వరల్డ్ నంబర్.1 మళ్లీ ఆపసోపాలు పడి.. | Novak Djokovic edges Berdych to reach Toronto semis | Sakshi
Sakshi News home page

వరల్డ్ నంబర్.1 మళ్లీ ఆపసోపాలు పడి..

Published Sat, Jul 30 2016 12:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

వరల్డ్ నంబర్.1 మళ్లీ ఆపసోపాలు పడి..

వరల్డ్ నంబర్.1 మళ్లీ ఆపసోపాలు పడి..

టొరంటో: సెర్బియా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ టొరంటో టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థామస్ బెర్డిచ్ పై 7-6(8/6), 6-4 తేడాతో విజయం సాధించి రోజర్స్ కప్ సెమిఫైనల్స్ కు చేరుకున్నాడు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో చివరకు సెర్బియా యోధుడినే విజయం వరించింది. ఈ టోర్నీ తొలి రౌండ్ నుంచీ టాప్ సీడెడ్ ను గెలుపు అంత సులువుగా వరించడం లేదు.

బెర్డిచ్ పై 12 వరుస గేమ్ లలో నెగ్గి రికార్డును మెరుగు పరుచుకున్నాడు. టాప్ 5 ఆటగాళ్లతో జరిగిన గత 17 మ్యాచ్ లలో బెర్డిచ్ ఓటమిపాలయ్యాడు. టై బ్రేక్ లో తొలి సెట్ నెగ్గిన జొకోవిచ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తొలి సెట్ ఎలా గెలిచానో తనకే అర్థం కావడం లేదన్నాడు. మరో మ్యాచ్ లో రెండో సీడెడ్ వావ్రింకా, దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్ పై 6-1, 6-3 తేడాతో సులువుగా గెలుపొందాడు. వావ్రింకా తన తదుపరి మ్యాచ్ లో జపాన్ స్టార్ ప్లేయర్ నిషికోరితో తలపడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement