అంకిత పరాజయం  | Ankita lost in the third qualifying match | Sakshi
Sakshi News home page

అంకిత పరాజయం 

Published Sun, Aug 27 2023 2:37 AM | Last Updated on Sun, Aug 27 2023 2:37 AM

Ankita lost in the third qualifying match - Sakshi

న్యూయార్క్‌: భారత టాప్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అంకితా రైనా ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లలో తొలి రెండు నెగ్గిన అంకిత మూడో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో అంకిత వరుస సెట్లలో 2–6, 2–6 స్కోరుతో మిర్జమ్‌ జొర్‌క్లండ్‌ (స్వీడన్‌) చేతిలో పరాజయంపాలైంది. 1 గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 154వ ర్యాంకర్‌ అంకిత తన ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. జొర్‌క్లండ్‌ 3 ఏస్‌లు సంధించగా, అంకిత ఒకే ఒక ఏస్‌ కొట్టింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement