యాంట్‌వర్ప్ (బెల్జియం): ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన యూరోపియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 243వ ర్యాంకర్ ముర్రే 3–6, 6–4, 6–4తో ప్రపంచ 18వ ర్యాంకర్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేత ముర్రేకు 1,09,590 యూరోలు (రూ. 87 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
వావ్రింకాతో ఫైనల్లో తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్‌లో 1–3తో వెనుకబడిన ముర్రే ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 2017 మార్చిలో దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించాక ముర్రే ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న ముర్రే ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆగస్టులో సిన్సినాటి మాస్టర్స్ టోరీ్నతో పునరాగమనం చేశాక మరో ఐదు టోర్నీల్లో పాల్గొన్న అతను ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అయితే యూరోపియన్ ఓపెన్‌లో అతను ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment