spectators
-
స్పందన కరువైంది...
వరల్డ్ కప్ తొలి మ్యాచ్ అంటే సహజంగా క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. టాస్ వేసేసరికే స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈ మ్యాచ్‌పై అహ్మదాబాద్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా లేదు. మ్యాచ్ ఆరంభమైన చాలాసేపటి వరకు కూడా స్టేడియంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది. భారత్ లేని మ్యాచ్‌కు లక్షకు పైగా సామర్థ్యం ఉన్న స్టేడియం ఫ్యాన్స్‌తో హౌస్‌ఫుల్ అవుతుందని కోరుకోవడం అత్యాశే అయినా మరీ నామమాత్రంగా కూడా జనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. చివరి వరకు వేర్వేరు కారణాలతో టికెట్లు అమ్మకానికి ఉంచకపోవడం, నగరంలో తీవ్రమైన ఎండ, వారాంతం కాకపోవడం కూడా అందుకు కారణాలు కావచ్చు. 40 వేల టికెట్లను స్థానిక రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు పంచి పెట్టారు. టికెట్లు తీసుకున్న వారంతా వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదని తెలిసింది. నిజానికి ఇలాంటి మెగా ఈవెంట్లు ఆతిథ్య జట్టు మ్యాచ్‌తో ప్రారంభం కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి ‘ఫైనలిస్ట్’లతో పోరు ఖరారు చేశారు. మ్యాచ్ సాగినకొద్దీ సాయంత్రానికి స్టేడియంలో ప్రేక్షకులు సంఖ్య పెరగడం కాస్త ఊరట. -
రావణ దహనంలో అపశ్రుతి... ప్రజలపైకి దూసుకొచ్చిన దిష్టిబొమ్మ
న్యూఢిల్లీ: దేశంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు విజయదశమి సంబరాలు మిన్నంటాయి. అదీగాక విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన గుర్తుగా పలుచోట్ల రామలీల ప్రదర్శనలతోపాటు, రావణదహనం చేస్తుంటారు. అచ్చం అలానే హర్యానాలో కూడా రావణదహనం చేస్తుండగా... పెనుప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రావణుడి దిష్టిబొమ్మ ప్రజలపైకి దూసుకువచ్చింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. #WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH — ANI (@ANI) October 5, 2022 (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి
BCCI Requests To Have Full Capacity Spectators For T20 World Cup Final Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నవంబర్ 14న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యం( 25 వేలు) మేరకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐతో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు యూఏఈ ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆతిధ్య దేశం అనుమతి తప్పనసరి కావడంతో బీసీసీఐ, ఈసీబీలు ఎమిరేట్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కరోనా కారణంగా మెగా టోర్నీ నిర్వహణ భారత్ నుంచి యూఏఈకి తరలిపోయినప్పటికీ.. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐతోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనతో పాటు 48 గంటల వ్యవధిలో చేయించుకున్న నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్‌ను తప్పనిసరి చేశారు. కాగా, అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం మొదలుకానుంది. ఆ మరుసటి రోజు( అక్టోబర్ 24న) దాయాదుల(భారత్, పాక్) మధ్య రసవత్తర పోరు జరుగనుంది. చదవండి: టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే.. -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటంటే..?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సెకెండ్ ఎడిషన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ, ఈసీబీ(ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సెకెండ్ మ్యాచ్‌ల కోసం మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇందుకు యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాగా, కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన క్యాష్ రిచ్ లీగ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన సమయంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ నడిచింది. అయితే దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. దాంతో యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్.. యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడాతమని అప్పట్లో ప్రకటించారు. ఇక తాజాగా ఈ చర్చలు ఫలించడంతో.. 60శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని కండీషన్‌ను పెట్టింది. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ ఓ తీపికబురు అందించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్-2022 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందని పేర్కొన్నారు. అయితే, ఎప్పటిలా 8 జట్లతో కాకుండా.. 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ జట్లు కొత్తగా చేరబోతున్నాయనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు. చదవండి: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన సూర్యకుమార్, పృథ్వీ షా -
తొలి టెస్ట్ సమయంలో ప్రేక్షకుల చెవుల్లో ఆ ఎర్రటి పరికరాలేంటి..?
నాటింగ్హమ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు చెవులకు ఎర్రటి పరికరాలను ధరించి కనిపించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ మద్దతుదారులు ఈ ఎర్రటి పరికరాలను ధరించి, అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశారు. ఇంతకి వారు పెట్టుకున్న మెషిన్లు ఏంటో తెలుసా? అవి ఎందుకు ధరిస్తారు? వాటి వల్ల ఉపయోగం ఏంటంటే.. స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌లు చూసే వారికి ఆన్ ఫీల్డ్ ఏం జరుగుతుందో సరిగ్గా అర్దం కాదు. ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు బంతి కనపడుతుంది కానీ టెస్ట్‌ల్లో బౌండరీలు, సిక్సర్లు అరుదుగా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రేక్షకులు తమ చెవులకు చిన్న రేడియోలను పెట్టుకుంటారు. లోకల్ రేడియో స్టేషన్లో క్రికెట్ కామెంట్రీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటుంటారు. టీవీ ప్రసారాలు అందించే స్కై స్పోర్ట్స్ నెట్వర్కే ఈ రేడియో ప్రసారాలనూ అందిస్తుంది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులకు పిచ్ మధ్యలో ఏం జరుగుతుందో కామెంట్రీ రూపంలో వినే అవకాశం లభిస్తుంది. అయితే ఇందుకు ఫోన్లో రేడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే అందుకోసం రేడియో ప్రసారాలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా స్కై స్పోర్ట్స్ అందించే ఈ స్పెషల్ గాడ్జెట్స్ ద్వారా మాత్రమే లైవ్ కామెంట్రీ వినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు అలా చెవులకు రేడియోలు పెట్టుకొని కనపడ్డారు. ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో భారత జట్టు విజయానికి చేరువుగా వచ్చినా.. వర్షం కారణంగా చివరి రోజు ఒక్క బంతి పడకుండా ఆట రద్దయ్యింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
టోక్యో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి
టోక్యో: ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కేవలం జపాన్ వాసులకే పరిమితం చేశారు. అంతేకాకుండా గేమ్స్ జరిగే వేదికల కెపాసిటీలో 50 శాతం మంది ప్రేక్షకుల (అది కూడా 10 వేలకు మించకుండా)ను అనుమతించనున్నారు. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించడం మంచిదని ఆర్గనైజర్లకు జపాన్ దేశ ప్రముఖ వైద్య సలహాదారుడు షిగెరు ఒమీ సూచించగా.. ఆ సూచనను ఆర్గనైజర్లు పట్టించుకోలేదు. ఒలింపిక్స్ జరిగే సమయంలో కరోనా కేసులు పెరిగితే అప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్‌ను నిర్వహించేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తెలిపారు. కరోనా కారణంగా ఈసారి ఒలింపిక్స్ క్రీడలను తిలకించేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించడం లేదు. -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
దుబాయ్: కరోనా కారణంగా అర్ధంతంగా నిలిచిపోయిన ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లకు పేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. అయితే, ప్రస్తుతం ఆ దేశంలో కరోనా అదుపులోనే ఉండటంతో పాటు 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌ల నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం వచ్చే బుధవారం ఈసీబీ అధికారులను కలవనుంది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం టీకాలు వేసుకున్న ప్రేక్షకులకు అనుమతించవచ్చని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు -
చారిత్రక మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి
లండన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభంకానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు 4000 మంది ప్రేక్షకులకు అనుమతివ్వాలని హాంప్షైర్కౌంటీ క్లబ్నిర్ణయించింది. కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా లేదో అన్న సందేహాల నేపథ్యంలో హాంప్‌షైర్ కౌంటీ అధ్యక్షుడు రాడ్ బ్రన్స్ గ్రోవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు రిజర్వ్ చేయగా, మిగిలిన 2000 టికెట్లను అమ్మకానికి ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కావడంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే, యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాంప్‌షైర్ వేదికగా నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభంకానుండగా, ఈ మ్యాచ్‌కు1500 మంది ప్రేక్షకులను అనుమతించారు. 2019 సెప్టెంబర్ తర్వాత మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి. కాగా, భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో డబ్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆతిధ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాకు ఆడేందుకు 50 మందికి పైగా రెడీగా ఉన్నారు.. -
రెండో టెస్టును కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు
చెన్నై: ఇన్నాళ్లు కరోనా భయంతో క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా కావడం.. రద్దవడం జరిగింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి పోటీలు మొదలవుతున్నాయి. అయితే క్రీడా పోటీలు ప్రారంభమైనా ప్రేక్షకులు చూసే అనుమతి లేకపోవడంతో ఇంట్లో కూర్చునే వీక్షించారు. తాజాగా ఇప్పుడు ప్రేక్షకులు నేరుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతినిస్తూ బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకున్నాయి. అయితే కేవలం 50 శాతం మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఇటీవల క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడానికి నిర్ణయం తీసుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరిగే రెండో టెస్టుకు 50శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) నిర్ణయం తీసుకున్నాయి. కొత్తగా కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేడియంలోకి ఫ్యాన్స్‌ను అనుమతించే విషయంపై అసోసియేషన్ సభ్యులు బీసీసీఐ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. దీంతోపాటు మ్యాచ్ కవరేజీకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించనున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై తమిళనాడు క్రికెట్ సంఘానికి ఓ చెందిన ఓ ప్రతినిధి స్పందించి మీడియాతో మాట్లాడారు. 'క్రీడా వేదికల్లో ప్రేక్షకులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను అనుసరించి రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అంశంపై చర్చించాం. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదివారం ఎస్ఓపీలు విడుదల చేసింది' అని తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన ఎంఏ చిదంబరం స్టేడియంలో మొత్తం సామర్థ్యం 50,000 ఉండగా వారిలో 25 వేల మందిని అనుమతించనున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5వ తేది నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్‌లో జరగాల్సిన మూడు, నాలుగు టెస్టులకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. -
రోజూ 30 వేల మంది ప్రేక్షకులకు అనుమతి
ఈ ఏడాది జరిగే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లకు అనుమతించే ప్రేక్షకుల సంఖ్యపై విక్టోరియా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మార్టిన్ పకులా శనివారం కీలక ప్రకటన చేశారు. టోర్నీ చివరి ఐదు రోజులు మినహా మిగిలిన తొమ్మిది రోజుల్లో రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే టోర్నీ చివరి ఐదు రోజుల్లో మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో అప్పుడు 25 వేల మంది వరకు మాత్రమే మ్యాచ్‌లను చూసేందుకు అనుమితిస్తామని మార్టిన్ పకులా తెలిపారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు జరగనుంది. -
ప్రేక్షకులు లేకుండా తొలిసారిగా క్రికెట్ టెస్ట్
-
వధువు లేని పెళ్లిలా ఉంటుంది... ఆ ఆట!
లాహోర్: ప్రేక్షకుల్లేని క్రికెట్ మ్యాచ్‌ల్లో అసలేమీ ఉండదని... ఇంకా చెప్పాలంటే వధువు లేని పెళ్లిలా ఉంటుందని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇది క్రికెట్ మార్కెట్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నాడు. వీడియో లైవ్ సెషన్లో అక్తర్ మాట్లాడుతూ ‘క్రికెట్ బోర్డులు ఇప్పుడు గేట్లు మూసి ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ ఇవి అంతగా విజయవంతమవుతాయని గానీ, ఎప్పట్లాగే మార్కెటింగ్ చేసుకుంటామని గానీ నాకు అనిపించడం లేదు. అసలు ఇది ఎలా ఉంటుందంటే వధువు లేకుండానే వివాహ తంతు జరిపించడంలా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విలయతాండవం ఏడాదికల్లా సాధారణ పరిస్థితికి వస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని అన్నాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంచరీ చేయాలనే ఆశించానని చెప్పాడు. ‘98 పరుగుల వద్ద సచిన్ అవుటవ్వడం నాకు బాధనిపించింది. ఇది చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్. నా బౌన్సర్‌ను అంతకుముందు కొట్టినట్లే సిక్స్ కొడతాడనుకున్నా. కానీ ఔటయ్యాడు. పాక్ బౌలర్లపై చెలరేగిన సచిన్ 98 వద్ద ఔటయ్యాడు’ అని అన్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ జయభేరి మోగించింది. 10 ఓవర్ల కోటా పూర్తిచేసిన అక్తర్ ఏకంగా 72 పరుగులు సమర్పించుకున్నాడు. -
ప్రేక్షకులు లేకుండా నిర్వహించలేం
సింగపూర్: ప్రేక్షకులు లేకుండా సింగపూర్ ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రి రేసును నిర్వహించడం సాధ్యం కాదంటూ రేసు నిర్వాహకులు సోమవారం తెలిపారు. కరోనా కారణంగా మార్చిలో ఆరంభం కావాల్సిన 2020 ఎఫ్1 సీజన్... జూలైలో జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో ఆరంభమయ్యే అవకాశం ఉంది. కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఈ ఏడాది జరిగే రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే యోచనలో ఎఫ్1 అధికారులు ఉన్నారు. అయితే రాత్రి పూట వీధుల గుండా సాగే సింగపూర్ గ్రాండ్‌ప్రి ట్రాక్‌ను హోటల్స్, అపార్ట్మెంట్ల చుట్టూ నిర్మించారు. దాంతో ఈ గ్రాండ్‌ప్రిని ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం కష్టమని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రేసును నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నామని... అందుకోసం సింగపూర్ ప్రభుత్వంతో, ఎఫ్1 అధికారులతో చర్చిస్తున్నామని సింగపూర్ రేసు నిర్వాహకులు తెలిపారు. ఈ రేసు సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అయితే సింగపూర్లాగే వీధుల గుండా సాగే మొనాకో గ్రాండ్‌ప్రి ఇప్పటికే రద్దవగా... అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి వాయిదా పడింది. -
ప్రేక్షకులు లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్!
పారిస్: ప్రేక్షకులు లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ జరిగే అవకాశం ఉందని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్ఎఫ్టీ) చీఫ్ బెర్నార్డ్ గైడిసెల్లి తెలిపారు. దాంతో ప్రతి ఏటా టోర్నీని కోర్టుల్లో ప్రత్యక్షంగా తిలకించే ఐదు లక్షలకుపైగా టెన్నిస్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. అన్నివిధాలా ఆలోచించే టోర్నీని నాలుగు నెలలపాటు వాయిదా వేశామన్నారు. నిజానికి ఫ్రెంచ్ ఓపెన్ ఈ నెల 24న ఆరంభం కావాల్సి ఉండగా... కరోనా కారణంగా సెప్టెంబర్ మూడో వారానికి వాయిదా వేశారు. ‘టోర్నీ నిర్వహణే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ టోర్నీని టీవీల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా... ఖాళీ స్టాండ్స్‌తో మ్యాచ్‌లను నిర్వహిస్తాం’అని బెర్నార్డ్ పేర్కొన్నారు. -
ఆడొచ్చు కానీ... మజా ఉండదు
న్యూఢిల్లీ: ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. అయితే ఈల, గోలలేని మ్యాచ్‌లో మజా, మ్యాజిక్ ఉండవని అన్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. అయితే వైరస్ అదుపులోకి వచ్చాక గప్‌చుప్‌గా టోర్నీలు నిర్వహించే ప్రత్యామ్నాయంపైనే ఇప్పుడు అన్ని దేశాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కోహ్లి మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు మూసి మ్యాచ్‌లు ఆడించవచ్చు. అయితే దీన్ని క్రికెటర్లు ఎలా స్వీకరిస్తారో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మేమంతా ప్రేక్షకుల ముందే ఆడాం. వాళ్లంతా ఆటను ఆరాధించేవారు. క్రేజీగా ఎగబడేవారు. దీంతో మ్యాచ్ జరుగుతుంటే ఎన్నో అనుభూతులు కలిగేవి. ఎక్కడలేని భావోద్వేగాలన్నీ బయటపడేవి. ఇప్పుడు ఇవన్నీ ఉండవు. కాబట్టి మ్యాచ్‌లో ఆ తీవ్రత లోపిస్తుంది’ అని అన్నాడు. గప్‌చుప్‌గా నిర్వహించే ప్రత్యామ్నాయంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్, జేసన్ రాయ్, బట్లర్, కమిన్స్ ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరగాలని కోరుతుండగా... ఆస్ట్రేలియా విఖ్యాత ఆటగాడు అలెన్ బోర్డర్ ప్రేక్షకుల్లేని టి20 ప్రపంచకప్‌ను వ్యతిరేకించారు. మ్యాక్స్‌వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. -
సరదా కోసమే బాటిళ్లు విసిరారు: ధోనీ
కటక్ టి-20 మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ విఫలమైనందుకు స్టేడియంలోని ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు విసిరి రచ్చ చేయడాన్ని మీడియా, క్రీడా రంగాలు తప్పుపట్టాయి. అయితే టీమిండియా కెప్టెన్ ధోనీ మాత్రం ఈ సంఘటనను తేలిగ్గా తీసుకున్నాడు. కటక్‌లో ప్రేక్షకుల తీరు వల్ల ఆటగాళ్ల భద్రతకు హానీ కలగలేదని, ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకోరాదని అన్నాడు. సరదా కోసమే ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరారంటూ తేలికపరిచే ప్రయత్నం చేశాడు. గతంలో వైజాగ్‌లో ఓ మ్యాచ్‌ను అలవోకగా గెలిచినప్పుడు కూడా ప్రేక్షకులు ఇలాగే బాటిళ్లు విసిరారని ధోనీ చెప్పాడు. సరదా కోసమే ఇలా చేశారని, ఇలాంటి ఘటనలను సీరియస్ గా పరిగణించరాదని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ కావడంతో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి అంతరాయం కలిగించారు. -
'ఫ్రెంచ్ ఓపెన్'లో వీక్షకులకు గాయాలు
పారిస్: ఫిలిప్ చాట్రియర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ముగ్గురు వీక్షకులు గాయపడ్డారు. ఈదురు గాలుల ధాటికి స్కోర్ బోర్డుకు అమర్చిఉన్న స్టీల్ షీటు జనసమూహంపై ఊడిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించామని నిర్వాహకులు ప్రకటించారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా.. జపాన్ ప్లేయర్ నిషికోరిపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు అర్హత సాధించడం సోంగాకు ఇది రెండోసారి.