Coco Gauff
-
ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ
రియాద్: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా పోరాడిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో 20 ఏళ్ల కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మూడోసారి ఈ టోర్నీలో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఏకంగా.. 3 గంటల 4 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 7–6 (7/2)తో ప్రపంచ ఏడో ర్యాంకర్, చైనా రైజింగ్ స్టార్ కిన్వెన్ జెంగ్పై చిరస్మరణీయ విజయం అందుకుంది.విజేతగా నిలిచిన కోకో గాఫ్నకు 48,05,000 డాలర్ల (రూ. 40 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కిన్వెన్ జెంగ్‌కు 23,05,000 డాలర్ల (రూ. 19 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచిన కోకో గాఫ్నకు తుది పోరులో గట్టిపోటీనే ఎదురైంది.టైబ్రేక్‌లో కోకో పైచేయితొలి సెట్‌ను చేజార్చుకున్న కోకో రెండో సెట్లో ఒకదశలో 1–3తో వెనుకబడింది. కానీ వరుసగా మూడుసార్లు కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో కోకో 3–5తో వెనుకంజలో పడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న కోకో పదో గేమ్‌లో కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది.ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కోకో పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకొని 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది కోకో మొత్తం 54 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మూడు టైటిల్స్ (బీజింగ్ ఓపెన్, ఆక్లాండ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్) సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Tennis (@tennischannel) -
కోకో గాఫ్‌దే చైనా ఓపెన్
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ చాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్ 6–1, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 76 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోకో ఆరు ఏస్‌లు సంధించింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ముకోవాకు 5,85,000 డాలర్ల (రూ. 4 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో గత 14 ఏళ్లలో ఈ టోర్నీ టైటిల్ సాధించిన పిన్న వయసు్కరాలిగా 20 ఏళ్ల కోకో గాఫ్ గుర్తింపు పొందింది. సెరెనా విలియమ్స్ (2004, 2013) తర్వాత చైనా ఓపెన్ సాధించిన రెండో అమెరికన్ ప్లేయర్‌గానూ కోకో గాఫ్ ఘనత వహించింది. ఓవరాల్‌గా కోకో కెరీర్లో ఇది ఎనిమిదో సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్‌తో సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు కోకో గాఫ్ చేరువైంది. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
US Open: ప్రిక్టార్టర్స్లో కోకో గాఫ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది. చెన్నైపై యు ముంబా పైచేయి చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్‌పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్‌పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
కోకో జోరు
న్యూయార్క్: స్వదేశంలో తన జోరు కొనసాగిస్తూ... అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో అడుగుపెట్టిన మూడో సీడ్ కోకో గాఫ్ రెండో రౌండ్లో 6–4, 6–0తో ప్రపంచ 99వ ర్యాంకర్ తాత్యానా మరియా (జర్మనీ)పై గెలిచింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కోకో గాఫ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 28 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు నెగ్గిన కోకో 25 విన్నర్స్ కొట్టింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో లూసియా బ్రోన్జెట్టి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–4తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) వరుసగా మూడో ఏడాది మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో కిన్వెన్ జెంగ్ 6–7 (3/7), 6–1, 6–2తో ఎరికా ఆంద్రీవా (రష్యా)ను ఓడించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) 1–6, 6–7 (3/7)తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ 6–4, 6–4, 2–0తో లాస్లో జెరె (సెర్బియా)పై, జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–1తో ముల్లర్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–4, 6–2, 2–6, 7–6 (7/3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. జెరెతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లు గెలిచి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా జెరె వైదొలిగాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 5–7, 6–1, 6–2, 6–2తో రిండర్నీచ్ (ఫ్రాన్స్)పై, 13వ సీడ్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో అగుట్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–1, 6–1, 7–6 (7/4)తో హిజికాటా (ఆ్రస్టేలియా)పై గెలిచారు. -
Wimbledon 2024: కోకో గాఫ్ పరాజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్‌కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు. ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్‌స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నాలుగో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు. -
కోకో గాఫ్ తొలిసారి...
