
వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ డేవిడ్ ముర్రే(72) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముర్రే శనివారం బ్రిడ్జ్‌టౌన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కరీబియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన వికెట్ కీపర్‌లలో ముర్రే ఒకరు.
అయితే మత్తు పదార్థాలకు బానిస కావడంతో ముర్రే క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలను ముర్రే ఎదుర్కొన్నారు. దీంతో అతను సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశారు.
ఆ తర్వాత నుంచి జాతీయ జట్టులో ముర్రేకు అవకాశం దక్కలేదు. ఇక వెస్టిండీస్ తరపున 19 టెస్టులు ఆడిన ముర్రే 601 పరుగులు సాధించారు. అదే విధంగా అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.
చదవండి: NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు