ravan dahan
-
అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణుని సంహరించాడు. అందుకే దసరా నాడు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు.దేశరాజధాని ఢిల్లీలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. దసరా రోజున రావణ దహనంతో పాటు పలు చోట్ల మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాలలో రావణుడు, కుంభకరుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.రామ్‌లీలా మైదాన్ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహన కార్యక్రమాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి, వాటిని దహనం చేస్తారు. ఇక్కడి జరిగే మేళాలో రకరకాల వంటకాలు, వినోదాల కోసం పలు స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహనాన్ని దూరదర్శన్‌లో ప్ర్యత్యక్ష ప్రసారం చేస్తారు. న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోవచ్చు.ఎర్రకోటప్రతి సంవత్సరం ఎర్రకోటలో దసరా సందర్భంగా మేళా నిర్వహిస్తారు. అనేకమంది కుటుంబ సమేతంగా ఎర్రకోటకు తరలివచ్చి, దసరా వేడుకలను తిలకిస్తారు. మేళా సందర్భంగా ఇక్కడ పలు షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.గీతా కాలనీనవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇక్కడ పెద్దఎత్తున మేళా నిర్వహిస్తారు. చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి తరలివచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ స్టాల్స్‌లో ఆహరం తినడాన్ని చాలామంది ఇష్టపడతారు.రోహిణి- జనక్పురిఢిల్లీలోని రోహిణి- జనక్‌పురిలో జరిగే ఈ జాతరను సెక్టార్ 11 ఫెయిర్ అని అంటారు. ఇక్కడ దసరా మేళా భారీ స్థాయిలో జరుగుతుంది. పిల్లల కోసం ఇక్కడ లెక్కకు మించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.ఇది కూడా చదవండి: షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే -
రావణునికి కంగన నిప్పు.. చరిత్రలో తొలిసారి!
దేశవ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ దశమి రోజున పలు ప్రాంతాల్లో రావణుని దిష్టిబొమ్మను దహనం చేసి, చెడుపై మంచి విజయం సాధించిందనే సందేశాన్ని అందిస్తారు. రావణ దహన వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగే ‘లవకుశ రామ్‌లీల’ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి విజయ దశమి వేడుకల్లో ఓ మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఇది రామ్‌లీల చరిత్రలో కొత్త అధ్యాయమని పలువురు చెబుతున్నారు. లవకుశ రామ్‌లీలలో రావణుని దహనం చేసేది మరెవరో కాదు నటి కంగనా రనౌత్. కంగన తదుపరి చిత్రం తేజస్‌పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఢిల్లీలోని లవకుశ రామ్‌లీలలో రావణ దహనానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కంగనా రనౌత్ తాను రావణ దహనం చేయడానికి ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) ఈ వీడియోలో నటి తన తేజస్ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ‘ఎర్రకోటలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమ 50 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి. జై శ్రీరామ్’ అని కంగన క్యాప్షన్‌లో రాశారు. కంగనా రనౌత్‌కి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
బెడిసి కొట్టిన రావణ దహనం.. వీడియో వైరల్
లక్నో(యూపీ): ముజఫర్‌నగర్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమం బెడిసి కొట్టింది. దిష్టి బొమ్మ నుంచి బాణాసంచా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో అంతా పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. బుధవారం సాయంత్రం ముజఫర్‌నగర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో రావణ దహన కార్యక్రం ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి వందల మంది చేరుకున్నారు. అయితే.. దహనం అనంతరం దిష్టిబొమ్మ నుంచి బాణాసంచా మిస్సైళ్ల మాదిరి దూసుకురావడంతో ప్రజలతో పాటు పోలీసులు పరుగులు తీశారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాణాసంచా తర్వాత.. ఒక ఎద్దు మైదానంలో వీరంగం సృష్టించింది. దీంతో జనాలు తలోవైపు పరుగులు తీశారు. చివరకు అధికారులు ఆ ఎద్దును ఎలాగోలా లొంగదీసుకుని.. పక్కకు తీసుకెళ్లారు. मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए 😬 pic.twitter.com/zuDmH3dKXa — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2022 #NewsNonstop: मुजफ्फरनगर में रावण दहन के वक्त हुआ हादसा | तेज रफ्तार में देखिए, देश-विदेश की 50 अहम खबरें @Anant_Tyagii #UttarPradesh #MuzaffarNagar #Dussehra #Dussehra2022 pic.twitter.com/4JFB3b7j3d — Times Now Navbharat (@TNNavbharat) October 5, 2022 Video Credits: TNNavbharat హర్యానాలోని యమునా నగర్లోనూ ఇదే తరహాలో ఘటన జరిగింది. రావణ దహనం తర్వాత దిష్టిబొమ్మ జనాల వైపుగా పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు. -
రావణ దహనంలో అపశ్రుతి... ప్రజలపైకి దూసుకొచ్చిన దిష్టిబొమ్మ
న్యూఢిల్లీ: దేశంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు విజయదశమి సంబరాలు మిన్నంటాయి. అదీగాక విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన గుర్తుగా పలుచోట్ల రామలీల ప్రదర్శనలతోపాటు, రావణదహనం చేస్తుంటారు. అచ్చం అలానే హర్యానాలో కూడా రావణదహనం చేస్తుండగా... పెనుప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రావణుడి దిష్టిబొమ్మ ప్రజలపైకి దూసుకువచ్చింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. #WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH — ANI (@ANI) October 5, 2022 (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
Prabhas: రావణ దహనంలో పాల్గొన్న ప్రభాస్
ఢిల్లీ: సౌత్ స్టార్ల క్రేజ్ దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా టాలీవుడ్ నటుడు ప్రభాస్ ‘రావణ దహన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఆయన్ని చూసేందుకు, ఫొటోలు తీసేందుకు జనం ఎగబడ్డారు. భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయన్ని పిలిచామని లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ ప్రకటించారు. కోవిడ్ ఫరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా.. ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశం మొత్తం ఆయన పేరు, ప్రఖ్యాతలు విస్తరించాయి. మన భారత చరిత్రలో వేళ్లానుకున్న కథలను ఆయన చిత్రాలుగా ఎంచుకుంటున్నారు. బాహుబలి లాంటి కథతో పాటు ఇప్పుడు ఆదిపురుష్ లాంటి పౌరాణిక చిత్రంలో ఆయన నటించారు. రాముడి పాత్రలో నటించారు గనుకే రావణ దహనం ఈ ఏడాది ఆయనతో చేయిస్తున్నాం అని కుమార్ ప్రకటించారు. ఇక రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన కానుకలను స్వీకరించాడు ప్రభాస్. ఆపై విల్లు ఎక్కుపెట్టి.. రావణ దిష్టిబొమ్మకు సంధించాడు. కార్యక్రమం చివర్లో.. రామావతారంలో ఉన్న నటులకు డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి హారతి పట్టాడు ప్రభాస్. అంతకు ముందు రామాయణంలోని ఘట్టాలు ప్రదర్శించే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆదిపురుష్ టీజర్‌ను సైతం ప్రదర్శించారు. धर्म की विजय हो! 'आदिपुरुष' प्रभास ने दिल्ली की लव कुश रामलीला में तीर चलाकर किया रावण वध..#PrabhasIsAdipurush #Prabhas #Adipurush #Ramleela #LuvKushRamleela #Delhi #RavanDahan pic.twitter.com/bd56ODTe8h — GNTTV (@GoodNewsToday) October 5, 2022 Video Credits: GNTTV Twitter -
పట్టాలపై నరమేథం!
పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో రావణదహనం కార్యక్రమం సందర్భంగా హఠాత్తుగా పెను వేగంతో వచ్చిన రైలు కింద పడి 59మంది మరణించిన దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉత్సవ నిర్వాహకులు మొదలుకొని రైల్వే శాఖ వరకూ ఎవరికి వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ విషాదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ అందరి నిర్లక్ష్యమూ జతకలిసి అమా యకుల ప్రాణాలను బలితీసుకుంది. పండగపూట అయినవారిని పోగొట్టుకుని రోదిస్తున్నవారిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఈ ప్రమాదం మరో 57మందిని తీవ్ర గాయాలపాలు చేసింది. గాయపడినవారిని వెనువెంటనే ఆసుపత్రులకు తరలించడానికి అందుబాటులో ఏ వాహ నమూ లేకపోవడం, నిర్వాహకుల్లో ఒకరైన మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే అక్కడినుంచి జారుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. మృతుల్లో అత్యధికులు కూలి పనుల కోసం బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వలస వచ్చినవారు. ప్రమాదం జరిగాక ఎవరికి వారు ఇస్తున్న సంజాయిషీలు, స్వీయ సమర్థనలు, ఆరోపణలు గమనిస్తే మన నాయకుల నైజం వెల్లడవుతుంది. ఇప్పుడింతగా మాట్లాడుతున్నవారు ప్రమాదం గురించి కాస్తయినా ఊహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఎంచుకున్న స్థలం రైలు పట్టాలకు కేవలం 70 మీటర్ల దూరంలో ఉంది. దాన్ని వీక్షించడానికి ఉన్న స్థలం కేవలం 200మందికి మాత్రమే సరిపోతుంది. ఆ ఒక్క కారణం చాలు కీడు శంకించడానికి. ఇలాంటి కార్య క్రమాలకు జనం భారీయెత్తున హాజరవుతారు. రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కమిటీకి ఇది తెలి యందేమీ కాదు. కనుక ఇంత ఇరుకైన చోటు భద్రమైనది కాదని వారు ఎప్పుడో గ్రహించి ఉండాలి. వారికా అనుమానం రాకపోయినా అనుమతి మంజూరు చేసిన పోలీసు శాఖ అంచనా వేయగలిగి ఉండాలి. ఆ ప్రాంతంలో రావణ దహనం చూడాలంటే సహజంగానే జనం పట్టాలపై చేరకతప్పదు. అంతకన్నా ముందుకెళ్తే టపాసులు వారిపై పడే ప్రమాదం ఉంటుంది. బాగా వెనక్కొస్తే సరిగా కన బడదు. ఏటా కార్యక్రమం నిర్వహించేరోజున ఇలాగే పట్టాలపై నిలబడి చూస్తామని, ఎప్పుడూ ఇంత స్పీడుగా రైళ్లు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈసారి రెండు ట్రాక్‌లపైనా ఎదురెదురుగా ఒకేసారి రైళ్లు రావడం వల్ల, ఆ సమయంలోనే రావణ దహనం కార్యక్రమం మొదలుకావడం వల్ల పేలుళ్ల చప్పుళ్లలో రైళ్ల రాకను జనం పసిగట్టలేకపోయారు. ఫలితంగా వారికి తప్పించుకునే అవ కాశం లేకుండా పోయింది. భారీయెత్తున జనం హాజరయ్యే వేడుకల్లో తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో మన ప్రభుత్వాలు ప్రతిసారీ విఫలమవుతున్నాయి. పన్నెండేళ్లకొకసారి జరిగే కుంభమేళాల్లో కనీసం నాలుగైదు సందర్భాల్లో జనం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. 1954 ఫిబ్రవరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుని 800మంది చనిపోయారు. ఆ తర్వాత సైతం నాలు గైదుసార్లు తొక్కిసలాటలు జరిగాయి. పదులకొద్దీ ఆ ఘటనల్లో చనిపోయారు. బిహార్‌లో 2014లో దసరానాడు జరిగిన రామ్‌లీలా ఉత్సవాల్లో ఇదేమాదిరి తొక్కిసలాటలో 32 మంది మరణించారు. ఇప్పుడు పంజాబ్ ప్రమాదాన్నే తీసుకుంటే ఈ వేడుకల కోసం అవసరమైన అనుమతులన్నీ తీసు కున్నామని నిర్వాహకులు చెబుతారు. వాటి సంగతి తమకు తెలియనే తెలియదని రైల్వేశాఖ అంటుంది. కార్పొరేషన్‌దీ అదేమాట. తమకు కూడా వేడుకలపై సమాచారం లేదని వివరిస్తుంది. మనకు జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ ఉంది. ప్రకృతి వైపరీత్యాలతోపాటే ఇలా భారీయెత్తున జనం గుమిగూడేచోట ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో అది మార్గ దర్శ కాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలు పోలీసు శాఖ దగ్గరుంటాయి. వాటిని సరిగా అధ్య యనం చేసి ఉంటే అక్కడ ఆ కార్యక్రమాన్ని అనుమతించేవారే కాదు. లేదా తొలుత రైల్వేశాఖ అను మతి తీసుకుని రావాలని సూచించేవారు. కనీసం ఆ సమయంలో రైళ్ల రాకపోకలను నియంత్రిం చాలని రైల్వేశాఖనైనా కోరి ఉండేవారు. అసలు నిర్వాహకులు ఎలాంటి అనుమతులూ తీసుకోలే దని అనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించనీయకూడదు. కార్యక్రమం గురించి తమకెవరూ చెప్పలేదని, ప్రజలు అక్రమంగా పట్టాలపైకి వచ్చారని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఆ ప్రాంతంలోని కాలనీ వాసులందరూ తమ రోజువారీ పనుల కోసం అక్కడ నిత్యం పట్టాలు దాటుతున్నారని ఆయనకు తెలుసో లేదో! దగ్గరున్న అండర్‌పాస్ వినియోగానికి తగినట్టుగా ఉండదని స్థానికులు చెబుతున్న మాట. పైగా కాస్త వర్షం వచ్చినా అది నీళ్లతో నిండిపోతుందని వారంటున్నారు. పట్టాలు దాటి అవతలివైపున్న మార్కెట్‌కు వెళ్లడానికి మూడు నిమిషాలు పడితే, దూరంగా ఉన్న రైల్వే గేటు గుండా వెళ్లడానికి అరగంట పడుతుందని, పైగా రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అది తరచు మూసి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని గ్రహించి ఇప్పటికే ఉన్న అండర్‌పాస్‌ను బాగుచేయించి అదనంగా ఒకటిరెండు నిర్మిస్తే మంచిదని రైల్వేశాఖకు ఎప్పుడూ అనిపించలేదు! వాటిని నిర్మించి పట్టాలకు అటూ ఇటూ కంచె నిర్మిస్తే ఇలాంటి ప్రమాదాలకు అవకాశమే ఉండదు. ఇంతటి విషాదం జరిగాకైనా తమ లోటుపాట్ల గురించి సమీక్షించుకుని సరిదిద్దుకుంటామని చెప్ప కపోగా, తప్పంతా అవతలివారిదేనని ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణం. రైల్వే శాఖ తమవైపునుంచి ఎటువంటి దర్యాప్తూ అవసరం లేదని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తు జరిపిస్తామంటోంది. కానీ ఈ దర్యాప్తులు మన దేశంలో చివరి కేమవు తాయో ఎవరికీ తెలియంది కాదు. సమస్యంతా వ్యవస్థల్లోని బాధ్యతారాహిత్యమే. ఆ సంగతిని చిత్తశుద్ధితో అంగీకరించి, చక్కదిద్దడానికి ముందుకొచ్చినప్పుడే ఈమాదిరి విషాదాలకు తెర పడుతుంది. -
రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి
-
రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి
పాట్నా : పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన రావణ దహనం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 32మంది మృతి చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమం నిర్వహించడం అలవాటు. అలాగే పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అయితే విద్యుత్ తీగలు తెగిపడినట్లు వదంతులతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు సహా 23మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా తొక్కిసలాట దుర్ఘటనలో 32మంది దుర్మరణం చెందినట్లు బీహార్ హోంశాఖ కార్యదర్శి అమీర్ సుభాని ప్రకటన చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... బీహార్ ముఖ్యమంత్రితో మాంఝీతో ప్రధాని మోడీ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. కాగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై హోంశాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. -
విజయవాడలో తెప్పోత్సవం, ఢిల్లీలో రావణ దహనం