చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు.
మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది.
తొలి మ్యాచ్‌లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment