న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్‌వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్‌వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది.
చెన్నైపై యు ముంబా పైచేయి
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్‌పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్‌పై గెలుపొందాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్‌పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment