US Open: సంచలనాల మోత | Leila Fernandez defeats Naomi Osaka At US Open | Sakshi
Sakshi News home page

US Open: సంచలనాల మోత

Published Sun, Sep 5 2021 1:54 AM | Last Updated on Sun, Sep 5 2021 2:43 AM

Leila Fernandez defeats Naomi Osaka At US Open - Sakshi

న్యూయార్క్‌: కెరీర్‌లో ఏడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్‌ తన జీవితంలోనే గొప్ప విజయాన్ని సాధించింది. యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోరీ్నలో మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌)పై లేలా జయభేరి మోగించింది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో లేలా 5–7, 7–6 (7/2), 6–4తో ఒసాకాను ఓడించి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి సెట్‌ సొంతం చేసుకొని, రెండో సెట్‌ లో 6–5తో ఆధిక్యంలో ఉండి విజయం కోసం సర్వీస్‌ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయింది.

ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన లేలా స్కోరును 6–6తో సమం చేసి... టైబ్రేక్‌లోనూ పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లోని తొలి గేమ్‌లోనే ఒసాకా సరీ్వస్‌ను బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను కాపాడుకొని లేలా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత లేలా తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో లేలా ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నెట్‌ వద్దకు ఆరుసార్లు దూసుకొచ్చి ఐదుసార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు 2018, 2020లలో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన ఒసాకా 15 ఏస్‌లు సంధించినా 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో మూడో రౌండ్‌ మ్యాచ్‌లో పదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 4–6, 3–6తో మరియా సాకరి (గ్రీస్‌) చేతిలో ఓడిపోయింది.

ప్రిక్వార్టర్స్‌లో స్వితోలినా, సబలెంకా
ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–4, 6–2తో కసత్‌కినా (రష్యా)పై, రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6–3, 6–3తో కొలిన్స్‌ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–4, 6–2తో రఖిమోవా (రష్యా)పై, తొమ్మిదో సీడ్‌ ముగురుజా  (స్పెయిన్‌) 6–4, 3–6, 6–2తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై గెలిచారు.   

మెద్వెదేవ్‌ ముందంజ...
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లోనే ని్రష్కమించగా... రెండో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.

మెద్వెదేవ్‌ 6–0, 6–4, 6–3తో పాబ్లో అందుహార్‌ (స్పెయిన్‌)పై నెగ్గాడు. మరోవైపు స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల కార్లోస్‌ అల్కారజ్‌ 4 గంటల 7 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/2), 0–6, 7–6 (7/5)తో సిట్సిపాస్‌ను ఓడించగా... 23 ఏళ్ల అమెరికా యువతార టియాఫో 3 గంటల 45 నిమిషాల్లో 4–6, 6–3, 7–6 (8/6), 4–6, 6–1తో రుబ్లెవ్‌పై గెలిచాడు. తాజా విజయంతో అల్కారజ్‌ 1989లో పీట్‌ సంప్రాస్‌ (అమెరికా), మైకేల్‌ చాంగ్‌ (అమెరికా) తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సిట్సిపాస్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కారజ్‌ కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్‌ షాట్‌లతో హడలెత్తించాడు. సిట్సిపాస్‌ ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రుబ్లెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో టియాఫో 24 ఏస్‌లు సంధించడం విశేషం.

టెన్నిస్‌ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో నేను గెలిస్తే సంతోషం కలిగేది కాదు. ఊరట లభించినట్టు అనిపించేది. ఇక ఓడిపోతే తీవ్రంగా నిరాశ కలిగేది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేను. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ నేను ఎప్పుడు రాకెట్‌ పట్టి కోర్టులోకి దిగుతానో నాకే తెలియదు.
–ఒసాకా

మిక్స్‌డ్‌లోనూ సానియా ఓటమి
యూఎస్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సానియా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. భారత సంతతికి చెందిన అమెరికా ప్లేయర్‌ రాజీవ్‌ రామ్‌ కలిసి సానియా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బరిలోకి దిగింది. తొలి రౌండ్‌లో సానియా–రాజీవ్‌ రామ్‌ ద్వయం 3–6, 6–7 (7/10)తో మాక్స్‌ పర్సెల్‌ (ఆస్ట్రేలియా)–డయానా యా్రస్టెమ్‌స్కా (ఉక్రెయిన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేíÙయా) జంట 3–6, 6–3, 7–6 (7/1)తో డక్‌వర్త్‌–థాంప్సన్‌ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement