న్యూఢిల్లీ: దేశంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు విజయదశమి సంబరాలు మిన్నంటాయి. అదీగాక విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన గుర్తుగా పలుచోట్ల రామలీల ప్రదర్శనలతోపాటు, రావణదహనం చేస్తుంటారు.
అచ్చం అలానే హర్యానాలో కూడా రావణదహనం చేస్తుండగా... పెనుప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రావణుడి దిష్టిబొమ్మ ప్రజలపైకి దూసుకువచ్చింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
#WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH
— ANI (@ANI) October 5, 2022
Comments
Please login to add a commentAdd a comment