పారిస్: పట్టుదలతో పోరాడిన అమెరికా టెన్నిస్ యంగ్‌స్టార్ కోకో గాఫ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ కోకో గాఫ్ 4–6, 6–2, 6–3తో ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా)పై గెలిచింది. ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించడం విశేషం. 2023 యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన కోకో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించింది. జబర్‌తో గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. 21 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద 11 పాయింట్లు గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–2తో ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.వైదొలిగిన జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మోకాలి గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. సెరున్‌డొలో (అర్జెంటీనా)తో 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–1, 5–7, 3–6, 7–5, 6–3తో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా జొకోవిచ్ జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగకూడదని నిర్ణయం తీసుకొని టోర్నీ నుంచి వైదొలిగాడు. కొత్త నంబర్‌వన్ సినెర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్ కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్నాడు. జొకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగడం... సినెర్ సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ ఇటలీ స్టార్ ఈనెల పదో తేదీన విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంటాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–2, 6–4, 7–6 (7/3)తో పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. టైటిల్ విజేతగా 19 ఏళ్ల కోకో గాఫ్
యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన సెకెండ్ సీడ్ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గాఫ్ కైవసం చేసుకుంది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల కోకో గాఫ్ ఓడించింది. తొలి సెట్లో కోకో గాఫ్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక చాంపియన్‌గా నిలిచిన గాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. సెరెనా విలిమమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గౌఫ్ నిలిచింది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
సబలెంకా vs కోకో గాఫ్
కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ 6–4, 7–5తో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్ జరుగుతుంది. ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల కోకో గాఫ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీస్‌తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. తొమ్మిదో గేమ్‌లో కీస్ తన సర్విస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్ సర్విస్‌ను సబలెంకా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్‌లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది. -
US Open 2023: తొలిసారి సెమీస్‌లో కోకో గాఫ్.. ముకోవాతో అమీతుమీ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 67 నిమిషాల్లో 6–0, 6–2తో 20వ సీడ్ ఒస్టాపెంకో(లాతి్వయా)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, స్వియాటెక్‌ను బోల్తా కొట్టించినా.. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో క్వార్టర్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. గాఫ్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో 36 అనవసర తప్పిదాలు చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో కరోలినా ముకోవా.. సిరెస్టియాను మట్టికరిపించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), 12వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. Karolina Muchova, are you kidding!? What a get! pic.twitter.com/MOUmzt3YMn — US Open Tennis (@usopen) September 6, 2023 Novak Djokovic refuses to be defeated in #USOpen quarterfinals. pic.twitter.com/MKdhLmUCMU — US Open Tennis (@usopen) September 5, 2023 What a match point from @CocoGauff❗️ How it sounded on #USOpen radio 🎙️⤵️ pic.twitter.com/m4DGbBkk1A — US Open Tennis (@usopen) September 5, 2023 -
US Open: వరల్డ్ నంబర్ 1కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి అవుట్
న్యూయార్క్: పోలండ్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ 1 ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్-2023 టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. టాప్-20 సీడ్ జెలెనా ఒస్తాపెంకో చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ రౌండ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్‌ను 6-3, 3-6, 1-6తో ఓడించిన జెలెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముందడుగు వేసింది. పూర్తిగా తనదే ఆధిపత్యం కాగా నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో స్వియాటెక్ 6-3తో తొలి సెట్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జెలెనా పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. తగ్గేదేలే అన్నట్లు టాప్ సీడ్‌కు షాకుల మీద షాకులిచ్చి 3-6, 1-6తో ఏ దశలోనూ కోలుకోకుండా చేసింది. తద్వారా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమెతో పోటీ ఇక జెలెనా చేతిలో పరాజయం పాలైన స్వియాటెక్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. పోలండ్ స్టార్ తాజా ఓటమి నేపథ్యంలో రెండో సీడ్‌గా ఉన్న బెలారస్ టెన్నిస్ తార అరియానా సబలెంక నంబర్ 1గా అవతరించింది. ఇదిలా ఉంటే.. యూఎస్‌కు చెందిన కోకో గాఫ్.. మాజీ వరల్డ్ నంబర్ 1 కరోలిన్ వోజ్నియాకిపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జెలెనా క్వార్టర్స్‌లో కోకో గాఫ్‌ను ఎదుర్కోనుంది. క్వార్టర్స్‌లో ముకోవా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ ముకోవా 2 గంటల 34 నిమిషాల్లో 6–3, 5–7, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచింది. ఈ క్రమంలో తదుపరి గేమ్‌లో ముకోవా సొరానాతో తలపడనుంది. చదవండి: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Make your prediction. What's the semifinal here? pic.twitter.com/xxrXmYXkIv — US Open Tennis (@usopen) September 4, 2023 Jelena Ostapenko reaches the #USOpen quartefinals for the first time in her career! pic.twitter.com/QzSWObVJYE — US Open Tennis (@usopen) September 4, 2023 Well, well, well 💅 There will be a deciding set between Jelena Ostapenko and Iga Swiatek. pic.twitter.com/3iIYIG0MLs — US Open Tennis (@usopen) September 4, 2023 -
కోకో గాఫ్ అలవోకగా...
న్యూయార్క్: సొంతగడ్డపై అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ మెరిసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 19 ఏళ్ల గాఫ్ 6–3, 6–2తో మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలిచింది. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాఫ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు ఏడో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), 2000, 2001 చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 12వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గార్సియా 4–6, 1–6తో యఫాన్ వాంగ్ (చైనా) చేతిలో, వీనస్ 1–6, 1–6తో గ్రీట్ మినెన్ (బెల్జియం) చేతిలో, క్రిచికోవా 4–6, 6–7 (3/7)తో లూసియా బ్రోన్జెట్టి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోకి చేరారు. -
55 ఏళ్ల తర్వాత మరో టీనేజ్ చాంపియన్‌గా చరిత్ర.. ఆమె ఎవరంటే?
సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల కోకో గాఫ్ 6–3, 6–4తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి తన కెరీర్లో తొలి మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కోకో గాఫ్‌కు 4,54,500 డాలర్ల (రూ. 3 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది ఈ గెలుపుతో 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన టీనేజ్ ప్లేయర్‌గా కోకో గుర్తింపు పొందింది. 1968లో అమెరికాకే చెందిన 17 ఏళ్ల లిండా టుయెరో విజేతగా నిలిచింది. లెక్క సరిచేసిన జొకోవిచ్ ఒహాయో: సెర్బియా టెన్నిస్ యోధుడు జొకోవిచ్ తన కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు. రెండో సెట్ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి జొకోవిచ్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది 95వ సింగిల్స్ టైటిల్‌కాగా, కెరీర్లో 1,069వ విజయం. -
సెమీస్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్‌వన్ స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ సెమీస్‌కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్వియాటెక్ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్‌లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్‌లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది. Back to the semis 👋#RolandGarros | @iga_swiatek pic.twitter.com/PsCZygZWim — Roland-Garros (@rolandgarros) June 7, 2023 Feeling the love ❤️#RolandGarros | @iga_swiatek pic.twitter.com/spBvtHqExx — Roland-Garros (@rolandgarros) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్‌లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు చేరింది. కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్‌గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది. జబర్ జోరు... ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 30 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్‌లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్‌తో ఆడతాడు. -
French Open: కోకో కేక.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో..
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అమెరికన్ టీనేజ్ స్టార్ కోకో గౌఫ్ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్ దశకు అర్హత సాధించింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికాకు చెందిన 18 ఏళ్ల కోకో గౌఫ్ తన జోరు కొనసాగిస్తూ వరుసగా ఐదో మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోకుండా విజయం సాధించింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 64వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా)తో మంగళవారం జరిగిన సింగిల్వ్ క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ కోకో 7-5, 6-2తో గెలుపొందింది. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారి ఇప్పటివరకు 11 గ్రాండ్‌స్లామ్‌లు ఆడిన కోకో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదే టోర్నీలో ఈసారి క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించింది. 🇺🇸🆚🇺🇸 Teenager @CocoGauff came out on top against fellow American Sloane Stephens in a hard-fought quarter-final:#RolandGarros pic.twitter.com/kQphuXxVva — Roland-Garros (@rolandgarros) May 31, 2022 -
వీనస్‌కు షాకిచ్చిన 15 ఏళ్ల కోరి గాఫ్
మెల్బోర్న్: ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం చోటుచేసుకుంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, అమెరికా దిగ్గజ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 6–7(5/7), 3–6తో యువ సంచలనం, 15 ఏళ్ల కోరి గాఫ్ చేతిలో పరాజయం పాలైంది. గతేడాది వింబుల్డన్ తొలి రౌండ్లోనే వీనస్‌ను ఇంటిబాట పట్టించిన గాఫ్ మరోసారి అదే ఫలితం పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలుచుకున్న గాఫ్ రెండో సెట్లో తిరుగులేని ఆటతీరు ప్రదర్శించింది. కాగా, సోమవారం బరిలోకి దిగిన మిగిలిన సీడెడ్ క్రీడాకారులకు శుభారంభం లభించింది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం.1, స్థానిక క్రీడాకారిణి ఆష్లే బార్టీ 5–7, 6–1, 6–1తో సురెంకో(ఉక్రెయిన్)పై, వరల్డ్ నెం.4 నవోమీ ఒసాకా(జపాన్) 6–2, 6–4తో మారీ బౌజ్కోవా(చెక్‌రిపబ్లిక్)పై గెలుపొందగా, మార్గరెట్ కోర్ట్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ, ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ 6–0, 6–3తో అనస్తాసియా పొటపొవా(రష్యా) ను చిత్తు చేసింది. మాజీ నెం.1 కరోలినా వోజ్నియాకీ(డెన్మార్క్) 6–1, 6–3తో క్రిస్టీ ఆన్(అమెరికా)పై గెలుపొందింది. ఏడో సీడ్ పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్) 6–1, 6–0తో తన దేశానికే చెందిన సినియకోవాపై నెగ్గగా, స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–2, 5–7, 2–6తో జాంగ్(చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. చెమటోడ్చిన జకోవిచ్.. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ 6–3 6–2 6–2తో స్టీవ్ జాన్సన్(అమెరికా)పై గెలుపొందగా, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్లోనే చెమటోడ్చాడు. హోరాహోరీగా జరిగిన పోరులో జకోవిచ్ 7–6, 6–2, 2–6, 6–1తో జాన్–లెనార్డ్ స్ట్రఫ్(జర్మనీ)పై నెగ్గాడు. అలాగే ఆరో సీడ్, గ్రీస్ స్టార్ సిట్సిపాస్ 6–0, 6–1, 6–3తో కరుసో(ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ మారియో బరెత్తిని(ఇటలీ) 6–3, 6–1, 6–3తో హారిస్(ఆస్ట్రేలియా)పై, వరల్డ్ నెం.18 దిమిత్రోవ్(బల్గేరియా) 4–6, 6–2, 6–0, 6–4తో లోండెరో(అర్జెంటీనా)పై, గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. -
15 ఏళ్ల 7 నెలలకే...
లింజ్ (ఆస్ట్రియా): అమెరికా టీనేజ్ సంచలనం కోకో గౌఫ్ తన కెరీర్లో తొలి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన లింజ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో 15 ఏళ్ల 7 నెలల కోకో గౌఫ్ 6–3, 1–6, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై నెగ్గి... 34,677 యూరోల (రూ. 27 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీని దక్కించుకుంది. 2004లో వైదిసోవా (చెక్ రిపబ్లిక్–15 ఏళ్ల 3 నెలల 23 రోజులు; వాంకోవర్ ఓపెన్) తర్వాత పిన్న వయస్సులో డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా కోరి గుర్తింపు పొందింది.