు. టై బ్రేక్ లో తొలి సెట్ నెగ్గిన జొకోవిచ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తొలి సెట్ ఎలా గెలిచానో తనకే అర్థం కావడం లేదన్నాడు. మరో మ్యాచ్ లో రెండో సీడెడ్ వావ్రింకా, దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్ పై 6-1, 6-3 తేడాతో సులువుగా గెలుపొందాడు. వావ్రింకా తన తదుపరి మ్యాచ్ లో జపాన్ స్టార్ ప్లేయర్ నిషికోరితో తలపడనున్నాడు. -
ఆ నలుగురిలో నం.1 ఒక్కడే!
ముర్రే, ఫెదరర్, నాదల్ ఔట్ టొరంటో: కెనడా మేజర్ ఈవెంట్ నుంచి టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే వింబుల్డన్ ఛాంపియన్ ముర్రే ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రకటించగా, అదే బాటలో రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ నడుస్తున్నారు. గాయంగా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి దూరమైనప్పటి నుంచి నాదల్ ఏ టోర్నీల్లో పాల్గొనలేదు. మణికట్టు గాయం నుంచీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికే రెండు సార్లు టొరంటో మాస్టర్స్ టైటిల్ నెగ్గిన స్విస్ దిగ్గజం రోజర్ కూడా టోర్నీలో పాల్గొనడం లేదని మంగళవారం ప్రకటించాడు. టెన్నిస్ చతుష్టయంలో ఒకడైన నొవాక్ జొకోవిచ్ ఒక్కడే ఈ మేజర్ ఈవెంట్లో పాల్గొనున్నాడు. ఇటీవల జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా, మూడో రౌండ్లో అమెరికా ఆటగాడు సామ్ కెర్రీ చేతిలో ఓటమితో ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. టోర్నీ ఏదైనా సరే ఈ నలుగురి గురించే చర్చ. ప్రస్తుతం ఫెదరర్, నాదల్, ముర్రే టొరంటో మాస్టర్స్ నుంచి తప్పుకోవడంతో ఆ నలుగురిలో ఒకడైన సెర్బియా యోధుడు, ప్రపంచ నంబర్ వన్ జొకోను టైటిల్ ఫెవరెట్ అని భావించవచ్చు.