Tennis Grand Slam tournament
-
US Open: ప్రిక్టార్టర్స్లో కోకో గాఫ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది. చెన్నైపై యు ముంబా పైచేయి చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్‌పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్‌పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాకు చెందిన టెన్నిస్ ఆటగాడు యూ వైబింగ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్ రికార్డులకెక్కాడు. విషయంలోకి వెళితే.. 174వ ర్యాంకర్ అయిన యూ వైబింగ్.. తొలి రౌండ్లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో కంగుతినిపించాడు. కాగా 22 ఏళ్ల యూ వైబింగ్ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు.. 31 విన్నర్లు సంధించాడు. టెన్నిస్‌లో మేజర్ గ్రాండ్‌స్లామ్‌లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1959లో వింబుల్డన్‌లో మెఫు-చి మాత్రమే మేజర్ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్ గయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచాడు. అప్పటినుంచి చూసుకుంటే మళ్లీ ఒక్క చైనీస్ ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్ మాత్రమే యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించాడు. కాగా 2017లో జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యూ వైబింగ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ కెరీర్లో రాణించలేకపోయాడు. వరుస గాయాలు అతన్ని ఇబ్బందిపెట్టాయి. మార్చి 2019 నుంచి జనవరి 2022 వరకు యూ వైబింగ్ టెన్నిస్‌కు మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని మార్చిలో బరిలోకి దిగిన యూ వైబింగ్ ర్యాంక్ 1869. అయితే వరుసగా 14 మ్యాచ్‌లు(తాజా దానితో కలిపి) విజయాలు సాధించి ఏకంగా 174వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యూ వైబింగ్ తన తర్వాతి మ్యాచ్ పోర్చుగీస్‌కు చెందిన నునో బోర్జెస్‌తో ఆడనున్నాడు. Wu Yibing has become the first man from China to win a men's Grand Slam match in 63 years after he beat Nikoloz Basilashvili 6-3 6-4 6-0. Trailblazer 🔥 #USOpen pic.twitter.com/zlZm9Tnd2u — Eurosport (@eurosport) August 29, 2022 చదవండి: US Open 2022: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా -
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై
టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇకపై ఆఖరి సెట్లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్ టై బ్రేక్ ఆడేలా కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్‌స్లామ్ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్ ఓపెన్), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్ టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో 10 పాయింట్ టై బ్రేక్‌ను ట్రయల్ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 10 పాయింట్ టై బ్రేక్ అనేది అన్ని గ్రాండ్‌స్లామ్‌ల్లో.. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ నుంచి ఫైనల్‌కు వరకు ఆఖరి సెట్లో ఇది వర్తించనుంది. సీనియర్‌తో పాటు జూనియర్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, వీల్‌చైర్ డబుల్స్‌లో కూడా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
US Open: సంచలనాల మోత
న్యూయార్క్: కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ తన జీవితంలోనే గొప్ప విజయాన్ని సాధించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై లేలా జయభేరి మోగించింది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో లేలా 5–7, 7–6 (7/2), 6–4తో ఒసాకాను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి సెట్ సొంతం చేసుకొని, రెండో సెట్ లో 6–5తో ఆధిక్యంలో ఉండి విజయం కోసం సర్వీస్ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన లేలా స్కోరును 6–6తో సమం చేసి... టైబ్రేక్‌లోనూ పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లోనే ఒసాకా సరీ్వస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను కాపాడుకొని లేలా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత లేలా తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో లేలా ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు ఆరుసార్లు దూసుకొచ్చి ఐదుసార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు 2018, 2020లలో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఒసాకా 15 ఏస్‌లు సంధించినా 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో మరియా సాకరి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో స్వితోలినా, సబలెంకా ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–2తో కసత్కినా (రష్యా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో రఖిమోవా (రష్యా)పై, తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–4, 3–6, 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. మెద్వెదేవ్ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మూడో రౌండ్లోనే ని్రష్కమించగా... రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మెద్వెదేవ్ 6–0, 6–4, 6–3తో పాబ్లో అందుహార్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరోవైపు స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ 4 గంటల 7 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/2), 0–6, 7–6 (7/5)తో సిట్సిపాస్‌ను ఓడించగా... 23 ఏళ్ల అమెరికా యువతార టియాఫో 3 గంటల 45 నిమిషాల్లో 4–6, 6–3, 7–6 (8/6), 4–6, 6–1తో రుబ్లెవ్‌పై గెలిచాడు. తాజా విజయంతో అల్కారజ్ 1989లో పీట్ సంప్రాస్ (అమెరికా), మైకేల్ చాంగ్ (అమెరికా) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సిట్సిపాస్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కారజ్ కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్ షాట్లతో హడలెత్తించాడు. సిట్సిపాస్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రుబ్లెవ్తో జరిగిన మ్యాచ్‌లో టియాఫో 24 ఏస్‌లు సంధించడం విశేషం. టెన్నిస్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో నేను గెలిస్తే సంతోషం కలిగేది కాదు. ఊరట లభించినట్టు అనిపించేది. ఇక ఓడిపోతే తీవ్రంగా నిరాశ కలిగేది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేను. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ నేను ఎప్పుడు రాకెట్ పట్టి కోర్టులోకి దిగుతానో నాకే తెలియదు. –ఒసాకా మిక్స్‌డ్‌లోనూ సానియా ఓటమి యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా... మిక్స్డ్ డబుల్స్‌లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. భారత సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ రాజీవ్ రామ్ కలిసి సానియా మిక్స్డ్ డబుల్స్‌లో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం 3–6, 6–7 (7/10)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)–డయానా యా్రస్టెమ్స్కా (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జంట 3–6, 6–3, 7–6 (7/1)తో డక్‌వర్త్–థాంప్సన్ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
రోజూ 30 వేల మంది ప్రేక్షకులకు అనుమతి
ఈ ఏడాది జరిగే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లకు అనుమతించే ప్రేక్షకుల సంఖ్యపై విక్టోరియా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మార్టిన్ పకులా శనివారం కీలక ప్రకటన చేశారు. టోర్నీ చివరి ఐదు రోజులు మినహా మిగిలిన తొమ్మిది రోజుల్లో రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే టోర్నీ చివరి ఐదు రోజుల్లో మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో అప్పుడు 25 వేల మంది వరకు మాత్రమే మ్యాచ్‌లను చూసేందుకు అనుమితిస్తామని మార్టిన్ పకులా తెలిపారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు జరగనుంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ప్రేక్షకుల అనుమతి
పారిస్ : ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ సోమవారం స్పష్టం చేశారు. దాంతో కరోనా విరామం అనంతరం ప్రేక్షకులతో జరగనున్న తొలి మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఫ్రెంచ్ ఓపెన్ నిలవనుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం పారిస్ వంటి నగరాల్లో 5 వేల మందితో కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. (తన కోపమే తన శత్రువు) ఫ్రెంచ్ ఓపెన్ పూర్తి సామర్థ్యంలో 50 నుంచి 60 శాతం వీక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే ఇంచుమించుగా టోర్నీ జరుగుతున్న రోజుల్లో రోజుకు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టోర్నీకి వేదికయ్యే ప్రదేశాన్ని మూడు జోన్లుగా విభజించారు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. టోర్నీలో ఆడేందుకు వచ్చిన ప్లేయర్లకు 72 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు చేస్తామని రెండు సార్లు నెగెటివ్ అని వస్తేనే వారిని టోర్నీలో ఆడేందుకు అనుమతిస్తామని టోర్నీ డైరెక్టర్ గయ్ ఫోర్జె తెలిపారు. (ఒలింపిక్స్ జరగడం ఖాయం: ఐఓసీ) -
గ్రాండ్‌స్లామ్ సాధించిన 19 ఏళ్ల సంచలనం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఫైనల్లో సంచలనం నమోదైంది. కెనడియన్ బియాంక ఆండ్రిస్యూ (19) మాజీ వరల్డ్ నెంబర్ వన్, అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించింది. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో బియాంక ఆండ్రిస్యూ 6-3, 7-5 తేడాతో సెరెనాపై గెలిచింది. హోరాహోరి పోరులో ధీటైన ఆటతో విన్నర్‌గా నిలిచిన ఆండ్రిస్యూ ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి కెనడియన్‌గా నిలిచింది. దాంతోపాటు పిన్న వయసులో (19 ఏళ్లు) గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మహిళగా ఆమె రికార్టు సృష్టించింది. ఇదిలాఉండగా.. గత రెండేళ్లలో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొంనేందుకు కూడా ఆండ్రిస్యూ అర్హత సాధించకపోవడం గమనార్హం. ఇక ఈ విజయంతో ఓపెన్ శకంలో అత్యధికంగా యూఎస్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన రికార్డును సొంతం చేసుకోవలానుకున్న సెరెనాకు నిరాశ తప్పలేదు. ఇప్పటివరకూ ఆమె ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది. ఇక 2017 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది సెరెనాకు అందని ద్రాక్షగానే ఉంది. గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్ క్రీడాకారిణి ఒసాకా చేతిలో సెరెనా పరాజయం పాలై రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. 2014లో చివరిసారి యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలిచారు సెరెనా. ఆమె ఇప్పటివరకు 23 మరో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్నారు. మరో టైటిల్ గెలిస్తే.. అత్యధిక సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24 గ్రాండ్ స్లామ్టైటిల్స్) ఆల్ టైమ్ రికార్డును సెరెనా సమం చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గట్టెక్కిన బార్టీ, ప్లిస్కోవా
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 1–6, 2–6తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఇద్దరు మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులకు తమ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన బార్టీ గంటా 41 నిమిషాల్లో 1–6, 6–3, 6–2తో జరీనా దియాస్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... 2016 యూఎస్ ఓపెన్ రన్నరప్ ప్లిస్కోవా గంటా 46 నిమిషాల్లో 7–6 (8/6), 7–6 (7/3)తో తన దేశానికే చెందిన తెరెజా మార్టిన్కోవాను ఓడించింది. దియాస్తో జరిగిన మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–1, 4–6, 6–2తో కసత్కినా (రష్యా)పై, 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో యూజిన్ బుషార్డ్ (కెనడా)పై గెలిచారు. 2016 రియో ఒలింపిక్స్ విజేత మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో) 3–6, 3–6తో రెబెకా (స్వీడన్) చేతిలో... 2011 యూఎస్ ఓపెన్ విజేత సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 1–6, 3–6తో ఎకతెరీనా (రష్యా) చేతిలో... 27వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–7 (8/10), 2–6తో ఓన్స్ జబీర్ (ట్యునీషియా) చేతిలో ఓడిపోయారు. -
కెర్బర్, వీనస్ ఇంటిముఖం
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. తొలి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 81వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (రష్యా) 6–4, 6–2తో ఐదో సీడ్ కెర్బర్‌ను బోల్తా కొట్టించగా... తొమ్మిదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 2002 రన్నరప్ వీనస్‌ను ఓడించింది. పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్ కచ్చితమైన సర్వీస్ చేయలేకపోయింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన కెర్బర్ 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. స్వితోలినాతో 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పోటీనివ్వలేదు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన 38 ఏళ్ల వీనస్ ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్ 2006 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–3తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై, మాజీ చాంపియన్, 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 5–7, 6–2, 6–2తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఫెడరర్... వరుసగా 60వ సారి పురుషుల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న మూడో సీడ్ ఫెడరర్ 6–2, 6–4, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్లో వరుసగా 60వ విజయం కావడం విశేషం. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించాడు. 30సార్లు నెట్ వద్దకు వచ్చి 25సార్లు పాయింట్లు సాధించాడు. ఫెడరర్‌తోపాటు ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), 11వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. సిట్సిపాస్ 6–2, 6–2, 7–6 (7/4)తో మార్టెరర్ (జర్మనీ)పై, నిషికోరి 6–2, 6–3, 6–4తో క్వెంటన్ హాలిస్ (ఫ్రాన్స్)పై, సిలిచ్ 6–3, 7–5, 6–1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు. ప్రజ్నేశ్‌కు నిరాశ... భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటలేకపోయాడు. తన ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ 1–6, 3–6, 1–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 46 వేల యూరోలు (రూ. 35 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
మెయిన్ ‘డ్రా’కు అడుగు దూరంలో సాకేత్
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు భారత క్రీడాకారుడు సాకేత్ మైనేని అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫరుుంగ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 7-6 (8/6), 6-4తో మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)తో జరిగే మూడో రౌండ్లో సాకేత్ గెలిస్తే తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు.