
ఈ ఏడాది జరిగే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లకు అనుమతించే ప్రేక్షకుల సంఖ్యపై విక్టోరియా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మార్టిన్ పకులా శనివారం కీలక ప్రకటన చేశారు. టోర్నీ చివరి ఐదు రోజులు మినహా మిగిలిన తొమ్మిది రోజుల్లో రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే టోర్నీ చివరి ఐదు రోజుల్లో మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో అప్పుడు 25 వేల మంది వరకు మాత్రమే మ్యాచ్‌లను చూసేందుకు అనుమితిస్తామని మార్టిన్ పకులా తెలిపారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్‌బోర్న్ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment